వీఎన్ఆర్ విద్యార్ధుల చివరి భోజనం వీడియో లభ్యం
Published Fri, Jun 13 2014 4:12 PM | Last Updated on Sat, Sep 2 2017 8:45 AM
మండి: వీఎన్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్ధులు హిమాచల్ ప్రదేశ్ లోని బియాస్ నదిలో గల్లైంతైన విషాదానికి ముందు ఓ హోటల్ భోజనం చేసిన వీడియో మీడియాకు చేరింది. వీఎన్ఆర్ కాలేజీ విద్యార్థులు ఘటనాస్థలం తలోట్‌కు10 కి.మీ ముందు ఆశాదీప్ హోటల్లో భోజనం చేశారు.
విద్యార్ధులందరూ ఆనందంతో కలిసి చేసిన ఆఖరి భోజనం సంబంధించిన వివరాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఆఖరి భోజనం సమయంలో విద్యార్థులు ఉల్లాసంగా గడిపారు. ఆతర్వాత విద్యార్ధులందరూ బియాస్ నదిలో ఉత్సాహంతో ఫోటోలు దిగుతుండగా వరదలు ఆకస్మిక వారి జీవితాలను కబలించాయి. ద్యార్ధుల చివరి భోజనం వీడియో అందర్ని హృదయాలను కలిచివేసింది.
Advertisement
Advertisement