సాక్షి, పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం వద‍్ద ఉన‍్న కియా ఫ్యాక్టరీ దగ్గర కంటైనర్‌లోని జనరేటర్ వద్ద నిద్రించిన ఇద‍్దరు కూలీలు మృతిచెందారు. నారాయణ, రామాంజినేయులు అనే కూలీలు సోమవారం రాత్రి కంటైనర్‌లోని జనరేటర్ వద‍్ద నిద్రపోయారు. అయితే అక‍్కడ ఊపిరాడకపోవడంతో వారు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు.