రోమ్: సాధారణంగా ఎలుగుబంటిని చూడగానే ఎంతటి వారైనా భయంతో పరుగెడుతారు. ఇక చిన్నపిల్లల గురించి అయితే ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. భయంతో బెంబేలెత్తిపోతారు. కానీ ఓ 12 ఏళ్ల బలుడు ఎలుగుబంటి తనను వెంబడించినప్పటికీ ఆందోళన చెందకుండా తప్పించుకున్న భయానక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 45 సెకన్ల నిడివి గల ఈ వీడియోను ఓ ట్విటర్ యూజర్ మంగళవారం ట్వీట్ చేశాడు. భయానక పరిస్థితుల్లో కూడా సమయస్ఫూర్తిగా వ్యవహిరించిన సదరు బాలుడిపై ట్విటర్‌లో ప్రశంసలు వెల్లువెత్తున్నాయి. (వైరల్: ‘ఉత్తమమైన దొంగతనం.. అద్భుతం’)
వివారాలు... ఉత్తర ఇటలీకి చెందిన అలెశాండ్రో(12) అనే బాలుడు తన కుటుంబంతో కలిసి ట్రెంటినో కొండలకు షికారుకు వెళ్లాడు. ఆ కొండలపై నుంచి కిందకు వస్తున్న అలేశాండ్రోను గోధుమ వర్ణపు ఎలుగుబంటి వెనకాలే వెంబడిచింది. భల్లూకాన్ని గమనించిన శాండ్రో భయంతో పరుగు తీయకుండా మెల్లిగా నడుచుకుంటూ క్షణాల్లో దాని నుంచి తప్పించుకున్న ఈ వీడియోను షేర్ చేసిన కొన్ని గంటల్లోనే వేలల్లో వ్యూస్ వందల్లో కామెంట్స్ వచ్చాయి. ఇప్పటికీ వాటి సంఖ్య పెరుగుతూనే ఉంది. (ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు: లక్షలాది మిడతలు..)
ఈ సంఘటనపై అలేశాండ్రో మాట్లాడూతూ.. ‘ఆ సమయంలో పరిగేత్తడం ముఖ్యమే. అయితే అది ప్రమాదంలో ఉందని తెలియకుండా వ్యవహిరించాలి లేదా మనం దాని శత్రువులం కాదన్న విషయం అర్థమయ్యేలా చేయడం కూడా ముఖ్యమే. అందుకే పరుగెత్తకుండా మెల్లిగా నడిచాను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఇక అతడి మామయ్య ఓ పత్రికతో మాట్లాడుతూ.. ‘‘మేమంతా కుటుంబంతో ట్రెంటినో కొండలకు షికారుకు వెళ్లాము. తిరిగి వెళ్లిపోయేముందు కొండపై ఉన్న మా వస్తువులను తీసుకురావడానికి అలెశాండ్రో వెళ్లాడు. అక్కడ జనాలు ఉన్నప్పుటికీ ఆ ఎలుగుబంటి నెమ్మదిగా ఆ చెట్ల పొదల్లోంచి వచ్చింది. దానిని గమనించిన అలెశాండ్రో వీడియో తీయమని సూచించాడు. ఆ సమయంలో అతడు ఎలుగుబంటి నుంచి నెమ్మదిగా దూరంగ నడుస్తూ తప్పించుకున్నాడు’’ అని పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment