శ్రీకాకుళం: పరిశ్రమలోకి ప్రవేశించిన ఎలుగుబంటి నానా బీభత్సం సృష్టించి.. కార్మికులపై దాడి చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని కాకరపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామంలోని ఈస్ట్‌కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ లేబర్ కాలనీలోకి ప్రవేశించిన ఎలుగుబంటి అడ్డొచ్చిన వారిపై దాడికి దిగింది. ఎలుగుబంటి బారిన పడిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.
కాగా.. అడవిలో కట్టెలు కొడుతున్న కూలీల వద్దకు వెళ్లి దాడి చేసింది. అయితే వారు తిరగబడి ఎలుగు బంటిని గొడ్డలితో నరికి చంపేశారు. అప్పటికే ఇద్దరు కూలీలను ఆ ఎలుగుబంటి గాయ పరచినట్టు సమాచారం.