sanmanam
-
లక్ష్మీ మందరకు సరస్వతీ కటాక్షం
కొరాపుట్: కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ బ్లాక్ మఝిగుడ గ్రామానికి చెందిన లక్ష్మీ మందర్ అక్షరజ్ఞాన మెరుగని ఆదివాసీ మహిళ. అయితేనేమి ఆశు కవయిత్రిగా ఆమెకు ప్రత్యేకత సాధించింది. గంటల తరబడి అనర్గళంగా, ఆశువుగా పాడగలిగే సామర్థ్యం ఆమె కలిగి ఉంది. ఆశువుగా ప్రకృతి వర్ణనలో ఆమెకు ఆమెసాటి. ఆదివాసీ జనజీవన విధివిధానాలు, సంప్రదాయ పండగలను ఇతి వృత్తాలుగా చేసి పాటలుగా మలిచి అక్కడికక్కడే ఆశువుగా పాడుతూ శ్రోతలను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆదివాసీ జానపద గీతాలాపనకు ఆమె పెట్టింది పేరు. ఆదివాసులు ఆమెను కారణజన్మురాలుగా చూస్తారు. తన నిజ జీవితంలో ఎదురొచ్చిన సమస్యలను లెక్కచేయక, అలుపెరుగని రీతిలో పాటలు పాడడం ఆమె నైజం. ఆశువుగా పాడడం తనకు భగవంతుడిచ్చిన వరమని, కొండ కోనల్లో కర్రలు సేకరిస్తున్నప్పుడు, పశువులను కాస్తున్నప్పుడు, వంట చేస్తున్నప్పుడు, కడకు పరుల పొలాల్లో కూలి పని చేస్తున్నప్పుడు తన నోట పాటలు జాలువారుతాయని, తాను ఏమాత్రం మౌనంగా ఉన్నా తన తోటివారు పాడమని పురమాయించడం పరిపాటి అని తన పాటల ఒరవడిని వివరించింది. గృహయోగం లేదు తన భర్త పేదవాడై దారిద్య్రంలో ఉన్నప్పటికీ, కన్న పిల్లలు పెద్దవారై ఎవరంతట వారు బతుకుతున్నారని, ప్రస్తుతం భర్తతో పాటు ఏ పూటకాపూట కూలి చేస్తూ బతుకు బండి లాగిస్తున్నట్లు ఆమె చెప్పింది. ఉండేందుకు సరైన ఇల్లు లేక ఒక పూరి గుడిసెలో కాపురం చేస్తున్నట్లు చెప్పింది. గ్రామంలో అనేక మంది ఇందిరా ఆవాజ్ యోజన పథకంలో ఇళ్లను పొందారని, తనకు మాత్రం మంచి ఇంట్లో ఉండే యోగాన్ని భగవంతుడు కలిగించలేదని వాపోతోంది. ప్రభుత్వం తనకు అందిస్తున్న రూ.300 వృద్ధాప్య పింఛన్ తనకు ప్రస్తుతం ఆధారమని చెప్పింది. ఇటీవల ఈ నెల 7,8 తేదీలలో కొరాపుట్‌లో జరిగిన జాతీయ స్థాయి కళింగ సాహిత్య ఉత్సవంలో తన ప్రతిభను మెచ్చిన పెద్దపెద్దోళ్లందరు తనకు చేసిన సన్మానం తన జీవితానికి లభించిన పరమార్థమని చెప్పింది. సభికుల కోరికపై ఆమె తనకు జరిగిన సన్మానాన్ని ఆశువుగా పాడి నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపింది. -
ఆ ఘనత అనురాగ్శర్మదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న అపోహలు, దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసి.. రాష్ట్రాన్ని సహనశీలంగా ఆవిష్కరించిన ఘనత రిటైర్డ్ డీజీపీ అనురాగ్‌శర్మకు దక్కుతుందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణలో, పోలీసింగ్‌లో కొత్త విధానాల అమల్లో రాష్ట్ర పోలీసులు దేశం లోనే నంబర్ వన్‌గా నిలవడం గర్వకారణమ న్నారు. డీజీపీగా పదవీ విరమణ చేసిన అను రాగ్‌శర్మకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తర ఫున ప్రగతిభవన్‌లో ఘనంగా సన్మానం చేసి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో పోలీసు శాఖను గొప్పగా తీర్చిదిద్దడానికి అనురాగ్‌శర్మ శ్రమిం చారని చెప్పారు. ‘‘శాంతి భద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ. ఎంతో తెలివి, సమన్వ యం, కొత్త ఆలోచనలతో విధులు నిర్వహించా ల్సి ఉంటుంది. తెలంగాణ పోలీసులు అనేక కొత్త విధానాలు తెచ్చారు. షీ టీమ్స్ ఏర్పాటు చేయడంలో, నగరంలో లక్షకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. స్వచ్ఛ హైదరాబాద్, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల్లో భాగస్వాము లై సామాజిక బాధ్యతను నెరవేర్చారు. గోదావ రి, కృష్ణా పుష్కరాల నిర్వహణలో అలుపెరగని కృషి చేశారు. ఇది డీజీపీగా అనురాగ్‌శర్మ అందించిన నాయకత్వం, సమన్వయం వల్లే సాధ్యమయింది..’’ అని అభినందించారు. అద్భుతంగా పోలీసు వ్యవస్థ తెలంగాణ ప్రాంతం చరిత్రలో ఎన్నడూ కూడా గత మూడున్నరేళ్లున్నంత ప్రశాంతంగా లేద ని.. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండేదని కేసీ ఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరును చూసి ఓటేయాలని కూ డా అడిగామని, ఇలాంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీ సులు నేరాల నియంత్రణకు చేసిన కృషి దేశరక్షణకు కూడా ఉపయోగపడిందని... తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ పనితీరు అద్భుతమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, ఇతర మంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. అనురాగ్‌శర్మ అనుభవాన్ని, అవ గాహనా శక్తిని దృష్టిలో ఉంచుకుని సలహాదా రుగా నియమించామన్నారు. ఇక కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి ఓపిక, కార్యదక్షత కలిగిన అధికారని, ఆయన నాయకత్వంలో పోలీసు శాఖ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని పేర్కొన్నారు. ఇది పోలీసు శాఖకే సన్మానం తనకు జరిగిన ఆత్మీయ వీడ్కోలు పట్ల అనురాగ్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ డీజీపీకి ఈ స్థాయిలో వీడ్కోలు జరగలేదని, దీనిని పోలీసుశాఖకు జరిగిన సన్మానంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తిగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ విజన్ చాలా గొప్పదని, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, తుమ్మల, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
కాశీ విశ్వనాథ్ దంపతులకు ఘనసన్మానం
సీతానగరం (రాజానగరం) : వంద చిత్రాల్లో నటించిన సందర్భంగా దర్శకుడు, సహజ నటుడు యనమందల కాశీ విశ్వనాథ్, హేమలత దంపతులను ఆదివారం రాత్రి వంగలపూడి గ్రామస్తు లు ఘనంగా సన్మానించారు. స్థానిక రామాలయం వద్ద ముసునూరి వీరబాబు ఆధ్వర్యాన, ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ అధ్యక్షతన ఈ పౌర సన్మాన సభ నిర్వహించారు. సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, 23 మంది హీరోలతో, 350 సినిమాలకు రాసే అదృష్టాన్ని తెలుగు సినీ పరిశ్రమ తనకు కల్పించిందన్నారు. ‘వైశాఖం’ చిత్రంతో ఆరేళ్లలో వంద చిత్రాలు పూర్తి చేసుకున్న కాశీ విశ్వనాథ్ అభినందనీయుడన్నారు. ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ, పండగ సందర్భంగా ఈ ప్రాంత నటుడిని సన్మానించడం అభినందనీయమన్నారు. కాశీ విశ్వనాథ్‌లో 1500 చిత్రాల్లో నటించే సత్తా ఉందని అన్నారు. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, వైఎస్సార్ సీపీ నాయకుడు కందుల దుర్గేష్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ¯ŒS బైర్రాజు ప్రసాదరాజు, ప్రముఖ సినీ నటి హేమ, దర్శకుడు శ్రీవాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘పోలవరం’ వైఎస్సార్ చేపట్టినదే.. పోలవరం ప్రాజెక్ట్‌ను చేపట్టినది వైఎస్ రాజశేఖరరెడ్డేనన్నది ముమ్మాటికి నిజమని నిర్మాత, దర్శకుడు, నటుడు ఆర్.నారాయణమూర్తి అన్నారు. కాశీ విశ్వనాథ్ సన్మానసభలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబును ఒకసారి కలిశానని, వైఎస్సార్ చేపట్టిన పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, సస్యశ్యామలం చేయాల్సిందిగా కోరానని తెలిపారు. నదుల అనుసంధానం ద్వారా ఉత్తరాంధ్రకు నీరందించాలని కోరారు. స్వాతంత్య్ర సమరయోధుడు, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి నీరుకొండ వెంకట రామారావు వంగలపూడిలో జన్మించడం ఇక్కడి ప్రజల అదృష్టమన్నారు. చిత్రరంగంలో అందరికీ తలలో నాలుకగా నిలిచే నటుడు కాశీవిశ్వనాథ్ అని కొనియాడారు. అనంతరం ‘ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా’ పాటను ఆలపించి సభికులను ఉర్రూతలూగించారు. అనంతరం కాశీవిశ్వనాథ్ దంపతులను ఘనంగా సన్మానించారు. ముక్కోటి ఏకాదశి ఉత్సవ కమిటీ సభ్యులు వెండి కిరీటంతో సత్కరించారు. -
విద్యతోనే మనిషికి గుర్తింపు
పెద్దాపురంలో రూ.21 కోట్లతో పాఠశాల డిప్యూటీ సీఎం చినరాజప్ప సామర్లకోట : విద్యతోనే మనిషికి గుర్తింపు ఉంటుందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న తోటకూర సాయి రామకృష్ణను గురువారం సాయంత్రం సన్మానించారు. బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సాయిరామకృష్ణ సామాన్య కుటుంబంలో పుట్టి 2004లో రాష్ట్ర స్థాయి, 2106లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోవడం అభినందనీయమన్నారు. పెద్దాపురం పట్టణ పరిధిలో 10 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా రూ.21 కోట్లతో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షత వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం మాట్లాడుతూ 1984లో తన చేతులతో ఉపాధ్యాయుడిగా నియామక ఉత్తర్వులు సాయిరామకృష్ణకు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకుడు దవులూరి సుబ్బారావు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, రెడ్నం సునీత, కంచర్ల సుష్మమోమనీ, బడుగు శ్రీకాంత్, పాఠశాల కమిటీ చైర్మన్ సప్పా గంగాభవానీ పాల్గొన్నారు. అనంతరం సాయి రామకృష్ణ దంపతులను సన్మానించారు. -
ఫుట్‌బాల్ క్రీడాకారిణులకు ఘనసన్మానం
తాడితోట (రాజమహేంద్రవరం) పుట్‌బాల్ క్రీడలో రాణించి అమెరికా ఆహ్వానం మేరకు అక్కడకు వెళ్లి ఫుట్‌బాల్ అటలో మరిన్ని మెళకువలు నేర్చుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన క్రీడాకారిణులను ఘనంగా ఆదివారం సన్మానించారు. రాజమహేంద్రవరం దానవాయిపేట మున్సిపల్ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న లంక సాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్విని ప్రియ రాజమహేంద్రవరం బైపాస్ రోడ్డులోని నెల్సన్ మెమోరియల్ చర్చిలో సండేస్కూల్ విద్యార్థులు. జిల్లా, రాష్ట్ర స్థాయి ఫుట్‌బాల్ పోటీల్లో వారెన్నో విజయాలు సాధించారు. వారి ప్రతిభను గుర్తించిన మ్యాజిక్ బస్సు అనే స్వచ్ఛంద సేవా సంస్థ వారి అమెరికా పర్యటనకు ఏర్పాట్లు చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి 12 మంది ప్రతిభ కలిగిన క్రీడాకారులను గుర్తించగా ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపిక కాగా వారిలో రాజమహేంద్రవరానికి చెందిన లంక శాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్విని ప్రియలు ఉన్నారు. జూలై 9వ తేదీన రాజమహేంద్రవరం నుంచి బయలుదేరిన శ్రావణి, అశ్వినిప్రియ అమెరికాలోని న్యూయార్క్, వాషింగ్టన్, న్యూ జెర్సీలలో 15 రోజుల పాటు ఫుట్ బాల్ క్రీడలో ప్రత్యేక శిక్షణ పొందారు. అక్కడ జరిగిన వివిధ పోటీల్లో పాల్గొని విజయాలు సాధించారు. స్వదేశానికి తిరిగివచ్చిన లంక సాయి శ్రావణి, ఇండిగిబిల్లి అశ్విని ప్రియలను నెల్సన్ మెమోరియల్ చర్చి సంఘ సభ్యులు ఆదివారం ఘనంగా సత్కరించారు. నెల్సన్ మెమోరియల్ చర్చి పాస్టర్లు ఎం. మార్టిన్ లూథర్, రవి రాజ్‌కుమార్, కమలాకరరావు, సంఘ పెద్దలు యార్లగడ్డ సుందరరావు, సిర్రా యాకోబు, కొమ్ము ఏసు, అర్జున రావు, మహిళా సంఘం, యూత్ సంఘం, సండేస్కూల్ విద్యార్ధులు పాల్గొన్నారు. -
మెరుగైన సేవలందిస్తే జీవితాంతం ఆత్మసంతృప్తి
కాకినాడ సిటీ : ఏ ఉద్యోగి అయినా మెరుగైన సేవలు అందిస్తే.. అలాంటివారు పదవీ విరమణ చేసినా లేదా వేరే ప్రాంతానికి బదిలీ అయినా ఆ సేవలు వారికి జీవితాంతం ఆత్మసంతృప్తిని కలిగిస్తాయని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్ భవన్లో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా శాఖ ఆధ్వర్యాన ఇద్దరు సమాచార శాఖ ఉద్యోగులకు శనివారం ఆత్మీయ సత్కార వీడ్కోలు సభ జరిగింది. సమాచార శాఖ రేడియో ఇంజనీరింగ్ విభాగంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరుగా పనిచేస్తూ పదవీ విరమణ చేస్తున్న డీవీఎస్ రాజు, అలాగే జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో 20 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో పని చేసి ఇటీవల బదిలీపై విజయవాడ వెళ్లిన కాకినాడ డివిజనల్ పౌర సంబంధాల అధికారి వి.రామాంజనేయులును సత్కరించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ డీవీఎస్ రాజు, రామాంజనేయులు సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎం.ఫ్రాన్సిస్, సీనియర్ పాత్రికేయుడు మధుసూదనరావు, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డీఎస్ఎస్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
ఉద్యోగ విరమణ పొందిన కార్మికులకు సన్మానం
గోదావరిఖని : సింగరేణి సంస్థ ఆర్జీ–1 డివిజన్ పరిధిలోని గనులు, ఓసీపీలు, డిపార్ట్మెంట్లలో పనిచేసి శనివారం ఉద్యోగ విరమణ పొందిన కార్మికులను ఘనంగా సన్మానించారు. జీడీకే–1,3 గ్రూప్ గనిలో ఉద్యోగ విరమణ పొందిన డెప్యూటీ సూపరింటెండెంట్ లక్కాకుల శ్రీనివాస్‌రావు, టెండాల్ ఎల్లందుల ఓదెలు, జనరల్ మజ్దూర్ సుద్దాల రాజయ్యను పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. వారికి రావాల్సిన సీఎంపీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్ పత్రాలు అందజేశారు. జీడీకే–11వ గనిలో టింబర్‌మెన్ కొమ్ముల రాజేశం, కోల్కట్టర్లు పోలగాని పెంటయ్య, బీస కనకయ్య, సపోర్ట్మెన్లు ఎం.సుధాకర్‌రెడ్డి, వనపర్తి నర్సయ్య, ఎల్‌హెచ్‌డీ ఆపరేటర్ సుదగాని రామస్వామి, ట్రామర్ నల్ల ఆగమరెడ్డి, జనరల్ మజ్దూర్లు గట్టం అంజయ్య, మీనుగు నారాయణను సన్మానించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పనిచేసి రిటైర్ అయిన రౌతు మంజు, బాబూరావును వైద్యులు, ఉద్యోగులు, సిబ్బంది సన్మానించారు. ఆర్జీ–2 డివిజన్లో.. ౖయెటింక్లయిన్‌కాలనీ :ఆర్జీ–2 డివిజన్ పరిధిలోని ఓసీపీ–3 సీహెచ్‌పీలో పనిచేసి రిటైర్ అయిన శ్రమశక్తి ఆవార్డు గ్రహీత ఆర్.కేÔ¶ వరెడ్డిని శనివారం సన్మానించారు. సీహెచ్‌పీ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాలువాలతో సన్మానించి జ్ఞాపిక బహూకరించారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి రమేశ్‌కుమార్, మేనేజర్ వెంకటయ్య, సీహెచ్‌పీ డీవైఎస్ఈ సదానందం తదితరులు పాల్గొన్నారు. వకీల్‌పల్లి గనిలో పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందిన ఎనిమిది మంది కార్మికులను సన్మానించారు. కార్యక్రమంలో గని మేనేజర్ ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ ఖాదిర్, సంక్షేమాధికారి ప్రవీణ్‌కుమార్ పాల్గొన్నారు. -
క్రికెటర్ భరత్వీర్కు సత్కారం
కరీంనగర్ కార్పొరేషన్: దక్షిణాసియాలో జరిగే అంతర్జాతీయ క్రికెట్ పోటీలకు ఎంపికైన ఎల్కతుర్తి మండలం కేశవాపూర్ గ్రామానికి చెందిన ఎర్రగొల్ల భరత్వీర్యాదవ్కు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆదివారం రూ. 2 వేలు ఆర్థిక సహాయం అందజేసి శాలువాతో సత్కరించారు. యువతను ప్రోత్సహిస్తే మంచి క్రీడాకారులుగా రాణిస్తారని చెప్పారు. భరత్ తెలంగాణ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గంట రాములుయాదవ్, శ్రీనివాస్‌యాదవ్, మోహన్, శ్రీశైలం, కృష్ణ, నాగరాజు పాల్గొన్నారు.