Larji reservoir
-
మా ప్రాణాలు పోయినా బాగుండేది: వీఎన్ఆర్
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో విద్యార్థులవి కాకుండా మా ప్రాణాలు పోతే బాగుండేదని విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేసింది. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని విఎన్ఆర్ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు మృతి చెందిన ఘటన మమ్మల్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసిందని యాజమాన్యం అన్నారు. ఈ దుర్ఘటనపై హిమాచల్ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని.. డ్యాం అధికారుల తప్పిదంవల్లే ప్రమాదం జరిగిందని హిమాచల్ సీఎం ఒప్పుకున్నారని మీడియాకు యాజమాన్యం వెల్లడించింది. విద్యార్థుల మృతదేహాలను ఇంటికి చేర్చే బాధ్యత మాదేనని, పవర్ హౌస్‌ను చూడటానికి వెళ్లిన మా విద్యార్థులు నీటి ప్రవాహానికి కొట్టుకుపోయారని యాజమాన్యం తెలిపింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటం వల్ల సహయక చర్యలకు విఘాతం కలుగుతోందని విఎన్ఆర్ విజ్ఞానజ్యోతి కళాశాల యాజమాన్యం ఓ ప్రశ్నకు వివరణ ఇచ్చారు. -
హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనపై స్పందించిన ప్రభాస్!
హైదరాబాద్: హిమాచల్ ప్రదేశ్ లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంపై సినీ నటుడు ప్రభాస్ స్పందించారు. విద్యార్ధులు ప్రమాదానికి గురయ్యారనే వార్త తీవ్రంగా కలిచివేసిందని సోషల్ మీడియా వెబ్ సైట్ ఫేస్ బుక్ లో ప్రభాస్ పోస్ట్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ దుర్ఘటనలో మరణించిన విద్యార్ధుల కుటుంబాలకు ప్రభాస్ సంతాపం తెలిపారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి జిల్లాలో బియాస్ నదిపై నిర్మించిన లార్జి హైడ్రోపవర్‌ప్రాజెక్టు డ్యామ్ గేట్లను అకస్మాత్తుగా ఎత్తివేయడంతో హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజికి చెందిన 24 మంది విద్యార్థులు కొట్టుకుపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా విషాదంలోకి నెట్టింది. నదీ జలాల్లో కేరింతలు కొడుతూ, ఆటలాడుకుంటూ అప్పటివరకు ఉల్లాసంగా ఫొటోలు దిగుతున్న విద్యార్థులపై ఒక్కసారిగా పెరిగిన నీటి ప్రవాహం విరుచుకుపడటంతో ఈ దుర్ఘటన సంభవించింది. Very sad to hear about d tragedy.My prayers with all the families of HYDstudents,who lost their lives in Himachal- #Prabhas— Prabhas (@Prabhas_Team) June 9, 2014