హైదరాబాద్ చేరుకున్న నాయిని!
హైదరాబాద్ చేరుకున్న నాయిని!
Published Mon, Jun 16 2014 7:54 PM | Last Updated on Sat, Oct 20 2018 5:03 PM
హైదరాబాద్: తెలంగాణ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు సోమవారం మధ్యాహ్నం చేరుకున్నారు. జూన్ 8 తేదిన హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో వీఎన్ఆర్ ఇంజనీరింగ్ విద్యార్ధులు గల్లంతైన ఘటనలో సహాయ సహాకార కార్యక్రమంలో పాల్గొనేందుకు నాయిని హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లిన సంగతి తెలిసిందే.
హిమాచల్ ప్రదేశ్ లో జరిగిన విషాదంలో గల్లంతైన, మృతి చెందిన కుటుంబాలకు అండగా నిలిచేందుకు గత వారం రోజులుగా నాయిని హిమాచల్ ప్రదేశ్ లో ఉండి కార్యక్రమాల్ని పర్యవేక్షించారు.
హైదరాబాద్ చేరుకున్న నాయని మీడియాతో మాట్లాడుతూ.. హిమాచల్ ప్రభుత్వం సహయం అందించింది. మరో 10 రోజులు గాలింపు చర్యలు చేపడతాం అని అన్నారు.
Advertisement
Advertisement