రెండేళ్లుగా దేశంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాల తగ్గుదల
2021–22లో రూ.9,289 కోట్ల విలువైన మోసాలు
2023–24లో రూ.2,175 కోట్లకు తగ్గుదల
2021–22లో పశ్చిమ బెంగాల్, ఢిల్లీలోనే అత్యధిక ఆర్థిక మోసాలు
లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
సాక్షి, అమరావతి: గత రెండు సంవత్సరాలుగా దేశంలో వాణిజ్య బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో మోసాలు తగ్గాయి. 2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే... 2022–23, 2023–24 ఆరి్థక సంవత్సరాల్లో బ్యాంకుల్లో ఆర్థిక మోసాలు బాగా తగ్గడం విశేషం. ఈ విషయాన్ని కేంద్ర ఆరి్థక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో వెల్లడించారు. 2021–22లో బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో రూ.9,289 కోట్ల విలువైన ఆర్థిక మోసాలు జరిగాయని తెలిపారు. 2022–23 ఆరి్థక సంవత్సరంలో రూ.3,607 కోట్ల విలువైన మోసాలు, 2023–24 ఆరి్థక సంవత్సరంలో రూ.2,175 కోట్ల విలువైన మోసాలు జరిగాయని పంకజ్ చౌదరి వివరించారు. మోసగాళ్లను అరికట్టేందుకు సమగ్ర చర్యలు తీసుకోవడంతో మోసాల సంఖ్య తగ్గిందని ఆయన చెప్పారు.
‘2021–22లో అత్యధికంగా పశి్చమ బెంగాల్‌లో 537 కేసుల్లో రూ.3,391 కోట్ల మోసం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీలో 715 కేసుల్లో రూ.2,630 కోట్లు, మహారాష్ట్రలో 2,233 కేసుల్లో రూ.1,257 కోట్లు, 2022–23లో అత్యధికంగా ఢిల్లీలో 1,743 కేసుల్లో రూ.762 కోట్లు, 2023–24లో తమిళనాడులో అత్యధికంగా 6,468 కేసుల్లో రూ.663 కోట్ల మేర మోసం జరిగింది.’ అని ఆయన తెలిపారు. వాణిజ్య బ్యాంకులు, ఆరి్థక సంస్థల్లో మోసాలను నివారించేందుకు ఆర్‌బీఐ రిస్క్ మేనేజ్‌మెంట్‌పై ఇటీవల తగిన ఆదేశాలు జారీ చేసిందని పేర్కొన్నారు. బ్యాంకుల్లో డెడికేటెడ్ డేటా అనలిటిక్స్ మార్కెట్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఏర్పాటును తప్పనిసరి చేసినట్లు తెలిపారు.
మూడేళ్లలో యూపీఐ చెల్లింపుల్లో రూ.2,145 కోట్ల మోసం
గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 26.99 లక్షల యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) లావాదేవీల్లో రూ.2,145 కోట్ల మేర మోసం జరిగినట్లు పంకజ్ చౌదరి తెలిపారు. లావాదేవీలు, చెల్లింపుల మోసాన్ని నివేదించే సాధనంగా ఆర్‌బీఐ మార్చి 2022 నుంచి వెబ్ అధారిత సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్‌ఫర్మేషన్ రిజిస్ట్రీని అమలు చేస్తోందని చెప్పారు. అన్ని సంస్థలు చెల్లింపుల మోసాలను వెబ్ అధారిత సెంట్రల్ పేమెంట్ ఫ్రాడ్ ఇన్‌ఫర్మేషన్ రిజిస్ట్రీకి నివేదించాల్సి ఉంటుందన్నారు.
లావాదేవీల మోసాలతోపాటు చెల్లింపు సంబంధిత మోసాలను నిరోధించేందుకు ప్రభుత్వం, ఆర్‌బీఐ, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ద్వారా వివిధ కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా ఏఐ అండ్ ఎంఎల్‌ను వినియోగించడం ద్వారా మోసపూరిత లావాదేవీలను బ్యాంకులు తిరస్కరించే విధంగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇది ఆన్‌లైన ఫైనాన్స్ భద్రతను మెరుగుపరిచేందుకు సహాయపడుతుందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment