one injures
-
అదుపుతప్పిన ఎరువుల లారీ
తనకల్లు : మండలంలోని కొక్కంటిక్రాస్ నుంచి బుధవారం ములకలచెరువుకు గొర్రెల ఎరువుతో వెళుతున్న లారీ పాపాఘ్ని బిడ్జివద్ద టైరు పగలడంతో అదుపుతప్పి పక్కనే ఉన్న మట్టిపెల్లలను ఢీకొంది. డ్రైవర్ వెంకటరమణకు బలమైన గాయాలై క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయాడు. లారీలో ప్రయాణిస్తున్న మరో ఆరుగురు కలీలు స్వల్పంగా గాయపడ్డారు.స్థానికలు అతికష్టం మీద డ్రైవర్‌ను బయకు తీసి 108 వాహనంలో కదిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
ఎలుగుబంటి దాడి: ఒకరికి గాయాలు
శ్రీకాకుళం: పరిశ్రమలోకి ప్రవేశించిన ఎలుగుబంటి నానా బీభత్సం సృష్టించి.. కార్మికులపై దాడి చేసింది. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలంలోని కాకరపల్లి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. గ్రామంలోని ఈస్ట్‌కోస్ట్ థర్మల్ పవర్ ప్లాంట్ లేబర్ కాలనీలోకి ప్రవేశించిన ఎలుగుబంటి అడ్డొచ్చిన వారిపై దాడికి దిగింది. ఎలుగుబంటి బారిన పడిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం అతన్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కాగా.. అడవిలో కట్టెలు కొడుతున్న కూలీల వద్దకు వెళ్లి దాడి చేసింది. అయితే వారు తిరగబడి ఎలుగు బంటిని గొడ్డలితో నరికి చంపేశారు. అప్పటికే ఇద్దరు కూలీలను ఆ ఎలుగుబంటి గాయ పరచినట్టు సమాచారం.