మా ప్రాణాలు పోయినా బాగుండేది: వీఎన్ఆర్
మా ప్రాణాలు పోయినా బాగుండేది: వీఎన్ఆర్
Published Mon, Jun 9 2014 5:22 PM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో విద్యార్థులవి కాకుండా మా ప్రాణాలు పోతే బాగుండేదని విఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది.
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని విఎన్‌ఆర్ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటన మమ్మల్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని యాజమాన్యం అన్నారు.
ఈ దుర్ఘటనపై హిమాచల్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. డ్యాం అధికారుల తప్పిదంవల్లే ప్రమాదం జరిగిందని హిమాచల్ సీఎం ఒప్పుకున్నారని మీడియాకు యాజమాన్యం వెల్లడించింది.
విద్యార్థుల మృతదేహాలను ఇంటికి చేర్చే బాధ్యత మాదేనని, పవర్ హౌస్‌ను చూడటానికి వెళ్లిన మా విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని యాజమాన్యం తెలిపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సహయక చర్యలకు విఘాతం కలుగుతోందని విఎన్‌ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు.
Advertisement