కేటరింగ్‌ మేనేజర్‌ పై చేయి చేసుకున్న శివసేన ఎమ్మెల్యే | Shiv Sena MLA Abusing Catering Manager Over Food Quality | Sakshi
Sakshi News home page

కేటరింగ్‌ మేనేజర్‌ పై చేయి చేసుకున్న శివసేన ఎమ్మెల్యే

Published Tue, Aug 16 2022 11:27 AM | Last Updated on Tue, Aug 16 2022 11:27 AM

Shiv Sena MLA  Abusing Catering Manager Over Food Quality - Sakshi

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే పార్టీకి చెందిన శివసేన ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ మేరకు ఆయన ఫుడ్‌ కేటరింగ్‌ మేనేజర్‌ పై చేయి చేసుకుని, దుర్భాషలాడుతున్న ఒక​ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మహ​రాష్ట్రలోని హింగోలి జిల్లాలో మధ్యాహ్నా భోజన పథకంలో భాగంగా భాగంగా కూలలీలకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయని ఎమ్మె‍ల్యే తెలిపారు.

దీంతో తానే స్యయంగా పరిశీలించేందుకు వచ్చానని అన్నారు. అంతేకాదు కూలీలకు నాశిరకం భోజనం అందిస్తున్న సదరు మేనేజర్‌ పై చేయి చేసుకుని, గట్టిగా చివాట్లు పెట్టారు. ఎమ్మెల్యే సంతోష్‌ బంగర్‌ మహారాష్ట్ర అసెంబ్లీలో షిండే ప్రభుత్వం బలపరీక్ష నిరూపించుకోవాడానికి కొద్ది నిమిషాల ముందు ఆయన పార్టీలో చేరారు.

శివ సేన నాయకత్వం ఆయనను హింగోలి ప్రెసిడెంట్‌ పదవి నుంచి తొలగించింది. అంతేకాదు గతంలో సంతోష్‌ బంగర్‌ ఓ  వైరల్‌ వీడియోలో మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే అధ్యక్షతన తిరుబాటు చేసిని ఎమ్మెల్యేలను తిరిగి వచ్చేయండి, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ థాక్రే మిమ్మల్ని క్షమిస్తాడంటూ వార్తల్లో నిలిచారు.

(చదవండి: బీహార్‌లోనూ మహారాష్ట్ర సీన్‌ రిపీట్‌??.. షిండేలాగే నితీశ్‌ కూడా..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement