సాక్షి, హైదరాబాద్ : పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేస్తేనే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశం గురువారమిక్కడ ముగిసింది. అనంతరం పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమావేశం వివరాలను మీడియాకు వివరించారు. ఫిరాయింపుకు పాల్పడిన 20మందిపై అనర్హత వేటు వేస్తేనే శాసనసభకు హాజరు అవుతామని ఆయన తెలిపారు. ‘ఫిరాయింపులపై ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది. 20మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోవడమే కాకుండా వారిలో నలుగురిని మంత్రులు చేశారు. మంత్రి పదవులు కట్టబెట్టిన నలుగురిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తేనే
తాజా అసెంబ్లీ బులిటెన్‌లో 66మందిని వైఎస్‌ఆర్ సీపీ సభ్యులుగా చూపించారు. ఇరవైమంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసి...మంత్రి పదవులు కట్టబెట్టిన నలుగురిని కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి. అప్పుడే సభకు హాజరు అవుతాం. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను ఏకపక్షంగా నిర్వహిస్తోంది. ప్రతిపక్షంగా మా గొంతను నొక్కేస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఐదేళ్లలో 156 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగితే... గత నాలుగేళ్లలో చంద్రబాబు కేవలం 80 రోజులు సభ నడిపారని అన్నారు. సభలో ప్రతిపక్ష నేతను తిట్టే కార్యక్రమాన్నే నిర్వహిస్తురు. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అనే అనుమానం కలుగుతోంది. త్వరలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్‌లను కలిసి అప్రజాస్వామిక విధానాలను వివరిస్తాం.’ అని పెద్దిరెడ్డి తెలిపారు.
వైఎస్‌ఆర్ సీపీ నేతల ముఖ్య సమావేశం
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల రాష్ట్ర స్థాయి ముఖ్య సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని రావినారాయణరెడ్డి సమావేశ మందిరంలో ఈ సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ జగన్ పాదయాత్ర చేస్తున్నపుడు ఆరు నెలలపాటు ఇతర జిల్లాల్లో పార్టీ శ్రేణులు చేయాల్సిన కార్యక్రమాలను ఈ సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 11న జరిగిన విస్తృత సమావేశంలో జగన్ పార్టీ నేతలనుంచి ఇదే అంశంపై అభిప్రాయాల్ని తెలుసుకున్న విషయం విదితమే. వాటి ఆధారంగా రూపొందించిన కార్యాచరణపై ఇవాళ జగన్ దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లాల పరిశీలకులు, జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గాల సమన్వయకర్తలు హాజరయ్యారు.
వారిపై అనర్హత వేటు వేస్తేనే శాసనసభకు హాజరు అవుతాం
Comments
Please login to add a commentAdd a comment