
జైపూర్ : రాజస్థాన్‌లోని రథంబోర్ నేషనల్ పార్క్‌లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఓ ఎలుగుబంటి.. రెండు పులలను వేటాడింది. తన మీద దాడికి వచ్చిన పులిని ఎలుగుబంటి భయపెట్టించి..పరుగులు పెట్టించింది. ఈ దృశ్యాలన్నీ సీసీ టీవీ పుటేజీలో రికార్డు అయ్యాయి. అయితే ఈ వీడియోను నెల రోజుల క్రితమే రథంబోర్ నేషనల్ పార్క్ యూట్యూబ్‌లో షేర్ చేసినప్పటికీ.. తాజాగా దీనిని రాజ్యసభ సభ్యుడు పరిమల్ నాథ్వానీ మంగళవారం ట్విటర్‌లో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
పార్క్‌లో ఏమరపాటుగా ఉన్న ఓ ఎలుగుబంటిని పులి బెదిరించడానికి ప్రయత్నించింది. అది గమనించిన ఎలుగు ఒక్కసారిగా తన ముందు కాళ్లు ఎత్తి పులిని బెదిరించింది. దీంతో పులి భయపడి వెంటనే పరుగులు పెట్టింది. దాన్ని వెంబడించిన ఎలుగుబంటికి దారిలో మరో పులి ఎదురవడంతో వెనకడుగు వేయకుండా రెండు పులులను భయపెట్టింది. దీంతో రెండు పులులు భయంతో పరుగులు తీశాయి. అనంతరం ఎలుగు సైతం వెనక్కితిరిగి వెళ్లిపోయింది. పరిమల్ షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే కొన్ని వేల మంది వీక్షించగా.. అనేకమంది లైకులు కొడుతున్నారు...‘వైల్డ్ లైఫ్‌లో ఇలాంటి అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి’ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment