హైదరాబాద్: ఏపీ శీతకాల సమావేశాలు నేటితో ముగియనున్నాయి. నేడు కూడా అసెంబ్లీ సమావేశాన్ని ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బహిష్కరించింది. మంగళవారంనాటి సమావేశంలో మంత్రి పీతల సుజాత బాక్సైట్, ఇసుక పాలసీలపై ఒక ప్రకటన చేయనున్నారు. అలాగే, విజయవాడ కల్తీ మద్యం మరణాలు, విశాఖపట్నంలో కొండ చరియలు విరిగిపడి చోటుచేసుకున్న మరణాలకు సంబంధించి కూడా అసెంబ్లీలో చర్చ జరగనుంది.
కాల్ మనీ సెక్స్ రాకెట్ అంశంపై ఇక చర్చించేంది లేదని, చర్చ ముగిసిందని ప్రభుత్వం చెప్పడంతోపాటు రోజాపై వేసిన సస్పెన్షన్ విషయంలో పునఃపరిశీలన చేసే ప్రసక్తి లేదని చెప్పడంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేసిన విషయం తెలిసిందే. ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ కొనసాగిస్తున్నారు.
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ
Published Tue, Dec 22 2015 8:54 AM | Last Updated on Mon, Jul 23 2018 6:55 PM
Advertisement
Advertisement