సాక్షి, హైదరాబాద్ : డీజీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై రాజీవ్ త్రివేది స్పందించారు. తాను ఎవరికీ ఎలాంటి ఫార్ములా సూచించలేదని, డీజీపీ నియామకమనేది ముఖ్యమంత్రి విచరణక్షాధికారమని ఆయన గురువారమిక్కడ అన్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. కాగా కొత్త డీజీపీగా ఎవరిని నియమించాలన్న దానిపై ప్రభుత్వంతో నిన్న చర్చలు జరిగాయి. ఈ రేసులో కేంద్ర సర్వీసులో ఉన్న సుదీప్ లఖ్టకియాతో పాటు నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రోడ్ సేఫ్టీ డీజీ కృష్ణప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఎవరో ఒకరికి డీజీపీ పోస్టు ఖాయమన్న చర్చ ఐపీఎస్‌ల్లో నడుస్తోంది.
ఇక డీజీపీ నియామక ప్రక్రియలో త్రివేది ఫార్ములా బెటర్ అని, తనకు ఏడాది, రాజీవ్ త్రివేదికి రెండేళ్లు డీజీపీగా అవకాశం ఇవ్వాలని డీజీ కృష్ణ ప్రసాద్ ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన పదవీకాలాన్ని మహేందర్ రెడ్డికి ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాను సీఎంకు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదని, డీజీపీగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని త్రివేది పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment