
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్‌లు (పీఎస్‌బీలు), ఆర్థిక సంస్థలు తుక్కు విక్రయం ద్వారా రూ.4.5 కోట్లు సమకూర్చుకున్నాయి. అక్టోబర్ 2–31 తేదీల మధ్య కేంద్ర ఆర్థిక శాఖ స్వచ్ఛత కార్యక్రమాన్ని (ప్రత్యేక ప్రచారం 4.0) చేపట్టింది.
కస్టమర్ అనుకూల చర్యలు, వసతిని మెరుగ్గా వినియోగించుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా మార్చుకోవడం, తుక్కును వదిలించుకోవడం ఈ కార్యక్రమంలో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌లు, బీమా సంస్థలతోపాటు, నాబార్డ్, సిడ్బీ, ఎగ్జి మ్ బ్యాంక్, ఎన్‌హెచ్‌బీ, ఐఐఎఫ్‌సీఎల్ ఇందులో పాల్గొన్నాయి.
వ్యర్థాలను వదిలించుకోవడం ద్వారా 11.79 లక్షల చదరపు అడుగుల వసతి అదనంగా వినియోగంలోకి వచ్చిందని, రూ.4.50 కోట్లు సమకూరాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం ప్రకటించింది. ప్రజల ఫిర్యాదులు, అప్పీళ్లు పరిష్కరించినట్టు, ప్రధానమంత్రి కార్యాలయం, ఎంపీల సూచనలను పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment