ఇంట్లోనే సంజయ్‌దత్
ముంబై: రెండు వారాల ఫర్లాగ్(తాత్కాలిక సెలవులాంటిది) బుధవారంతో ముగిసినప్పటికీ, సెలవు పొడిగింపుపై పెట్టుకున్న దరఖాస్తు పెండింగ్‌లో ఉండడంతో బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ ఇంట్లోనే ఉండిపోయాడు. 14రోజుల ఫర్లాగ్ తీసుకున్న వ్యక్తి పై 29వ రోజు వరకూ ఎలాంటి చర్యా తీసుకోలేమని జైళ్లశాఖ విడుదల చేసిన సర్క్యులర్ ద్వారా తెలుస్తోంది. దీని ప్రకారం చూస్తే ఆయనకు మరో 14 రోజుల సెలవు అదనంగా వచ్చినట్లయింది. ఈ కారణంగానే సం జయ్‌పై ఎలాంటి చర్యా తీసుకోవడానికి వీలులేదని, సెలవు అభ్యర్థన తిరస్కరిస్తే 24గంటల్లోపు సంజయ్ లొంగిపోతారని ఆయన న్యాయవాది తెలిపారు. సంజయ్ సెలవు పొడగిం పు అభ్యర్థనను పరిష్కరించడం లో జరుగుతున్న జాప్యంపై విమర్శలు రావడంతో ఈ విషయంలో చట్టప్రకారం వెళ్తామని మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ శుక్రవారం గాంధీనగర్‌లో వ్యాఖ్యానించారు.