Budget 2023-24: FM proposes to remove tax-free status on certain insurance policies with premium above Rs 5 lakh - Sakshi
Sakshi News home page

Union Budget 2023-24 బీమా కంపెనీలకు షాక్‌, రూ. 5 లక్షలు దాటితే!

Published Wed, Feb 1 2023 5:04 PM | Last Updated on Wed, Feb 1 2023 5:25 PM

FM proposes to remove tax free status on certain insurance policies above Rs 5 lakh premium - Sakshi

సాక్షి,ముంబై: యూనియన్ బడ్జెట్‌లో  వేతన జీవులకు, పన్ను చెల్లింపు దారులకు ఊరట కల్పించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన​ బీమా కంపెనీలకు మాత్రం భారీ షాక్‌ఇచ్చింది.  ఆదాయంపై పన్ను మినహాయింపులను పరిమితం చేయాలని ప్రతిపాదించారు. దీంతో  బీమా కంపెనీలకు డిమాండ్‌ తగ్గపోతుందనే ఆందోళన ఇన్వెస్టర్లను అమ్మకాలవైపు మళ్లించింది. దీంతో బుధవారం నాటి మార్కెట్‌లో బీమా కంపెనీల  షేర్లు భారీగా పతనమైనాయి. 

సాంప్రదాయ బీమా ప్లాన్లపై పన్ను బాదుడుకు సీతారామన్ ప్రతిపాదించారు.పాలసీల మొత్తం ప్రీమియం ఏడాదికి  5 లక్షల రూపాయల కంటే ఎక్కువగా ఉంటే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1, 2023న లేదా ఆ తర్వాత జారీ చేసే  జీవిత బీమా పాలసీల మెచ్యూరిటీపై (ULIPలు మినహాయించి) మొత్తం రాబడిపై పన్ను విధించాలని పేర్కొన్నారు.

ప్రీమియం మొత్తం రూ. 5 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, మొత్తం ప్రీమియం ఉన్న పాలసీల నుండి మాత్రమే ఆదాయం పొందాలని ప్రతిపాదించారు. దీని ప్రకారం అంటే రూ. 5 లక్షలవరకు, 31 మార్చి, 2023 వరకు జారీ చేయబడిన బీమా పాలసీలను కూడా ప్రభావితం చేయదు. అలాగే  బీమా చేయబడిన వ్యక్తి మరణించినప్పుడు పొందే మొత్తానికి అందించే పన్ను మినహాయింపులో ఎలాంటి మార్పు ఉండదు. కొత్త ప్రతిపాదన యూనిట్-లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లపై పన్నును ప్రభావితం చేయదు.

ఈ ప్రకటన ఫలితంగా హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కో, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా, జనరల్ ఇన్సూరెన్స్ కార్ప్, మ్యాక్స్ ఫైనాన్షియల్ 4.5 -11శాతం మధ్య నష్టపోయాయి. 

అయితే, ఇది అధిక విలువ కలిగిన సాంప్రదాయ బీమాలను కొనుగోలు చేయడానికి వ్యక్తుల ఆసక్తిని తగ్గించి, ఇది టర్మ్ ప్లాన్‌లు, రిస్క్ కవర్‌లపై దృష్టిని పెరగడమే మంచి పరిణామమే అయినప్పటికీ పూర్తిగా పెట్టుబడి ఆధారిత యూనిట్ లింక్ ఇన్సూరెన్స్‌ల వైపు గణనీయమైన మార్పుకు దారితీస్తే ఆందోళనకరమని సెక్యూర్‌నౌ ఇన్సూరెన్స్ బ్రోకర్ సహ వ్యవస్థాపకుడు కపిల్ మెహతా చెప్పారు. అంటే, ఎండోమెంట్ ప్లాన్‌లు, మనీ బ్యాక్ ప్లాన్‌లు వంటి సాంప్రదాయ బీమా ప్లాన్లపై పాలసీదారుల ఇంట్రస్ట్‌ తగ్గిపోతుందన్నారు. అంతిమంగా ఇది బీమా కంపెనీలకు నష్టమని భావిస్తున్నారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement