![New vs Old Tax Regime Which One Should You Choose For Income Above Rs 12 75 Lakh](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/New-vs-Old-Tax-Regime.jpg.webp?itok=86e9W62z)
యూనియన్ బడ్జెట్ 2025లో కేంద్రమంత్రి 'నిర్మలా సీతారామన్' (Nirmala Sitharaman) మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కల్పించే విధంగా కొత్త ఆదాయపు పన్ను విధానంలో కొన్ని ప్రధాన మార్పులను ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగానే ప్రాథమిక మినహాయింపు పరిమితిని రూ.4 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. సెక్షన్ 87A కింద రాయితీ కోసం ఆదాయ పరిమితిని రూ.12 లక్షలకు పెంచారు.
నూతన విధానంలో కొత్త శ్లాబుల ప్రకారం మొదటి రూ.4 లక్షల్లోపు ఆదాయం ఉంటే పన్ను పరిధిలోకి రారు. స్టాండర్డ్ డిడక్షన్‌తో కలిపి చూసుకుంటే రూ.12.75 లక్షల ఆదాయం దాటని వేతన జీవులు, పెన్షనర్లు పన్ను చెల్లించక్కర్లేదు. రూ.4–12లక్షల ఆదాయంపై సెక్షన్ 87ఏ కింద రిబేట్ అమల్లో ఉంది. దీనికి రూ.75వేల స్టాండర్డ్ డిడక్షన్ అదనం. అంటే మొత్తంగా రూ.12,75,000 లక్షల ఆదాయం వరకు పన్ను చెల్లించక్కర్లేదు.
వార్షిక ఆదాయం రూ. 12.75 లక్షల కంటే ఎక్కువ ఉంటే.. పాత పన్ను విధానం ఎందుకోవాలా? కొత్త పన్ను విధానం ఎంచుకోవాలా అని కొంత తికమకపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ఏ పన్ను విధానం ఎందుకోవాలో పరిశీలిద్దాం..
కొత్త పన్ను విధానం ఎప్పుడు ఎందుకోవాలంటే..
➤సెక్షన్ 87A కింద పూర్తి రాయితీకి అర్హత ఉన్నందున, రూ. 12 లక్షలు లేదా అంతకంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి.
➤సెక్షన్ 80C (ప్రావిడెంట్ ఫండ్, పీపీఎఫ్, జీవిత బీమా, లేదా హౌసింగ్ లోన్ ప్రిన్సిపల్ తిరిగి చెల్లింపు వంటివి) లేదా సెక్షన్ 80డీ (మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియం) కింద మినహాయింపులు ఉండవు.
➤మీరు భారీ తగ్గింపులను క్లెయిమ్ చేయకపోతే.. కొత్త పన్ను విధానం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది వివరణాత్మక డాక్యుమెంటేషన్ అవసరం లేకుండా తక్కువ పన్ను రేట్లను అందిస్తుంది.
మీరు పాత పన్ను విధానం ఎప్పుడు ఎంపిక చేసుకోవాలంటే..
అధిక తగ్గింపులను క్లెయిమ్ చేయగల వ్యక్తులకు పాత పన్ను విధానం మరింత అనుకూలంగా ఉంటుంది. ఇందులో.. సెక్షన్ 80సీ కింద పీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్ చెల్లింపు మొదలైనవి మాత్రమే కాకుండా.. సెక్షన్ 80డీ కింద వ్యక్తిగత & కుటుంబ సభ్యులకు మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ రెంట్ అలవెన్స్ (HRA), లీవ్ ట్రావెల్ అలవెన్స్ (LTA) వంటివి కూడా ఉన్నాయి. పన్ను చెల్లింపుదారులు ఈ తగ్గింపులను గరిష్టంగా పెంచుకుంటే, వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చు.
కొత్త పన్ను విధానంలో శ్లాబులు
రూ.0-4 లక్షలు - సున్నా
రూ.4-8 లక్షలు - 5 శాతం
రూ.8-12 లక్షలు - 10 శాతం
రూ.12-16 లక్షలు - 15 శాతం
రూ.16-20 లక్షలు - 20 శాతం
రూ.20-24 లక్షలు - 25 శాతం
రూ.24 లక్షల పైన 30 శాతం
పాత పన్ను విధానంలో పన్ను శ్లాబులు
రూ.2,50,001 - రూ.5,00,000 - 5 శాతం
రూ.5,00,000 నుంచి రూ. 10,00,000 - 20 శాతం
రూ.10,00,000 ఆపైన - 30 శాతం
ఇదీ చదవండి: ఎప్పుడు, ఎలా చనిపోతారో చెప్పే డెత్ క్లాక్: దీని గురించి తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment