రేపట్నుంచి గాలింపు చర్యలు ముమ్మరం: రాజీవ్ త్రివేది
Published Fri, Jun 13 2014 9:26 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
మండి: హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధుల వెలికితీతకు శనివారం ఉదయం నుంచి గాలింపు చర్యలు ముమ్మరం చేస్తామని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది స్పష్టం చేశారు. 3 కి.మీ వరకు అణువణువూ గాలిస్తామన్నారు. గాలింపు కోసం ప్రాజెక్ట్‌లో నీరు ఆపేసిన వెంటనే రంగంలోకి దిగుతామని ఆయన తెలిపారు.
నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటం, బండరాళ్లు ఉండటంతో గాలింపు కష్టంగా ఉందని రాజీవ్ త్రివేది మీడియాకు వివరణ ఇచ్చారు. గతంలో పనిచేసిన అనుభవం ఉండటం వల్ల స్వయంగా రంగంలోకి దిగానని అడిషనల్ డీజీ రాజీవ్ త్రివేది ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు.
Advertisement