'వీఎన్ఆర్' తీరును తప్పుపట్టిన నాయిని!
'వీఎన్ఆర్' తీరును తప్పుపట్టిన నాయిని!
Published Sun, Jun 15 2014 12:36 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
హిమాచల్ : వీఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం తీరును తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తప్పుపట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో ప్రమాదానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్ధుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించే కార్యక్రమాన్ని మండిలో నాయిని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే.
హిమాచల్ లోని ఘటనాస్థలానికి విద్యార్థుల తల్లిదండ్రులను పంపేందుకు విమానం ఎందుకు ఏర్పాటు చేయలేదని కాలేజీ యాజమాన్యాన్ని నాయిని ప్రశ్నించారు. అయితే నాయిని ప్రశ్నకు కాలేజీ యాజమాన్యం పొంతనలేని వివరణ ఇచ్చింది. కాలేజి యాజమాన్యం వివరణపై నాయిని అసంతృప్తిని వ్యక్తం చేశారు.
గత వారం రోజులుగా నాయిని అక్కడే ఉండి సహాయ సహకార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. గతవారం విజ్ఞాన యాత్రకు వెళ్లిన వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు.
Advertisement
Advertisement