Last Working Day
-
ఒక్కరోజు ముందుగానే.. సీజేఐ వీడ్కోలు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నే తృత్వంలోని ప్రధాన ధర్మాసనం జరిపే చివరి సారి విచారణ ప్రత్యక్ష ప్రసారం కానుంది. జస్టిస్ లలిత్ మంగళవారం పదవీ విరమణ చేయాల్సి ఉంది. అయితే.. గురునానక్ జయంతి సందర్భంగా సుప్రీంకోర్టుకు సెలవుదినం. ఈ నేపథ్యంలో జస్టిస్ లలిత్, కాబోయే సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తి జస్టిస్ బేలా ఎం.త్రివేదీలతో కూడిన ధర్మాసనం సోమవారం జరిపే లాంఛన విచారణను తమ వెబ్సైట్లో లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోర్టు నిర్ణయించింది. రిటైరయ్యే సీజేఐ చివరి విచారణను తన వారసునితో కలిసి చేపట్టడం ఆనవాయితీ. కేంద్ర ప్రభుత్వోద్యోగాలు, విద్యా సంస్థల ప్రవేశాల్లో ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై సీజేఐ ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించనుంది. ఆగస్టు 26న సీజేఐగా రిటైరైన జస్టిస్ ఎన్.వి.రమణ చివరి రోజు చేపట్టిన విచారణను తొలిసారిగా కోర్టు లైవ్ స్ట్రీమ్ చేసింది. ఇదీ చదవండి: హైకోర్టులు అలాంటి ఆదేశాలివ్వొద్దు! -
బాధ్యతలు నిర్వర్తించడం సంతృప్తినిచ్చింది
-
సంతృప్తిగా ఉంది: డీజీపీ
హైదరాబాద్: నా పూర్తి డీజీపీ సర్వీసు చాలా సంతృప్తినిచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. శుక్రవారం ఇక్కడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 35 ఏళ్లకు పైగా పోలీసు శాఖలో విధులు నిర్వర్తించానని, ఈరోజు తన పదవి చివరి రోజు అని చెప్పారు. తనకు సహకరించిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్సైజ్ శాఖలో డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన ఏకైక పోలీసును తానేనన్నారు. 1992లో సౌత్ జోన్ డీసీపీగా బాధ్యతలు తీసుకున్నప్పుడు పాత బస్తీ చాలా సెన్సిటివ్‌గా ఉందని, సౌత్ జోన్లో డీసీపీగా పనిచేయడం తన కెరియర్లో పెద్ద ఛాలెంజింగ్ విధి నిర్వహణ అని పేర్కొన్నారు. ఇప్పుడు పాతబస్తీలో అలాంటి పరిస్థితులు లేవని, పాతబస్తీవాసుల్లో చాలా మార్పు వచ్చిందని తెలిపారు. కాగా, పోలీసు రిక్రూట్మెంట్లో చాలా మార్పులు తెచ్చామని, ప్రతి కానిస్టేబుల్ కూడా అధికారిలా భావించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. అందుకే డిపార్టుమెంట్లో కానిస్టేబుల్ స్థాయి నుంచే టెక్నాలజీని వినియోగించే విధంగా శిక్షణలో మార్పులు తీసుకొచ్చామన్నారు. పోలీస్ శాఖ నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. విభజన సమయంలో నగరానికి ఎక్కువ స్థాయిలో సిబ్బంది అవసరం ఉండగా కేవలం 29మంది ఐపీఎస్లలతో రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాల్సి వచ్చిందని చెప్పారు. టీమ్ వర్క్‌తో దేశంలోనే తెలంగాణ పోలీసులు అగ్రస్థానంలో ఉన్నారని, ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైందని, అందుకు కావాల్సిన వనరులను ప్రభుత్వం అందించిందని డీజీ.పీ తెలిపారు. -
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ
హైదరాబాద్: ఏపీ శీతకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు కూడా అసెంబ్లీ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మంగళవారంనాటి సమావేశంలో మంత్రి పీతల సుజాత బాక్సైట్, ఇసుక పాలసీలపై ఒక ప్రకటన చేయనున్నారు. అలాగే, విజయవాడ కల్తీ మద్యం మరణాలు, విశాఖపట్నంలో కొండ చరియలు విరిగిపడి చోటుచేసుకున్న మరణాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది. కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై ఇక చర్చించేంది లేదని, చర్చ ముగిసిందని ప్రభుత్వం చెప్పడంతోపాటు రోజాపై వేసిన సస్పెన్షన్ విషయంలో పునఃపరిశీలన చేసే ప్రసక్తి లేదని చెప్పడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ కొనసాగిస్తున్నారు. -
ఆంధ్రప్రదేశ్‌కు బై బై
కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : సమైక్య ఆంధ్రప్రదేశ్‌కు వీడ్కోలు పలికేందుకు తెలంగాణ సిద్ధమైంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించనుంది. దీంతో సుమారు ఐదున్నర దశాబ్దాలకు పైగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన గుర్తులు చెరిగిపోనున్నాయి. ఇక పాత రాష్ట్రానికి సంబంధించిన బోర్డు ఈ ఒక్క రోజు కనిపించే అవకాశం ఉంది. ఇప్పటికే అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై తెలంగాణ ప్రభుత్వం పేరుతో బోర్డులు రాయాలన్న ఆదేశాలను అధికారులు జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ కల సాకారం కాబోతోందన్న సంబరాల్లో ఉన్నారు. కోటి ఆశలతో కొత్త రాష్ట్రంలో పని చేయడానికి ఉద్యోగులు, సామాన్యులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ సంబరాలను మే 30, 31న నిర్వహించగా.. ఆదివారం సెలవు దినం కావడంతో ఆంధ్ర రాష్ట్రానికి బై బై చెబుతూ తెలంగాణ రాష్ట్రానికి స్వాగతం పలికేందుకు అధికారులు, ప్రజలు సిద్ధమవుతున్నారు. జూన్ ఒకటి ఆదివారం కావడం, జూన్ 2న సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కావడంతో ఉద్యోగులందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చివరి వర్కింగ్ డే ముగిసింది. ఇప్పటికే మే నెలకు సంబంధించిన వేతనాలు పొందారు. ఫిబ్రవరిలో యూపీఏ ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేసిన నాటి నుంచి ఉద్యోగులు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు పని చేస్తామా అన్న ఆసక్తితో ఉన్నారు. జూన్ 23వరకు ఎన్నికల కోడ్ ఉండగా.. అది తొలగినప్పటికీ ఎలాంటి పనులు చేయలేకపోయిన ఉద్యోగులు వారి ఆశలకు అనుగుణంగా అపాయింటెడ్ డే దగ్గర పడింది. ఇన్నాళ్లూ సమైక్య రాష్ట్రంలో పనిచేసిన ఉద్యోగులు ఒక్కసారిగా స్వంత రాష్ట్రంలో పనిచేయబోతున్నామనే భావన వారిలో ఆనందాన్ని నింపుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యోగ సంఘాలు లక్ష్యం నెరవేరడంతో రాష్ట్ర ప్రగతిలోనూ కీలక పాత్ర పోషించాలని సామాన్య ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మారనున్న బోర్డులు ప్రభుత్వ కార్యాలయాల బోర్డులన్నీ ఆదివారం రోజు మారిపోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అనే పదాలను తొల గించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. సకలజనుల సమ్మె కాలంలోనే ప్రభుత్వ కార్యాలయాలన్నింటికీ ఆంధ్రప్రదేశ్ తొలగించి టీజీ అన్న అక్షరాలను ఉద్యమకారులు రాసినప్పటికీ.. అధికారికంగా వాటికి విలువ లేకుం డా ఉన్నాయి. రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో జూన్ 2న తెలంగాణ రాష్ట్ర సీఎంగా కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనే బోర్డులను ఏర్పాటు చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. వారి ఆదేశాలకు అనుగుణంగా ఆదివారం బోర్డులు మారనున్నాయి. తమ చిరకాల వాంఛ ఇన్నాళ్లకు తీరుతోందని ఉద్యోగ సంఘాలు, ఉద్యమకారులు సంబరాలకు సిద్ధమవుతున్నారు.