నేటి నుంచి కార్మిక సంఘాల పాదయాత్ర | labours walking tour on today starts | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కార్మిక సంఘాల పాదయాత్ర

Published Tue, Sep 13 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

labours walking tour on today starts

– 21న కలెక్టరేట్‌ వద్ద నిరవధిక నిరాహార దీక్ష
– 24న కలెక్టరేట్‌ ముట్టడి
– కార్మిక చట్టాల అమలే లక్ష్యం


అనంతపురం అర్బన్‌ : జిల్లాలో పరిశ్రమలను నెలకొల్పి స్థానికులకు ఉపాధి చూపించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. కార్మిక చట్టాల అమలుకు బుధవారం నుంచి పాదయాత్ర చేపడుతున్నామన్నారు. హిందూపురంలో ప్రారంభమయ్యే ఈ యాత్ర ఈ నెల 20 వరకు ఐదు ప్రాంతాల్లో 100 గ్రామాల ద్వారా 500 కిలోమీటర్ల మేర సాగుతుందన్నారు. మంగళవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో సీఐటీయూ నగర అధ్యక్షుడు గోపాల్‌ అధ్యక్షతన జరిగిన కార్మిక సంఘాల సమావేశంలో నాయకులు మాట్లాడారు. కార్మికులు అనేక త్యాగాలు, పోరాటాల ద్వారా సాధించుకున్న హక్కులను, చట్టాలను కాలరాసే∙దిశగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవడం దుర్మార్గపు చర్యన్నారు. 

బుధవారం హిందూపురంలో ప్రారంభమయ్యే పాదయాత్రకు సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్‌ హాజరవుతారన్నారు. 16న కదిరి, 17న గుంతకల్లు, 18న తాడిపత్రి , అదే రోజున నగరంలో పాదయాత్ర సాగుతుందన్నారు.  20వ తేదీ నాటికి అన్ని పాదయాత్రలు అనంతపురం చేరుకుంటాయన్నారు. 21న కలెక్టరేట్‌ ఎదుట నిరవధిక నిరాహార దీక్షలు ప్రారంభిస్తామన్నారు. 22న అన్ని రాజకీయ పార్టీలతో సంఘీభావ సభ నిర్వహిస్తామని, 24న కలెక్టరేట్‌ ముట్టడిస్తామన్నారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి వెంకటేశ్, వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షులు మరువపల్లి ఆదినారాయణరెడ్డి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షురాలు శకుంతలమ్మ, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు వీరమణ, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఉపేంద్ర, ఏఐయూటీయూసీ జిలా కార్యదర్శి సుబ్రమణ్యం, ఐద్వా జిల్లా కార్యదర్శి సావితి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement