
ముంబై: స్వయం ఉపాధి పొందే వ్యాపార వర్గాలకు గృహ రుణాలిచ్చే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలకు (హెచ్‌ఎఫ్‌సీ) రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ సూచించింది. ఈ రిస్కీ విభాగంలో మొండిబాకీలు భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణమని ఒక నివేదికలో తెలియజేసింది. గృహ రుణాల మంజూరులో అధిక వృద్ధి సాధించే దిశగా ఆర్థిక సంస్థలు.. ఈ విభాగం వర్గాలకు రుణాలివ్వడంపై మరింతగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో క్రిసిల్ నివేదిక ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నాలుగేళ్ల క్రితం హెచ్‌ఎఫ్‌సీల పోర్ట్‌ఫోలియోలో.. స్వయం ఉపాధి పొందే గృహ రుణగ్రహీతల వాటా 20 శాతంగా ఉండగా... ప్రస్తుతం అది 30 శాతానికి పెరిగిందని క్రిసిల్ పేర్కొంది.
ఇదే సమయంలో స్థూల నిరర్ధక ఆస్తుల (ఎన్‌పీఏ) పరిమాణం 0.40 శాతం నుంచి రెట్టింపై 1.1 శాతానికి పెరిగింది. ఇది గణనీయమైన ప్రభావం చూపకపోయినప్పటికీ.. ఈ విభాగం విషయంలో కాస్త జాగ్రత్త అవసరమని క్రిసిల్ తెలిపింది. అందరికీ గృహాలు సమకూర్చే దిశగా ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు ప్రోత్సాహక చర్యలు తీసుకుంటుండంతో అది గృహ రుణాల వృద్ధికి దోహదపడుతున్నట్లు క్రిసిల్ సీనియర్ డైరెక్టర్ కృష్ణన్ సీతారామన్ తెలిపారు. స్వయం ఉపాధి పొం దేవారి ఆదాయాలన్నీ అంచనాలను బట్టే ఉంటాయి కనక జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment