Kiya
-
కియాలో డీలర్షిప్ ఇస్తామంటూ మోసం
హిమాయత్‌నగర్: ప్రముఖ కార్ల కంపెనీ కియా ఇండియా డీలర్షిప్ నీదేనంటూ గుడిమల్కాపూర్‌కు చెందిన ఓ వ్యాపార వేత్తకు సైబర్ నేరగాళ్లు వల వేశారు. పలు డాక్యుమెంట్ల రూపంలో అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు కాజేశారు. డీలర్షిప్ ఇవ్వకపోవడంతో సోమవారం బాధితుడు సిటీ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏసీపీ కేవీఏ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రమణకుమార్ కియా కార్ల డీలర్షిప్ కోసం గూగుల్‌లో సెర్చ్ చేశాడు. దీంతో ఇటీవల ఓ వ్యక్తి కాల్ చేసి తాను కియా కంపెనీకి సంబంధించిన వ్యక్తినని తెలిపాడు. ఇండియా డీలర్షిప్ ఇస్తామంటూ నమ్మించాడు. పలు డాక్యుమెంట్స్ తదితర ఖర్చులంటూ రూ.11లక్షలు దోచుకున్నారు. డీలర్షిప్ ఆలస్యం కావడంతో ఇదంతా బోగస్ అని గుర్తించి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. క్రిప్టోకరెన్సీ పేరుతో రూ.25 లక్షలు స్వాహా.. క్రిప్టో కరెన్సీలో లాభాలు ఇస్తామంటూ నగరానికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. సైబర్‌క్రైం ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌కు చెందిన గుంజన్‌శర్మ క్రిప్టోకరెన్సీలో బినాన్స్ కొనుగోలు చేసి వాటిని జీడీఎక్స్ అనే యాప్‌లో పెట్టుబడిగా రూ.25లక్షలు పెట్టాడు. ఆ మొత్తానికి లాభాలు చూపిస్తున్నారే కానీ డబ్బు డ్రా చేసేందుకు ఇవ్వట్లేదు. వారి నుంచి ఏ విధమైన స్పందన రాకపోవడంతో ఇదంతా ఫేక్ అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ కేవీఎం ప్రసాద్ చెప్పారు. (చదవండి: పోలీసు కస్టడీకి అభిషేక్, అనిల్ ) -
కంటైనర్లలోనే వారి కాపురాలు
సాక్షి, పెనుకొండ : ఈ భవనం కియా కార్ల పరిశ్రమ సమీపంలోని ఎర్రమంచి రహదారిలో కంటైనర్లతో నిర్మించారు. ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విస్తరించిన దీని పేరు ‘విదమ్ హాస్పెటాలిటీ’ పేరుతో కొరియన్లకు ఆతిథ్యం కల్పిస్తున్నారు. బేగ్ అనే కొరియన్ దీనిని నిర్వహిస్తున్నాడు. కంటైనర్లలో భవంతులు నిర్మించి నిబంధనలకు తూట్లు పొడిచారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి నిర్మాణాలు కియా కార్ల పరిశ్రమ ప్రాంతంలో అనేక మంది నిర్వహిస్తున్నారు. పెనుకొండ మండలంలో కియా కార్ల పరిశ్రమ ప్రారంభమై రెండేళ్లవుతోంది. ఇందులో పని చేయడానికి వందలాది మంది కొరియన్లు వారి దేశం నుంచి ఇక్కడికి వచ్చారు. పలువురు కొరియన్లు సమీపంలోని భవనాల్లో బాడుగలకు ఉంటున్నారు. మరి కొందరు కంటైనర్ బాక్సులతో రూపొందించిన భవనాల్లో నివసిస్తున్నారు. లక్షలాది రూపాయలు అద్దెలు చెల్లిస్తున్నారు. భద్రత డొల్ల.. కంటైనర్లలో కాపురం ఉండడం అంత శ్రేయస్కరం కాదని పలువురు పేర్కొంటున్నారు. ఏ మాత్రం షార్ట్‌సర్క్యూట్ జరిగినా, ఏ ఇతర ప్రమాద సమయాల్లోనైనా ప్రాణాపాయం తప్పదని అభిప్రాయపడుతున్నారు. 2017లో కంటైనర్‌లో నివాసం ఉంటున్న తాడిపత్రికి చెందిన ఇద్దరు బేల్దార్లు పొగ ప్రమాదం బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో కంటైనర్ కాపురాలు మరిన్ని పెరగడం ఆందోళన రేపుతోంది. అనుమతులు ప్రశ్నార్థకమే? ఒక భవనం నిర్మించాలంటే గ్రామ పంచాయతీ లేదా అహుడా అనుమతి ఉండాలి. అయితే కంటైనర్ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని, కేవలం ధనార్జనే ధ్యేయంగా నిర్మాణాలు జరుగుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏ ఒక్క అధికారి కూడా దీనిని ప్రశి్నంచకపోవడంతో నిర్మాణాలు మరింత జోరందుకుంటున్నాయి. అధికారులు చేతివాటం ప్రదర్శించడం వల్లే వీటి నిర్మాణాలు అధికమవుతున్నాయనే విమర్శలుమున్నాయి. ఇప్పటికే ఎర్రమంచి, హరిపురం, అమ్మవారుపల్లి, దుద్దేబండ ప్రాంతాల్లో ఈ నిర్మాణాలు జరిగాయి. కియా, ఏపీఐఐసీ అతిథి గృహాలు సైతం కంటైనర్లతో నిరి్మంచడం గమనార్హం. అధికారులు తగిన చర్యలు తీసుకుని ఇలాంటి నిర్మాణాలకు ఫుల్స్టాప్ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
ఆగస్టు 8న జిల్లాకు ముఖ్యమంత్రి
సాక్షి, అనంతపురం : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు రానున్నారు. ఈ నెల 8న ఆయన ‘కియా’ పరిశ్రమ సందర్శనకు విచ్చేస్తున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అలాగే నవరత్నాల అమలుపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల్లోని సమస్యలకు సంబంధించి నివేదికను అందజేయాలన్నారు. ‘కియా’ పరిశ్రమ యాజమాన్యంతో జేసీ–2, పరిశ్రమల శాఖ జీఎం, ఏపీఐఐసీ జీఎం సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
ఉద్యోగుల 'కియా' మొర్రో
సాక్షి, పెనుకొండ(అనంతపురం) : ‘కియా’తో ఉద్యోగాలు లభిస్తాయని, తమ జీవితాలే మారిపోతాయని ఆశపడిన ‘అనంత’ ఆశలన్నీ ఆవిరవుతున్నాయి. జిల్లాలో కంపెనీ ఏర్పాటైనా...అక్కడ ఉద్యోగుల్లో మనవాళ్లు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. పరిశ్రమలలో 75 శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసినా.. కియా, దాని అనుబంధ సంస్థల్లో అమలు కావడంలేదు. పైగా ‘కియా’లో 80 శాతం మంది ఉద్యోగులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వారే కావడంతో...తెలుగువాళ్లంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పనిగంటలు పెంచడం...వారాంతపు సెలవు ఇవ్వకుండా తెలుగువారికి నరకం చూపిస్తున్నారు. చివరకు వారే విసిగిపోయి ఉద్యోగాలు వదిలి పారిపోయేలా చేస్తున్నారు. ఆది నుంచీ వివక్షే! ‘కియా’ పరిశ్రమలో తెలుగువారిపై ఆది నుంచీ వివక్షే కొనసాగుతోంది. నైపుణ్యం పేరుతో వివక్ష చూపిస్తూ తమిళనాడు ప్రాంతానికి చెందిన వారికే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తున్నారు. ‘కియా’ అనుబంధ పరిశ్రమ ‘హుందాయ్’ గతంలో తమిళనాడులో ఉండటం, ఆ చనువుతో తమిళనాడు ప్రాంతం వారికే ఇక్కడి ‘కియా’లో ఎక్కువగా ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మరోవైపు ఉద్యోగుల్లో అరకొరగా ఉన్న తెలుగు ఉద్యోగులపై వేధింపులకు దిగుతున్నారు. వేతనాలు, పనిగంటలు, తదితర అన్ని విషయాల్లోనూ చిన్నచూపు చూస్తున్నారు. భూ బాధిత కుటుంబాలకూ దక్కని ఉద్యోగాలు ‘కియా’ పరిశ్రమ కోసం భూములు కోల్పోయిన రైతు కుటుంబాల పిల్లలు ఎందరో ఎంటెక్, బీటెక్, ఎంసీఏ, ఎంబీఏ లాంటి ఉన్నత చదువులు చదివినా కియాలో ఉద్యోగాలు ఇవ్వడం లేదు. కనీసం అరకొరగా ఉన్న తెలుగువారికి సరైన గుర్తింపు లభించలేదు. ఈ విషయమై గతంలో పలుమార్లు ‘కియా’ పరిశ్రమ ఎదుటనే తెలుగువారు ధర్నాలు, ఆందోళనలు నిర్వహించారు. పరిశ్రమ కోసం భూములు సేకరించినప్పుడు స్థానికులకే వందశాతం ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన అధికారులు, నాయకులు వాటిని సాధించడంలో పూర్తిగా విఫలమయ్యారు. కనీసం భూబాధిత రైతుల కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించలేకపోతున్నారు. ‘సంగ్వూ’ ఎదుట ధర్నా తెలుగువారిపై చూపుతున్న వివక్షను నిరిస్తూ సోమవారం ఉదయం పెనుకొండ మండలం దుద్దేబండ సమీపంలోని కియా అనుబంధ కంపెనీ ‘సంగ్వూ’ హైటెక్ కంపెనీ ఎదురుగా తెలుగు ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. వెంటనే పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళన చేస్తున్న వారిని చెదరగొట్టడంతో వారంతా అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లారు. -
కంటైనర్‌లో ఊపిరాడక ఇద్దరు కూలీలు మృతి
సాక్షి, పెనుకొండ: అనంతపురం జిల్లా పెనుకొండ మండలం హరిపురం వద్ద ఉన్న కియా ఫ్యాక్టరీ దగ్గర కంటైనర్‌లోని జనరేటర్ వద్ద నిద్రించిన ఇద్దరు కూలీలు మృతిచెందారు. నారాయణ, రామాంజినేయులు అనే కూలీలు సోమవారం రాత్రి కంటైనర్‌లోని జనరేటర్ వద్ద నిద్రపోయారు. అయితే అక్కడ ఊపిరాడకపోవడంతో వారు మృతిచెందినట్లు సమాచారం. ఈ సంఘటన మంగళవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
కియా.. ప్రియా..!
ఇప్పటి వరకు విదేశాలకు చెందిన సారా, బార్బీ, పుల్లిప్, పుల్లా లాంటి బొమ్మలనే చిన్నారులకు అందించి సంబరపడ్డాం. అయితే ఎక్కడో ఒకచోట మన భారతీయతకు దర్పణం పట్టే భారతీయ బొమ్మ ఉంటే బాగుండేదని సగటు భారతీయునికి అనిపిస్తుంది. అలాంటి ఆలోచనల నుంచి పుట్టిన అచ్చమైన భారతీయ బొమ్మే ‘కియా’. ఎర్రమంజిల్‌లోని ఎన్కేయం గ్రాండ్ హోటల్లో మంగళవారం కియా బొమ్మ సృష్టికర్త హిమ శైలజా దాని ప్రాముఖ్యతను వివరించారు. భారతీయ సంస్కృతిని, చరిత్రను తెలియజేసేలా ఈ బొమ్మను రూపొందించినట్లు ఆమె చెప్పారు. చిన్నారులు ఈ కియా బొమ్మను అమితంగా ఇష్టపడుతున్నారన్నారు. వివిధ రూపాల్లో భారతీయ సంప్రదాయాలకు దర్పణం పట్టేలా తీర్చిదిద్దిన ఈ బొమ్మలు చిన్నారులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఈ బొమ్మలను ఆన్లైన్ స్టోర్స్‌లోకి విడుదల చేశారు. ఇవి ఆన్లైన్ మార్కెట్లో మాత్రమే లభ్యమవుతాయన్నారు. - సాక్షి, సిటీ ప్లస్