సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న అపోహలు, దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసి.. రాష్ట్రాన్ని సహనశీలంగా ఆవిష్కరించిన ఘనత రిటైర్డ్ డీజీపీ అనురాగ్‌శర్మకు దక్కుతుందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణలో, పోలీసింగ్‌లో కొత్త విధానాల అమల్లో రాష్ట్ర పోలీసులు దేశం లోనే నంబర్ వన్‌గా నిలవడం గర్వకారణమ న్నారు. డీజీపీగా పదవీ విరమణ చేసిన అను రాగ్‌శర్మకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తర ఫున ప్రగతిభవన్‌లో ఘనంగా సన్మానం చేసి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో పోలీసు శాఖను గొప్పగా తీర్చిదిద్దడానికి అనురాగ్‌శర్మ శ్రమిం చారని చెప్పారు. ‘‘శాంతి భద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ. ఎంతో తెలివి, సమన్వ యం, కొత్త ఆలోచనలతో విధులు నిర్వహించా ల్సి ఉంటుంది. తెలంగాణ పోలీసులు అనేక కొత్త విధానాలు తెచ్చారు. షీ టీమ్స్ ఏర్పాటు చేయడంలో, నగరంలో లక్షకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. స్వచ్ఛ హైదరాబాద్, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల్లో భాగస్వాము లై సామాజిక బాధ్యతను నెరవేర్చారు. గోదావ రి, కృష్ణా పుష్కరాల నిర్వహణలో అలుపెరగని కృషి చేశారు. ఇది డీజీపీగా అనురాగ్‌శర్మ అందించిన నాయకత్వం, సమన్వయం వల్లే సాధ్యమయింది..’’ అని అభినందించారు.
అద్భుతంగా పోలీసు వ్యవస్థ
తెలంగాణ ప్రాంతం చరిత్రలో ఎన్నడూ కూడా గత మూడున్నరేళ్లున్నంత ప్రశాంతంగా లేద ని.. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండేదని కేసీ ఆర్ పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరును చూసి ఓటేయాలని కూ డా అడిగామని, ఇలాంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీ సులు నేరాల నియంత్రణకు చేసిన కృషి దేశరక్షణకు కూడా ఉపయోగపడిందని... తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ పనితీరు అద్భుతమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, ఇతర మంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. అనురాగ్‌శర్మ అనుభవాన్ని, అవ గాహనా శక్తిని దృష్టిలో ఉంచుకుని సలహాదా రుగా నియమించామన్నారు. ఇక కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి ఓపిక, కార్యదక్షత కలిగిన అధికారని, ఆయన నాయకత్వంలో పోలీసు శాఖ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని పేర్కొన్నారు.
ఇది పోలీసు శాఖకే సన్మానం
తనకు జరిగిన ఆత్మీయ వీడ్కోలు పట్ల అనురాగ్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ డీజీపీకి ఈ స్థాయిలో వీడ్కోలు జరగలేదని, దీనిని పోలీసుశాఖకు జరిగిన సన్మానంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తిగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ విజన్ చాలా గొప్పదని, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, తుమ్మల, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment