జీడీకె 1వ గనిలో డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసరావును సన్మానిస్తున్న అధికారులు, నాయకులు
ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సన్మానం
Published Sat, Jul 30 2016 7:07 PM | Last Updated on Mon, Sep 4 2017 7:04 AM
గోదావరిఖని : సింగరేణి సంస్థ ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని గనులు, ఓసీపీలు, డిపార్ట్‌మెంట్లలో పనిచేసి శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను ఘనంగా సన్మానించారు. జీడీకే–1,3 గ్రూప్ గనిలో ఉద్యోగ విరమణ పొందిన డెప్యూటీ సూపరింటెండెంట్ లక్కాకుల శ్రీనివాస్‌రావు, టెండాల్ ఎల్లందుల ఓదెలు, జనరల్ మజ్దూర్ సుద్దాల రాజయ్యను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. వారికి రావాల్సిన సీఎంపీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్ పత్రాలు అందజేశారు. జీడీకే–11వ గనిలో టింబర్‌మెన్ కొమ్ముల రాజేశం, కోల్‌కట్టర్లు పోలగాని పెంటయ్య, బీస కనకయ్య, సపోర్ట్‌మెన్లు ఎం.సుధాకర్‌రెడ్డి, వనపర్తి నర్సయ్య, ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ సుదగాని రామస్వామి, ట్రామర్ నల్ల ఆగమరెడ్డి, జనరల్ మజ్దూర్లు గట్టం అంజయ్య, మీనుగు నారాయణను సన్మానించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పనిచేసి రిటైర్ అయిన రౌతు మంజు, బాబూరావును వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది సన్మానించారు.
ఆర్జీ–2 డివిజన్‌లో..
ౖయెటింక్లయిన్‌కాలనీ :ఆర్జీ–2 డివిజన్ పరిధిలోని ఓసీపీ–3 సీహెచ్‌పీలో పనిచేసి రిటైర్ అయిన శ్రమశక్తి ఆవార్డు గ్రహీత ఆర్.కేÔ¶ వరెడ్డిని శనివారం సన్మానించారు. సీహెచ్‌పీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాలువాలతో సన్మానించి జ్ఞాపిక బహూకరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి రమేశ్‌కుమార్, మేనేజర్ వెంకటయ్య, సీహెచ్‌పీ డీవైఎస్‌ఈ సదానందం తదితరులు పాల్గొన్నారు. వకీల్‌పల్లి గనిలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఎనిమిది మంది కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో గని మేనేజర్ ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ ఖాదిర్, సంక్షేమాధికారి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement