dgp anuragh sharma
-
ఆ ఘనత అనురాగ్శర్మదే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందన్న అపోహలు, దుష్ప్రచారాన్ని పటాపంచలు చేసి.. రాష్ట్రాన్ని సహనశీలంగా ఆవిష్కరించిన ఘనత రిటైర్డ్ డీజీపీ అనురాగ్‌శర్మకు దక్కుతుందని ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రశంసించారు. శాంతిభద్రతల పరిరక్షణలో, పోలీసింగ్‌లో కొత్త విధానాల అమల్లో రాష్ట్ర పోలీసులు దేశం లోనే నంబర్ వన్‌గా నిలవడం గర్వకారణమ న్నారు. డీజీపీగా పదవీ విరమణ చేసిన అను రాగ్‌శర్మకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం తర ఫున ప్రగతిభవన్‌లో ఘనంగా సన్మానం చేసి, వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఉన్న సంక్లిష్ట పరిస్థితుల్లో పోలీసు శాఖను గొప్పగా తీర్చిదిద్దడానికి అనురాగ్‌శర్మ శ్రమిం చారని చెప్పారు. ‘‘శాంతి భద్రతల నిర్వహణ నిరంతర ప్రక్రియ. ఎంతో తెలివి, సమన్వ యం, కొత్త ఆలోచనలతో విధులు నిర్వహించా ల్సి ఉంటుంది. తెలంగాణ పోలీసులు అనేక కొత్త విధానాలు తెచ్చారు. షీ టీమ్స్ ఏర్పాటు చేయడంలో, నగరంలో లక్షకు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంలో, కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో ప్రశంసనీయ పాత్ర పోషించారు. స్వచ్ఛ హైదరాబాద్, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాల్లో భాగస్వాము లై సామాజిక బాధ్యతను నెరవేర్చారు. గోదావ రి, కృష్ణా పుష్కరాల నిర్వహణలో అలుపెరగని కృషి చేశారు. ఇది డీజీపీగా అనురాగ్‌శర్మ అందించిన నాయకత్వం, సమన్వయం వల్లే సాధ్యమయింది..’’ అని అభినందించారు. అద్భుతంగా పోలీసు వ్యవస్థ తెలంగాణ ప్రాంతం చరిత్రలో ఎన్నడూ కూడా గత మూడున్నరేళ్లున్నంత ప్రశాంతంగా లేద ని.. ఎప్పుడూ ఏదో ఒక అలజడి ఉండేదని కేసీ ఆర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోలీసుల పనితీరును చూసి ఓటేయాలని కూ డా అడిగామని, ఇలాంటి సందర్భం గతంలో ఎన్నడూ లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర పోలీ సులు నేరాల నియంత్రణకు చేసిన కృషి దేశరక్షణకు కూడా ఉపయోగపడిందని... తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, గ్రేహౌండ్స్ పనితీరు అద్భుతమని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, ఇతర మంత్రులు ప్రశంసించారని గుర్తు చేశారు. అనురాగ్‌శర్మ అనుభవాన్ని, అవ గాహనా శక్తిని దృష్టిలో ఉంచుకుని సలహాదా రుగా నియమించామన్నారు. ఇక కొత్త డీజీపీ మహేందర్‌రెడ్డి ఓపిక, కార్యదక్షత కలిగిన అధికారని, ఆయన నాయకత్వంలో పోలీసు శాఖ మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుందని పేర్కొన్నారు. ఇది పోలీసు శాఖకే సన్మానం తనకు జరిగిన ఆత్మీయ వీడ్కోలు పట్ల అనురాగ్‌శర్మ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో ఏ డీజీపీకి ఈ స్థాయిలో వీడ్కోలు జరగలేదని, దీనిని పోలీసుశాఖకు జరిగిన సన్మానంగా భావిస్తున్నానని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి విజయవంతంగా బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తిగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ విజన్ చాలా గొప్పదని, దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని, పోచారం, తుమ్మల, జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
సంతృప్తిగా ఉంది: డీజీపీ
హైదరాబాద్: నా పూర్తి డీజీపీ సర్వీసు చాలా సంతృప్తినిచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. శుక్రవారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్లకు పైగా పోలీసు శాఖలో విధులు నిర్వర్తించానని, ఈరోజు తన పదవి చివరి రోజు అని చెప్పారు. తనకు సహకరించిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక పోలీసును తానేనన్నారు. 1992లో సౌత్ జోన్ డీసీపీగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పాత బస్తీ చాలా సెన్సిటివ్‌గా ఉందని, సౌత్ జోన్లో డీసీపీగా పనిచేయడం తన కెరియర్లో పెద్ద ఛాలెంజింగ్ విధి నిర్వహణ అని పేర్కొన్నారు. ఇప్పుడు పాతబస్తీలో అలాంటి పరిస్థితులు లేవని, పాతబస్తీవాసుల్లో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. కాగా, పోలీసు రిక్రూట్మెంట్లో చాలా మార్పులు తెచ్చామని, ప్రతి కానిస్టేబుల్ కూడా అధికారిలా భావించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. అందుకే డిపార్టుమెంట్లో కానిస్టేబుల్ స్థాయి నుంచే టెక్నాలజీని వినియోగించే విధంగా శిక్షణలో మార్పులు తీసుకొచ్చామన్నారు. పోలీస్ శాఖ నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విభజన సమయంలో నగరానికి ఎక్కువ స్థాయిలో సిబ్బంది అవసరం ఉండగా కేవలం 29మంది ఐపీఎస్లలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సి వచ్చిందని చెప్పారు. టీమ్ వర్క్‌తో దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని, ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని, అందుకు కావాల్సిన వనరులను ప్రభుత్వం అందించిందని డీజీ.పీ తెలిపారు. -
డీజీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన త్రివేది
సాక్షి, హైదరాబాద్ : డీజీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై రాజీవ్ త్రివేది స్పందించారు. తాను ఎవరికీ ఎలాంటి ఫార్ములా సూచించలేదని, డీజీపీ నియామకమనేది ముఖ్యమంత్రి విచరణక్షాధికారమని ఆయన గురువారమిక్కడ అన్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. కాగా కొత్త డీజీపీగా ఎవరిని నియమించాలన్న దానిపై ప్రభుత్వంతో నిన్న చర్చలు జరిగాయి. ఈ రేసులో కేంద్ర సర్వీసులో ఉన్న సుదీప్ లఖ్టకియాతో పాటు నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రోడ్ సేఫ్టీ డీజీ కృష్ణప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఎవరో ఒకరికి డీజీపీ పోస్టు ఖాయమన్న చర్చ ఐపీఎస్‌ల్లో నడుస్తోంది. ఇక డీజీపీ నియామక ప్రక్రియలో త్రివేది ఫార్ములా బెటర్ అని, తనకు ఏడాది, రాజీవ్ త్రివేదికి రెండేళ్లు డీజీపీగా అవకాశం ఇవ్వాలని డీజీ కృష్ణ ప్రసాద్ ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన పదవీకాలాన్ని మహేందర్ రెడ్డికి ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాను సీఎంకు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదని, డీజీపీగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని త్రివేది పేర్కొన్నారు. -
ఫిర్యాదు చేసేలా ధైర్యమిద్దాం
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై లైంగిక వేధింపులను నియంత్రించేందుకు వారిలో ధైర్యం నింపాలని డీజీపీ అనురాగ్ శర్మ పేర్కొ న్నారు. వేధింపులకు గురైన చిన్నారుల విష యంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఫిర్యాదు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు. రాష్ట్ర పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిన్నారులపై లైంగిక వేధింపులు– నియంత్రణపై ఏడాది పాటు ప్రచారం నిర్వహిం చేందుకు కార్యాచరణ ప్రకటించారు. రాష్ట్ర పోలీస్ ముఖ్య కార్యాలయంలో మాట్లా డుతూ.. దేశవ్యాప్తంగా ప్రతి 30 నిమిషాలకో మైనర్ లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. పాఠశా లలు, ఇళ్లల్లో, పనిచేసే చోట 53 శాతం మైనర్ బాలబా లికలు లైంగిక వేధింపులకు గురవుతున్నట్లు కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ చేసిన అధ్యయనంలో వెల్లడైందన్నారు. 13 రాష్ట్రాల్లో జరిగిన ఈ అధ్య యనంలో 12 లక్షల మంది మైనర్లు వేధింపులకు లోనవుతున్నారని, వీరిలో 57 శాతం అబ్బాయిలు ఉన్న ట్లు తెలిపారు. సమాజంలో లైంగిక వేధింపుల నియం త్రణపై అవగాహన, చర్చ జరిగి పోలీస్స్టేషన్లలో ఫిర్యా దు చేసే వరకు బాధితులు రావాలని అభిప్రాయ పడ్డారు. ఇందుకు పోలీస్ శాఖతో పాటు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ, విద్యా శాఖ, వైద్య, పంచాయతీరాజ్ శాఖ, ఎన్జీవోలు, పాఠశాలలు కలసి పనిచేస్తాయని చెప్పారు. ఈ నెల 3న సాయంత్రం హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్ పీపుల్స్ ప్లాజా వద్ద క్యాంపెయిన్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు మంత్రులు, ఎంపీలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తదితరులు పాల్గొంటారని నోడల్ అధికారులు సౌమ్యామిశ్రా, చారుసిన్హా వెల్లడించారు. క్యాంపెయిన్ లోగోతో పాటు, ప్రచార గేయం, వెబ్‌పేజ్, ఫేస్బుక్, ట్వీటర్ ఖాతాలను డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సీపీ మహేందర్‌రెడ్డి, రైల్వే డీజీ కృష్ణప్రసాద్, ఐజీలు సౌమ్య మిశ్రా, చారుసిన్హా ఆవిష్కరించారు. ప్రచార గేయ రచయిత చంద్రబోస్, మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌ను డీజీపీ సన్మానించారు. ఆన్లైన్ వేధింపులు తీవ్రతరం.. మైనర్లపై భౌతికంగా జరిగే లైంగిక వేధింపుల కన్నా ఆన్లైన్ వేధింపులు తీవ్రతరంగా మారాయని డీజీపీ అనురాగ్ శర్మ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర పోలీస్ అకాడమీలో రెండ్రోజుల పాటు పోలీసు అధికారులకు యూనెస్కో ఆధ్వర్యంలో జరుగుతున్న శిక్షణ కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు. టెక్నాలజీ వినియోగం పెరిగిన కొద్దీ చిన్నారులకు లైంగిక వేధింపులు పెరిగాయని, అధికారులు, సిబ్బంది టెక్నాలజీపై పట్టు సాధించి, వేధింపుల నియంత్రణకు కృషిచేయాలని సూచించారు. -
పోలీసుశాఖ మిషన్ 2024
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భవిష్యత్ పరిస్థితులను అంచనా వేస్తూ దశాబ్దకాలంపాటు చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికపై మిషన్ 2024ను పోలీసుశాఖ రూపొందింస్తోంది. ఇందులో భాగంగా డీజీపీ అనురాగ్ శర్మ నేతృత్వంలో ఐపీఎస్‌లు సోమవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ప్రభుత్వం నిర్దేశించిన అంశాలు, ఎజెండాను దృష్టిలో పెట్టుకొని మిషన్ 2024పై చర్చించారు. మహిళా రక్షణ కోసం చేపట్టిన/చేపట్టబోయే చర్యలతోపాటు రోడ్డు ప్రమాదాల నియంత్రణ, సామాజిక భద్రతలో ప్రజల భాగస్వామ్యం పెంపు, నేరాల నియంత్రణ తదితర అంశాలపై వేర్వేరు నివేదికల తయారీకి నిర్ణయించారు. పోలీసుశాఖలో సమూల మార్పులు... రాష్ట్ర విభజన తర్వాత స్మార్ట్ పోలీస్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంపై విస్తృతంగా చర్యలు చేపట్టిన పోలీసుశాఖ మరింత వేగంగా, అంకితభావంతో కూడిన సేవలందించేందుకు చేపట్టాల్సిన దీర్ఘకాలిక ప్రణాళికను రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకుగాను 2014లో ఉన్న పోలీసు సేవలు, మూడేళ్లలో మార్పుల ద్వారా సాధించిన అంశాలపై పూర్తి నివేదిక తయారుచేయాలని డీజీపీ ఆదేశించారు. డిసెంబర్ 31లోగా అప్లోడ్ చేయాల్సిందే... మిషన్ 2024కు సంబంధించి చర్చించిన అంశాలు, వాటిపై కార్యాచరణ, సాధించిన ప్రగతి.. తదితర అంశాలపై అధికారులంతా సమష్టిగా నివేదికలు రూపొందించి డిసెంబర్ 31లోగా మిషన్ 2024 పేరిట రాష్ట్ర ప్రభుత్వం–సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన telangana 2024.cgg.gov.in వెబ్సైట్లో పొందుపరచాలని డీజీపీ అధికారులను ఆదేశించారు. నవంబర్ 15న ముసాయిదాను సిద్ధం చేసి కార్యాచరణ చేపట్టాలన్నారు. -
ఔటర్ ఎంజాయ్‌మెంట్‌కు కాదు: డీజీపీ
హైదరాబాద్: ప్రజల సౌకర్యం కోసం ఔటర్ రింగ్ రోడ్డును నిర్మించారు. అంతేకాని మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ఎంజాయ్ చేయడానికి కాదని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. ఈ మధ్య కాలంలో ఔటర్‌రింగ్ రోడ్డుపై ప్రమాదాలు ఎక్కువ జరుగుతున్న నేపథ్యంలో బుధవారం ఉన్నతాధికారులు ఔటర్‌పై స్పీడ్గన్లు ఏర్పాటు చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కొరకు బ్రీత్ ఎన్‌లైజర్లు, వేగ నియంత్రణ కోసం స్పీడ్ గన్లు ప్రారంభిచారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బొంగ్లూర్ అవుటర్ రింగ్ రోడ్డుపై ఈరోజు జరిగిన కార్యక్రమంలో డీజీపీ అనురాగ్ శర్మతో పాటు సీపీ మహేశ్ భగవత్, హెచ్ఎండీఏ కమిషనర్ చిరంజీవులు పాల్గొన్నారు.