VNR College
-
‘గీతా’ మాధుర్యం
బాచుపల్లిలోని వీఎన్ఆర్ మేనేజ్మెంట్ కళాశాలలో శనివారం నిర్వహించిన కల్చరల్ ఫెస్ట్ సందడిగా సాగింది. గాయని గీతామాధురి పాటకు విద్యార్థుల ఆట తోడై ప్రాంగణం మార్మోగింది. ‘పెళ్లిచూపులు’ ఫేం విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. – జగద్గిరిగుట్ట -
VNR కాలేజ్ ఎదుట బాధిత తల్లిదండ్రుల అందోళన
-
'వీఎన్ఆర్' తీరును తప్పుపట్టిన నాయిని!
-
'వీఎన్ఆర్' తీరును తప్పుపట్టిన నాయిని!
హిమాచల్ : వీఎన్ఆర్ కాలేజీ యాజమాన్యం తీరును తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహరెడ్డి తప్పుపట్టారు. హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో ప్రమాదానికి గురైన ఇంజినీరింగ్ విద్యార్ధుల మృతదేహాలను కుటుంబాలకు అప్పగించే కార్యక్రమాన్ని మండిలో నాయిని పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. హిమాచల్ లోని ఘటనాస్థలానికి విద్యార్థుల తల్లిదండ్రులను పంపేందుకు విమానం ఎందుకు ఏర్పాటు చేయలేదని కాలేజీ యాజమాన్యాన్ని నాయిని ప్రశ్నించారు. అయితే నాయిని ప్రశ్నకు కాలేజీ యాజమాన్యం పొంతనలేని వివరణ ఇచ్చింది. కాలేజి యాజమాన్యం వివరణపై నాయిని అసంతృప్తిని వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా నాయిని అక్కడే ఉండి సహాయ సహకార కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్న సంగతి తెలిసిందే. గతవారం విజ్ఞాన యాత్రకు వెళ్లిన వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు బియాస్ నదిలో ప్రమాదవశాత్తూ గల్లంతయ్యారు. -
ఉదయం 6 గంటల నుంచే గాలింపు చర్యలు
-
ఉదయం 6 గంటల నుంచే గాలింపు చర్యలు
మండి : హిమాచల్ ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతైన విద్యార్ధుల గాలింపు కార్యక్రమం ఏడో రోజు కూడా ముమ్మరంగా సాగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా మూడు డ్యాంలలోని నీటి విడుదలను నిలిపివేసి విద్యార్ధుల కోసం వెతుకుతున్నారు. ఆర్మీ, ఎస్ఎస్పీ, ఐటీజీపీ, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలిస్తున్నాయి. 800మంది నిపుణులతో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచే గాలింపు చర్యలు చేపట్టారు. 30 బృందాలతో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. మండీలోని మూడు డ్యామ్‌ల పరిధిలో నీటి ప్రవాహాన్ని క్రమక్రమంగా తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రమాదానికి 3 కిలోమీటర్ల పరిధిలో ప్రతి అంగుళం వెతకాలని అధికారులు నిర్ణయించారు. గాలింపు చర్యలను హిమాచల్ మంత్రి అనీత్ శర్మ, తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీలు వినోద్, జితేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇలా వుండగా ఈ ప్రమాదం హిమాచల్ ప్రదేశ్ సర్కారులో విప్లవాత్మక మార్కులకు నాంది పలికింది. నదీ తీర ప్రాంతాల్లో... హెచ్చరిక బోర్డులు వెలుస్తున్నాయి. నదికి దగ్గరగా వున్న ప్రాంతాల్లో మళ్ళీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు. -
ఆరు రోజులైనా తీరని వేదన!
సాక్షి, హైదరాబాద్: అవే కన్నీళ్లు.. అదే ఆవేదన.. బిడ్డ బతికి వస్తాడన్న ఆశతో ఎదురుచూస్తున్న వారు కొందరు.. కనీసం కడసారి చూపుకైనా నోచుకుంటామా అని గుండెలవిసేలా రోదిస్తున్నవారు మరికొందరు..! హిమాచల్ దుర్ఘటనకు శుక్రవారంతో ఆరు రోజులు అవుతున్నా తల్లిదండ్రుల శోకం తీరలేదు. బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం శుక్రవారం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. ఆర్మీ, నేవీ, ఐటీబీపీతోపాటు రాష్ట్రం నుంచి వెళ్లిన గజ ఈతగాళ్లు ముమ్మరంగా గాలించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ఒక్క మృతదే హం కూడా కనుక్కోలేకపోయారు. దీంతో లార్జి ప్రాజెక్టు నుంచి శనివారం ఉదయం గంటసేపు నీటిని విడుదల చేయకుండా గేట్లను మూసివేయనున్నారు. రాష్ట్రం నుంచి సహాయక చర్యలు పర్యవేక్షించడానికి వెళ్లి అక్కడే ఉన్న తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, అదనపు డీజీ రాజీవ్‌త్రివేది పలుమార్లు చేసిన విజ్ఞప్తితో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు అంగీకరించింది. గేట్లను మూసిన తర్వాత డ్యాం నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు ఐదు వందల మందితో గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి విహారయాత్రకు వెళ్లిన 24 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, ఒక టూర్ ఆపరేటర్ మండి జిల్లాలోని బియాస్ నదిలో గత ఆదివారం కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఇందులో గురువారం వరకు మొత్తం ఎనిమిది మంది విద్యార్థుల మృతదేహాలను వెలికి తీశారు. ఇంకా 17 మంది జాడ తెలియ రాలేదు. శుక్రవారం గాలింపు బృందాలు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఘటనా స్థలం నుంచి 10 కి.మీ. పరిధిలో వెతికాయి. లార్జి ప్రాజెక్టు నుంచి నీటి ప్రవాహాన్ని కనీసం మూడు గంటల పాటు ఆపగలిగితే కనీసం 3 కిలోమీటర్ల దూరం వరకు నదిలో నీరు తగ్గుతుందని డీజీ రాజీవ్ త్రివేది ‘సాక్షి’తో మాట్లాడుతూ తెలిపారు. అయితే ఉదయం 7 నుంచి 8 గంటల వరకే గేట్లను మూస్తామని హిమాచల్ ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతకంటే ఒక్క నిమిషం ఎక్కువై నా తమ పవర్ ప్రాజెక్టుకు ముప్పు ఏర్పడుతుందని తెలిపింది. ఈ గంట కూడా గేట్లు మూసేందుకు ఇంజనీర్లు అంగీకరించకపోయినా.. చివరికి నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. ప్రాజెక్టుకు పై నుంచి మంచుకొండలు కరిగి ఆ నీరు వస్తుందని, దాన్ని ఏమాత్రం నిలువరించినా ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని అక్కడి అధికారులు ఆందోళన చెందుతున్నారు. స్వస్థలాలకు మృతదేహాలు: బియాస్ నదిలో గురువారం బయటకు తీసిన అరవింద్, ఉపేందర్ మృతదేహాలు శుక్రవారం మధ్యాహ్నం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. అధికారులు అక్కడ్నుంచి అంబులెన్స్‌లో వారి స్వస్థలాలకు పంపారు. మృతదేహాలను గుర్తుపట్టేందుకు వెళ్లిన బంధువులు కూడా అదే విమానంలో వచ్చారు. ఉపేందర్ అంత్యక్రియలను శుక్రవారం రాత్రి 8 గంటలకు స్వగ్రామమైన ఖమ్మం జిల్లా పాల్వంచ మండలం గట్టాయిగూడెంలో పూర్తి చేశారు. -
మనోళ్లు నలుగురు
- ఇద్దరు గల్లంతు - మరో ఇద్దరు సురక్షితం - హిమాచల్‌ప్రదేశ్ దుర్ఘటన కరీంనగర్ రూరల్/కరీంనగర్ క్రైం: హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో ఆదివా రం గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో మన జిల్లాకు చెందిన వారు నలుగురు ఉన్నారు. వీరిలో ఇద్దరు గల్లం తుకాగా, మరో ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగి పోయాయి. సురక్షితంగా బయటపడ్డ వారు స్వగ్రామాలకు బయలుదేరారు. కరీంనగర్ మండలం రేకుర్తికి చెందిన దాసరి శ్రీనిధి అనే ఇంజినీరింగ్ విద్యార్థి గల్లంతైనట్లు తెలవడంతో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగారు. తండ్రి రాజిరెడ్డి తెల్లవారుజామున హైదరాబాద్ వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో సంఘటన స్థలానికి బయలుదేరారు. సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లెకు చెందిన దాసరి రాజిరెడ్డి వ్యాపార నిమిత్తం 15 ఏళ్ల క్రితం కరీంనగర్ వచ్చారు. ప్రస్తుతం రేకుర్తిలో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు. శ్రీనిధి వీఎన్ఆర్ కాలేజీలో ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతోంది. ఈనెల 2న శ్రీనిధి హైదరాబాద్‌కు వెళ్లింది. మరుసటి రోజు సహచర విద్యార్థులతో కలిసి విహారయాత్రకు వెళ్లింది. ఆదివారం సాయంత్రం 4 గం టలకు తండ్రి రాజిరెడ్డికి ఫోన్ చేసి కులుమనాలిలో ఉన్నట్లు చెప్పింది.అంతలోనే ఇంజినీరింగ్ విద్యార్ధులు నదిలో గల్లంతైనట్లు టీవీల్లో వార్తలు రావడంతో ఆ దంపతులు ఆందోళనకు గురయ్యారు. శ్రీనిధి స్నేహితురాలు దివ్యకు ఫోన్ చేయడంతో గల్లంతైన విషయం తెలిసింది. రాజిరెడ్డి ఆదివారం రాత్రి హిమాచల్‌ప్రదేశ్‌లోని కులుమానాలికి బయలుదేరారు. సోమవారం సాయంత్రం 6.20 గంటలకు అక్కడికి చేరుకున్నారు. రాత్రి కావడంతో డ్యాం వద్దే ఉంచారని, తెల్లవారుజామునే రేస్క్యూ ఆపరేషన్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకుంటామని రాజిరెడ్డి ‘సాక్షి’తో తెలిపారు. మాట్లాడిన కొద్ది సేపటికే ‘నా బిడ్డ ఉదయం 10.30 గంటలకు ఫొన్ చేసి మాట్లాడింది. సాయంత్రం కులుమనాలికి చేరుకుంటాం..మళ్లీ కాల్ చేస్తామన్నది. సాయంత్రం 4 గంటలకు కాల్ చేసి మరికొద్ది సేపటిలో కులుమనాలి చేరుకుంటామని చెప్పి కట్ చేసింది. ఫొన్ చేస్తుందని ఎదురుచూస్తుండగా గల్లంతయిందన్న వార్త వచ్చింది’ అంటూ రోదిస్తూ దాసరి శ్రీనిధి తండ్రి రాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తన కారులోనే నాంపల్లి రైల్వేస్టేషన్ వరకు దింపి వచ్చానని చెప్పాడు. ప్రతిరోజు రాత్రి 7.30 నుంచి 8.30 గంటల మధ్య మాట్లాడుతుందని కూతురు జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రోదించారు. -
మా ప్రాణాలు పోయినా బాగుండేది: వీఎన్ఆర్
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో విద్యార్థులవి కాకుండా మా ప్రాణాలు పోతే బాగుండేదని విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని విఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటన మమ్మల్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని యాజమాన్యం అన్నారు. ఈ దుర్ఘటనపై హిమాచల్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. డ్యాం అధికారుల తప్పిదంవల్లే ప్రమాదం జరిగిందని హిమాచల్ సీఎం ఒప్పుకున్నారని మీడియాకు యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థుల మృతదేహాలను ఇంటికి చేర్చే బాధ్యత మాదేనని, పవర్ హౌస్‌ను చూడటానికి వెళ్లిన మా విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని యాజమాన్యం తెలిపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సహయక చర్యలకు విఘాతం కలుగుతోందని విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.