
సాక్షి, రాజన్నసిరిసిల్ల(కరీంనగర్): రాజన్న సిరిసిల్లలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. రుద్రంగి మండల కేంద్రంలో ఎలుగుబంటి దాడి కలకలం రేపింది. దేగావత్ తండాకు చెందిన గంగాధర్ అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడిచేసి అతడి కళ్లను పీకేసింది. స్థానికులు పెద్ద ఎత్తున అరుపులు,కేకలు వేయడంతో ఎలుగుబంటి అక్కడినుంచి అడవిలోకి పారిపోయింది. దీంతో తీవ్రగాయాలపాలైన వ్యక్తిని స్థానికులు నీళ్లు తాగించి మెరుగైన చికిత్సకోసం ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.