Rajeev Trivedi
-
ఖైదీ కుటుంబాలకు గుడ్‌న్యూస్: ఇకపై నేరుగా
సాక్షి, హైదరాబాద్: ఖైదీ కుటుంబాలకు తెలంగాణ జైళ్ల శాఖ శుభవార్త తెలిపింది. ఆగస్టు 25వ తేదీ నుంచి జైళ్ల శాఖలో ములాకత్‌లు ఉంటాయని జైళ్ల శాఖ డీ.జి రాజివ్ త్రివేది శుక్రవారం ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లల్లో, కేంద్ర కారాగారాల్లో ఖైదీలకు ములాకత్ ఇచ్చేందుకు జైళ్ల శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో రెండేళ్ల నుంచి ములాకత్‌లను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో ఖైదీలు తమ కుటుంబసభ్యులతో ములాకత్లో కలుసుకునేందుకు వీలు లేకుండాపోయింది. రెండేళ్లుగా కుటుంబీకులతో మాట్లాడలేకపోవడంతో ఖైదీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటివరకు ఖైదీలకు జైలులో వాట్సాప్ వీడియో ములాకత్‌లకు పరిమితం చేశారు. అయితే ఖైదీలు ప్రత్యక్షంగా తమ కుటుంబసభ్యులతో ములాకత్ లేకపోవడంతో మానసిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయంపై ఖైదీలు జైలు శాఖ ఉన్నతాధికారుల ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. జైళ్లల్లో కూడా పరిస్థితులు ప్రశాంతంగా నెలకొనడంతో ములాకత్‌లు పునః ప్రారంభించనున్నారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులను ఖైదీలు ఇకపై నేరుగా కలుసుకోవడానికి అవకాశం లభించనుంది. -
చీఫ్ సెక్రటరీ.. హోం సెక్రటరీ.. ఓ పాము!
రాష్ట్ర హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాజీవ్ త్రివేది గురువారం ఓ విషసర్పాన్ని బంధించారు. ప్రశాసన్ నగర్‌లోని ఉన్నతాధికారుల క్వార్టర్స్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి నివసిస్తున్నారు. ఆయన నివాసం వెనుక ఉన్న స్థలంలో పాము తారసపడింది. పడగ విప్పి బుసకొడుతున్న పామును చూసిన వాళ్లు భయాందోళనలకు లోనయ్యారు. ఇంతలో విషయం తెలుసుకున్న రాజీవ్ త్రివేది అక్కడకు చేరుకున్నారు. తన వద్ద ఉన్న ఉపకరణంతో ఆ పామును చాకచక్యంగా పట్టుకుని ప్లాస్టిక్ జార్లో బంధించారు. దానికి ఎలాంటి హానీ తలపెట్టనని, జనావాసాలకు దూరంగా వదిలివేస్తానని ఆయన పేర్కొన్నారు. – సాక్షి, హైదరాబాద్ -
డీజీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై స్పందించిన త్రివేది
సాక్షి, హైదరాబాద్ : డీజీ కృష్ణప్రసాద్ వ్యాఖ్యలపై రాజీవ్ త్రివేది స్పందించారు. తాను ఎవరికీ ఎలాంటి ఫార్ములా సూచించలేదని, డీజీపీ నియామకమనేది ముఖ్యమంత్రి విచరణక్షాధికారమని ఆయన గురువారమిక్కడ అన్నారు. ప్రస్తుత డీజీపీ అనురాగ్ శర్మ పదవీకాలం ఈ నెల 12వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. కాగా కొత్త డీజీపీగా ఎవరిని నియమించాలన్న దానిపై ప్రభుత్వంతో నిన్న చర్చలు జరిగాయి. ఈ రేసులో కేంద్ర సర్వీసులో ఉన్న సుదీప్ లఖ్టకియాతో పాటు నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, హోం శాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేది, రోడ్ సేఫ్టీ డీజీ కృష్ణప్రసాద్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ నలుగురిలో ఎవరో ఒకరికి డీజీపీ పోస్టు ఖాయమన్న చర్చ ఐపీఎస్‌ల్లో నడుస్తోంది. ఇక డీజీపీ నియామక ప్రక్రియలో త్రివేది ఫార్ములా బెటర్ అని, తనకు ఏడాది, రాజీవ్ త్రివేదికి రెండేళ్లు డీజీపీగా అవకాశం ఇవ్వాలని డీజీ కృష్ణ ప్రసాద్ ప్రభుత్వానికి సూచించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మిగిలిన పదవీకాలాన్ని మహేందర్ రెడ్డికి ఇస్తే తమకు అభ్యంతరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే తాను సీఎంకు ఎలాంటి ఫార్ములా ఇవ్వలేదని, డీజీపీగా నియమించుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని త్రివేది పేర్కొన్నారు. -
మెదక్ జిల్లాకు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ మంజూరు
సాక్షి, హైదరాబాద్: మెదక్ జిల్లా రామచంద్రాపురం వద్ద ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈమేరకు హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్‌త్రివేది బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వాహనాల రద్దీని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ సూచన మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నూతన పోలీసు స్టేషన్‌కు ఒక సీఐ, ఎనిమిది మంది సబ్ఇన్స్పెక్టర్లు, ఆరుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 28 మంది కానిస్టేబుళ్ల సిబ్బందిని నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో వెల్లడించారు. -
రేపట్నుంచి గాలింపు చర్యలు ముమ్మరం: రాజీవ్ త్రివేది
మండి: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధుల వెలికితీతకు శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది స్పష్టం చేశారు. 3 కి.మీ వరకు అణువణువూ గాలిస్తామన్నారు. గాలింపు కోసం ప్రాజెక్ట్‌లో నీరు ఆపేసిన వెంటనే రంగంలోకి దిగుతామని ఆయన తెలిపారు. నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటం, బండరాళ్లు ఉండటంతో గాలింపు కష్టంగా ఉందని రాజీవ్ త్రివేది మీడియాకు వివరణ ఇచ్చారు. గతంలో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల స్వయంగా రంగంలోకి దిగానని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.