ముంబై: మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. శివసేన ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంపై స్పీకర్ రాహుల్ నార్వేకర్ కీలక నిర్ణయం వెల్లడించారు. సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గమే అసలైన శివసేన అని స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది. 37 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏక్‌నాథ్ షిండే వర్గానికే ఉందని తెలిపారు. 2013 తర్వాత పార్టీ సంస్థాగత ఎన్నికలు జరగలేదని అన్నారు.
శివసేన నుంచి సీఎం ఏక్‌నాథ్ షిండేను తొలగించే అధికారం శివసేన (యూబీటీ) వర్గం నేత అయిన ఉద్ధవ్ ఠాక్రేకు లేదని స్పీకర్ స్పష్టం చేశారు. ఏ వర్గం నిజమైన పార్టీ అని తెలపడానికి నిర్ణయించే జాతీయ కార్యవర్గ సమావేశం జరిగినట్లు శివసేన(యూబీటీ) వర్గం ఎటువంటి ఆధారం సమర్పించలేదని తెలిపారు. శివసేన పార్టీ చీఫ్‌గా ఉద్దవ్ ఠాక్రే కొనసాగాలని ఆ వర్గం నేతల ఇచ్చిన ఫిర్యాదును స్పీకర్ రాహుల్ నార్వేకర్ తిరస్కరించి.. శివసేన పార్టీకి చీఫ్‌గా సీఎం ఏక్‌నాథ్ షిండేను అడ్డుకోలేమని తెలిపారు.
మహారాష్ట్రలో 16 మంది శివసేన ఎమ్మెల్యేల అనర్హతపై ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సుప్రీకోర్టు ఆదేశాలను గౌరవిస్తున్నానని మహారాష్ట్ర స్పీకర్ రాహుల్ నార్వేకర్ అన్నారు. పార్టీ నాయకత్వంపై శవసేనలోని ఇరు వర్గాలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ మేజార్టీ ఒక్కటే ప్రధామైన అంశమని అన్నారు. నాయకత్వ నిర్మాణాన్ని పరిగణలోకి తీసుకోని సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. ఎన్నికల సంఘానికి షిండే, ఉద్దవ్ వర్గాలు సమర్పించిన ఫిర్యాదుల్లో ఏకాభిప్రాయం లేదని తెలిపారు.
మహారాష్ట్రలోని శివసేనకు చెందిన 34 ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు గడువు బుధవారం ముగిసింది. ఈ నేపథ్యంలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ప్రస్తుత సీఎం ఎక్‌నాథ్ షిండే వర్గాల ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లపై తీవ్ర ఉత్కంఠ కొనసాగింది. ఈ వ్యవహారంలో స్పీకర్ రాహుల్ నార్వేకర్ నిర్ణయంపై ఇరు వర్గాల్లో ఆసక్తి నెలకొనగా.. స్పీకర్ నిర్ణయంతో ఏక్‌నాథ్ షిండే వర్గానికి భారీ ఊరట లభించింది.
2022 జూన్‌లో ఏక్‌నాథ్ షిండే, పలువురు ఎమ్మెల్యేలు శివసేన పార్టీ చీల్చి బయటకు వచ్చారు. దీంతో మహా వికాస్ అఘడి ప్రభుత్వం అధికారం కోల్పోయింది. ఇక.. ఏక్‌నాథ్ షిండే, పలువురి రెబల్ ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ చేరాడు. బీజేపీ మద్దతు ఆయన మహారాష్ట్ర సీఎంగా అధికారం చేపట్టారు. అయితపాటు శివసేన నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యే మంత్రుల పదవలు దక్కటం గమనార్హం.
చదవండి: భారీ స్థాయిలో కమలం ఆపరేషన్.. 1984 తర్వాత సాధించని ఫీట్ కోసం..!
Comments
Please login to add a commentAdd a comment