
సాక్షి, అనంతపురం : వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి జిల్లాకు రానున్నారు. ఈ నెల 8న ఆయన ‘కియా’ పరిశ్రమ సందర్శనకు విచ్చేస్తున్నట్లు కలెక్టర్ సత్యనారాయణ వెల్లడించారు. సీఎం పర్యటన నేపథ్యంలో కలెక్టర్ బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై చర్చించారు. అలాగే నవరత్నాల అమలుపై నివేదిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వివిధ శాఖల్లోని సమస్యలకు సంబంధించి నివేదికను అందజేయాలన్నారు. ‘కియా’ పరిశ్రమ యాజమాన్యంతో జేసీ–2, పరిశ్రమల శాఖ జీఎం, ఏపీఐఐసీ జీఎం సమన్వయం చేసుకుని ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.