మళ్లీ 8,400 పైకి నిఫ్టీ...
స్టాక్ మార్కెట్‌కు స్వల్ప లాభాలు
విదేశీ ఇన్వెస్టర్లపై పన్నుకు సంబంధించిన సర్‌క్యులర్‌ను నిలిపేయాలన్న ప్రభుత్వ నిర్ణయం కారణంగా బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయ సంకేతాలు మిశ్రమంగా ఉన్న నేపథ్యంలో ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మళ్లీ 8,400 పాయింట్లపైకి ఎగబాకింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 22 పాయింట్లు లాభపడి 27.258 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 19 పాయింట్లు లాభపడి 8,417 పాయింట్ల వద్ద ముగిశాయి. లోహ, మైనింగ్ బ్యాంక్ షేర్లు పెరగ్గా.. టెలికం షేర్లు నష్టపోయాయి.
విదేశీ ఇన్వెస్టర్ల షేర్ల పరోక్ష బదిలీపై పన్నులను పెంచడానికి సబంధించిన సర్‌క్యులర్‌ను ప్రభుత్వం నిలిపేయడం కలసివచ్చింది. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ విధానాలపై అనిశ్చితి, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ మార్కెట్ స్వల్పంగా లాభపడింది. రూపాయి క్షీణించినా, విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో తొలిసారి మంగళవారం నికర కొనుగోళ్లు జరపారన్న సమాచారం సానుకూల ప్రభావం చూపింది. విదేశీ ఇన్వెస్టర్లపై పన్ను అంశాన్ని కేంద్రం సస్పెన్షన్‌లో ఉంచడంతో స్టాక్ మార్కెట్ లాభాల్లో ప్రారంభమైందని జియోజిత్ బీఎన్‌పీ పారిబా ఫైనాన్షియల్ సర్వీసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ చెప్పారు.