bear attacks
-
మూడురోజులు ముప్పుతిప్పలు.. ఎలుగుబంటి అనూహ్య మృతి!
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరులో గత మూడు రోజులుగా అందరినీ టెన్షన్ పెట్టిన ఎలుగుబంటి ప్రాణాలు కోల్పోయింది. సోమవారం పలువురిపై దాడి చేసి గాయపరిచిన ఎలుగుబంటిని అటవీశాఖ అధికారులు మంగళవారం ఉదయం మత్తు మందు ఇచ్చి పట్టుకున్నారు. అయితే అస్వస్థతకు గురయిన ఎలుగుబంటి రెస్య్కూ సెంటర్లో చికిత్స అందిస్తుండగానే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఎలుగుబంటి మృతిపై కారణాలు తెలియాల్సి ఉందని జూ అధికారులు అన్నారు. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చాకనే మృతికి సంబంధించి కారణాలు తెలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఆదివారం కిడిసింగిలో జీడి రైతు కోదండరావుపై దాడిచేసి ప్రాణాలు తీసిన ఈ ఎలుగుబంటి సోమవారం ఆరుగురిని గాయపరచడంతో ఉద్దానమంతా ఉలిక్కిపడిన సంగతి తెలిసిందే. చదవండి: (14 ఏళ్ల బాలిక.. 40 ఏళ్ల వ్యక్తితో నిశ్చితార్థం) -
శ్రీకాకుళం జిల్లాలో భయబ్రాంతులకు గురిచేసిన ఎలుగుబంటి మృతి
-
శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటి బీభత్సం..
సాక్షి, శ్రీకాకుళం: జిల్లాలోని వజ్రపుకొత్తూరులో ఎలుగు బంటి బీభత్సం సృష్టించింది. జీడి, కొబ్బరి తోటల్లో పని చేస్తున్న 8 మంది రైతులపై ఎలుగుబటి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో ఏడుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. కేసు నమోదు చేసుకున్న వజ్రపుకొత్తూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా రెండురోజులుగా గ్రామ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఎలుగుబంటి ఆదివారం రైతుపై దాడి చేసి గాయపరిచింది. సోమవారం రోజు స్థానికులు అప్రమత్తతో ఉన్నప్పటికీ మరోసారి దాడి చేసి గ్రామస్తులను గాయపరిచింది. భయంతోనే పొలం పనులకు గుంపులుగా వెళ్లిన గ్రామస్తులపై ఒక్కసారిగా పొదల నుంచి వచ్చిన ఎలుగుబంటి దాడి చేసింది. దీంతో గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. ఎలుగు బంటి సంచారం నేపథ్యంలో అటవీ అధికారులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు విషయం తెలుసుకున్న మంత్రి సీదిరి అప్పలరాజు ఆరా తీశారు. క్షతగాత్రులకు కార్పొరేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు. ఎలుగుబంటిని అదుపుచేసేందుకు అటవీశాఖ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. -
హృదయ విదారకం.. కళ్లు పీకేసిన ఎలుగుబంటి
సాక్షి, రాజన్నసిరిసిల్ల(కరీంనగర్): రాజన్న సిరిసిల్లలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. రుద్రంగి మండల కేంద్రంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. దేగావత్ తండాకు చెందిన గంగాధర్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసి అతడి కళ్లను పీకేసింది. స్థానికులు పెద్ద ఎత్తున అరుపులు,కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడినుంచి అడవిలోకి పారిపోయింది. దీంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తిని స్థానికులు నీళ్లు తాగించి మెరుగైన చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
భయానకం: తెలివిగా తప్పించుకున్నాడు
రోమ్: సాధారణంగా ఎలుగుబంటిని చూడగానే ఎంతటి వారైనా భయంతో పరుగెడుతారు. ఇక చిన్నపిల్లల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భయంతో బెంబేలెత్తిపోతారు. కానీ ఓ 12 ఏళ్ల బలుడు ఎలుగుబంటి తనను వెంబడించినప్పటికీ ఆందోళన చెందకుండా తప్పించుకున్న భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ మంగళవారం ట్వీట్ చేశాడు. భయానక పరిస్థితుల్లో కూడా సమయస్ఫూర్తిగా వ్యవహిరించిన సదరు బాలుడిపై ట్విటర్లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. (వైరల్: ‘ఉత్తమమైన దొంగతనం.. అద్భుతం’) వివారాలు... ఉత్తర ఇటలీకి చెందిన అలెశాండ్రో(12) అనే బాలుడు తన కుటుంబంతో కలిసి ట్రెంటినో కొండలకు షికారుకు వెళ్లాడు. ఆ కొండలపై నుంచి కిందకు వస్తున్న అలేశాండ్రోను గోధుమ వర్ణపు ఎలుగుబంటి వెనకాలే వెంబడిచింది. భల్లూకాన్ని గమనించిన శాండ్రో భయంతో పరుగు తీయకుండా మెల్లిగా నడుచుకుంటూ క్షణాల్లో దాని నుంచి తప్పించుకున్న ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. (ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..) ఈ సంఘటనపై అలేశాండ్రో మాట్లాడూతూ.. ‘ఆ సమయంలో పరిగేత్తడం ముఖ్యమే. అయితే అది ప్రమాదంలో ఉందని తెలియకుండా వ్యవహిరించాలి లేదా మనం దాని శత్రువులం కాదన్న విషయం అర్థమయ్యేలా చేయడం కూడా ముఖ్యమే. అందుకే పరుగెత్తకుండా మెల్లిగా నడిచాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అతడి మామయ్య ఓ పత్రికతో మాట్లాడుతూ.. ‘‘మేమంతా కుటుంబంతో ట్రెంటినో కొండలకు షికారుకు వెళ్లాము. తిరిగి వెళ్లిపోయేముందు కొండపై ఉన్న మా వస్తువులను తీసుకురావడానికి అలెశాండ్రో వెళ్లాడు. అక్కడ జనాలు ఉన్నప్పుటికీ ఆ ఎలుగుబంటి నెమ్మదిగా ఆ చెట్ల పొదల్లోంచి వచ్చింది. దానిని గమనించిన అలెశాండ్రో వీడియో తీయమని సూచించాడు. ఆ సమయంలో అతడు ఎలుగుబంటి నుంచి నెమ్మదిగా దూరంగ నడుస్తూ తప్పించుకున్నాడు’’ అని పేర్కొన్నాడు. -
భయంతో బెంబేలెత్తిపోతారు
-
ఎలుగుబంటి దెబ్బకు తోక ముడిచిన పులులు
జైపూర్ : రాజస్థాన్‌లోని రథంబోర్ నేషనల్ పార్క్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి.. రెండు పులలను వేటాడింది. తన మీద దాడికి వచ్చిన పులిని ఎలుగుబంటి భయపెట్టించి..పరుగులు పెట్టించింది. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. అయితే ఈ వీడియోను నెల రోజుల క్రితమే రథంబోర్ నేషనల్ పార్క్ యూట్యూబ్‌లో షేర్ చేసినప్పటికీ.. తాజాగా దీనిని రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాథ్వానీ మంగళవారం ట్విటర్లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. పార్క్‌లో ఏమరపాటుగా ఉన్న ఓ ఎలుగుబంటిని పులి బెదిరించడానికి ప్రయత్నించింది. అది గమనించిన ఎలుగు ఒక్కసారిగా తన ముందు కాళ్లు ఎత్తి పులిని బెదిరించింది. దీంతో పులి భయపడి వెంటనే పరుగులు పెట్టింది. దాన్ని వెంబడించిన ఎలుగుబంటికి దారిలో మరో పులి ఎదురవడంతో వెనకడుగు వేయకుండా రెండు పులులను భయపెట్టింది. దీంతో రెండు పులులు భయంతో పరుగులు తీశాయి. అనంతరం ఎలుగు సైతం వెనక్కితిరిగి వెళ్లిపోయింది. పరిమల్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే కొన్ని వేల మంది వీక్షించగా.. అనేకమంది లైకులు కొడుతున్నారు...‘వైల్డ్ లైఫ్‌లో ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
ఉద్దానంలో ఎలుగుబంటి బీభత్సం
సోంపేట: శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఆదివారం ఓ ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. భార్యాభర్తలపై దాడి చేసి చంపేసింది. మరో ఎనిమిది మందిని గాయపరిచింది. దీని దాడిలో రెండు ఎడ్లు కూడా తీవ్రంగా గాయపడ్డాయి. చివరకు ప్రజల దాడిలో ప్రాణాలు కోల్పోయింది. సోంపేట మండలం సిరిమామిడి పంచాయతీ ఎర్రముక్కాం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన బైపల్లి ఊర్మిళ(44) ఇల్లు ఊడ్చిన చెత్తను బయట వేయడానికి గ్రామ పొలిమేరల్లో ఉన్న తుఫాను రక్షిత భవనం వద్దకు వెళ్లింది. ఇంతలో ఆమెపై ఎలుగు దాడికి దిగింది. ఆమె కేకలు వేయడంతో భర్త తిరుపతి(48) ఊర్మిళను రక్షించడానికి ప్రయత్నించాడు. దీంతో అతనిపైనా ఎలుగు దాడిచేసింది. వీరిద్దరిని రక్షించడానికి గ్రామానికి చెందిన బైపల్లి దుర్యోధన, బైపల్లి పాపారావు, బైపల్లి రవి, బైపల్లి అప్పలస్వామి, రట్టి అప్పన్న ప్రయత్నించగా వారిని కూడా ఎలుగు గాయపరిచింది. దీంతో స్థానికులు క్షతగాత్రులను పలాస సామాజిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఊర్మిళ మరణించింది. బైపల్లి తిరుపతి, అప్పలస్వామి, దుర్యోధనల పరిస్థితి విషమించడంతో వారిని విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తిరుపతి కూడా కన్ను మూశాడు. వీరిపై దాడి చేసిన ఎలుగు సిరిమామిడి గ్రామానికి చెందిన కె. చిట్టయ్యతో పాటు మందస మండలానికి చెందిన బి.గోపాల్, జె.నారాయణ, ఎం.పాపారావులపైనా దాడి చేసింది. ఎర్రముక్కాం గ్రామానికి చెందిన బైపల్లి హేమరాజు కాడెడ్లపై దాడి చేయడంతో ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చుట్టు పక్కల గ్రామాల వారు హడలిపోయారు. తలుపులు వేసి ఇళ్లలోనే ఉండిపోయారు. ఆఖరకు మందస మండలం పితాళి గ్రామంలో ఎలుగును స్థానికులు హతమార్చారు. పలాస సామాజిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్ఛాపురం, పలాస సమన్వయకర్తలు పిరియా సాయిరాజ్, డాక్టర్ సీదిరి అప్పలరాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు డాక్టర్ నిమ్మాన దాసు పరామర్శించారు. -
ఎలుగా.. మజాకా..!
ఒరిస్సా, జయపురం: దారిలో కనిపించిన ఒక ఎలుగుబంటి ఫొటో తీసేందుకు ప్రయత్నించిన యువకుడు అది దాడి చేయడంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ సంఘటన బుధవారం సాయంత్రం నవరంగ్‌పూర్ జిల్లా కొడింగ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ సంఘటనలో మరణించిన యువకుడిని నవరంగ్‌పూర్ జిల్లా పపడహండి సమితి దొలైగుడ గ్రామానికి చెందిన ప్రభుభోత్రగా గుర్తించారు. ప్రభు భొత్ర కొంత మంది మిత్రులతో కలిసి పపడహండి గ్రామం నుంచి బొలెరో వాహనంలో ఒక గ్రామానికి వెళ్లి పనులు చూసుకుని వారిని దింపివేసి తిరిగి వాహనంలో ఒక్కడే వస్తున్నాడు. ఈ క్రమంలో కిర్చిమాల ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో గల కుజాగుడ గ్రామ సమీప పొదబొస సంరక్షిత అడవిలో ఒక చెరువు వద్ద ఎలుగుబంటి కూర్చుని ఉంది. కూర్చున్న ఎలుగుబంటిని చూసిన ప్రభు భొత్ర బొలెరో దిగి కొంతదూరం నుంచి దాని ఫొటోలు తీసేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో ప్రభుబొత్రను చూసిన ఎలుగుబంటి అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ హఠాత్పరిణామానికి ఖిన్నుడైన ప్రభు ఎలుగుబంటి నుంచి ప్రాణాలు రక్షించుకోవాలని దాంతో పోరాటం సాగించాడు. అరగంటకు పైగా జరిగిన ఎలుగు–మనిషి పోరాటంలో ఎలుగుబంటి నుంచి ప్రాణాలు కాపాడుకునేందుకు సమీప చెరువులో దూకాడు. అయినా ఎలుగుబంటి విడవలేదు. అతనిపై దూకి గాయపరచడం ప్రారంభించింది. రక్షించండంటూ ప్రాణ భయంతో ప్రభు హాహాకారాలు చేశాడు. దాదాపు మూడు గంటల పాటు హాహాకారాలు చేసినప్పటికీ రక్షించేందుకు ఎవరూ రాలేదు. చివరికి ఎలుగుబంటి చేతిలో ఓటమి చెంది మరణించాడు. ఈ విషయం తెలిసిన అటవీ విభాగం సిబ్బంది, పోలీసులతో సహా సంఘటనా స్థలానికి చేరుకుంది . అయితే ఎలుగుబంటి ఎక్కడికో వెళ్లిపోయింది. పోలీసులు, అటవీ విభాగ సిబ్బంది చెరువులో ఉన్న ప్రభు భొత్ర మృతదేహాన్ని బయటకు తీశారు. రాత్రి కావడం వల్ల చీకటిలో ఎలుగుబంటి జాడ తెలియలేదు. ఎలుగుబంటిని పట్టుకునేందుకు అటవీ సిబ్బంది, పోలీసులు మాటు వేశారు. ఈ సంఘటన స్థానిక ప్రజలలో భయాందోళన రేపింది. -
ఎలుగుబంటి దాడి: ఒకరికి గాయాలు
శ్రీకాకుళం: పరిశ్రమలోకి ప్రవేశించిన ఎలుగుబంటి నానా బీభత్సం సృష్టించి.. కార్మికులపై దాడి చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని కాకరపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామంలోని ఈస్ట్‌కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ లేబర్ కాలనీలోకి ప్రవేశించిన ఎలుగుబంటి అడ్డొచ్చిన వారిపై దాడికి దిగింది. ఎలుగుబంటి బారిన పడిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా.. అడవిలో కట్టెలు కొడుతున్న కూలీల వద్దకు వెళ్లి దాడి చేసింది. అయితే వారు తిరగబడి ఎలుగు బంటిని గొడ్డలితో నరికి చంపేశారు. అప్పటికే ఇద్దరు కూలీలను ఆ ఎలుగుబంటి గాయ పరచినట్టు సమాచారం.