
సాక్షి, హైదరాబాద్: పంటల పరిహారం చె ల్లింపుల్లో నిర్లక్ష్యం వహి స్తున్న బీమా కంపెనీ లపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 2015–16 వానా కాలం, యాసంగి అలాగే గతేడాది వానాకాలం సీజన్‌కు సంబంధించి పంట నష్ట పరిహారం చెల్లింపులపై బీమా కంపెనీలతో గురువారం ఆయన సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తన వంతు ప్రీమియం చెల్లించిందని, అయినా రైతులకు చెల్లింపులు మందకొడిగా సాగుతుండ టంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు.
2015–16కి సంబంధించి రూ.295 కోట్లను అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఏఐసీ) 4.63 లక్షల మంది రైతులకు పంపిణీ చేయాల్సి ఉంద న్నారు. దీనిపై కంపెనీ ప్రతినిధులు స్పందిస్తూ, ఇందులో 70% పంపిణీ చేశామని, మరో వారం రోజుల్లో మిగతా మొత్తం పంపిణీ చేస్తామని తెలి పారు. 2017 వానాకాలానికి సంబంధించి 4 లక్ష ల మందికి పైగా రైతులకు రూ.483 కోట్లు పరి హారాల చెల్లింపులు మందకొ డిగా సాగుతుండ టంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment