బీమా కంపెనీల ఐపీవోలకు ఐఆర్‌డీఏ సానుకూలం
న్యూఢిల్లీ: సాధారణ బీమా సంస్థలు అవసరాన్ని బట్టి పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కి రావొచ్చంటూ బీమా రంగ నియంత్రణ సంస్థ (ఐఆర్‌డీఏ) ఒక ముసాయిదా ప్రతిపాదనలో పేర్కొంది. దీని ప్రకారం ఐఆర్‌డీఏ నుంచి అనుమతి పొందిన ఏడాది వ్యవధిలోగా సదరు సంస్థ నిర్దేశిత నిబంధనలను పూర్తి చేయాల్సి ఉంటుంది. నియంత్రణ సంస్థ అనుమతి లేకుండా నాన్-లైఫ్ ఇన్సూరెన్స్, రీఇన్సూరెన్స్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలు, కేవలం ఆరోగ్య బీమాకే పరిమితమైన సంస్థలు.. పబ్లిక్ ఇష్యూ కోసం సెబీకి దరఖాస్తు చేసుకోవడానికి ఉండదు.