హైదరాబాద్: నా పూర్తి డీజీపీ సర్వీసు చాలా సంతృప్తినిచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. శుక్రవారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్లకు పైగా పోలీసు శాఖలో విధులు నిర్వర్తించానని, ఈరోజు తన పదవి చివరి రోజు అని చెప్పారు. తనకు సహకరించిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక పోలీసును తానేనన్నారు. 1992లో సౌత్ జోన్ డీసీపీగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పాత బస్తీ చాలా సెన్సిటివ్‌గా ఉందని, సౌత్ జోన్‌లో డీసీపీగా పనిచేయడం తన కెరియర్‌లో పెద్ద ఛాలెంజింగ్ విధి నిర్వహణ అని పేర్కొన్నారు.
ఇప్పుడు పాతబస్తీలో అలాంటి పరిస్థితులు లేవని, పాతబస్తీవాసుల్లో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. కాగా, పోలీసు రిక్రూట్‌మెంట్‌లో చాలా మార్పులు తెచ్చామని, ప్రతి కానిస్టేబుల్ కూడా అధికారిలా భావించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. అందుకే డిపార్టుమెంట్లో కానిస్టేబుల్ స్థాయి నుంచే టెక్నాలజీని వినియోగించే విధంగా శిక్షణలో మార్పులు తీసుకొచ్చామన్నారు. పోలీస్ శాఖ నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విభజన సమయంలో నగరానికి ఎక్కువ స్థాయిలో సిబ్బంది అవసరం ఉండగా కేవలం 29మంది ఐపీఎస్‌లలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సి వచ్చిందని చెప్పారు. టీమ్ వర్క్‌తో దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని, ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని, అందుకు కావాల్సిన వనరులను ప్రభుత్వం అందించిందని డీజీ.పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment