విద్యతోనే మనిషికి గుర్తింపు
-
పెద్దాపురంలో రూ.21 కోట్లతో పాఠశాల
-
డిప్యూటీ సీఎం చినరాజప్ప
సామర్లకోట :
విద్యతోనే మనిషికి గుర్తింపు ఉంటుందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న తోటకూర సాయి రామకృష్ణను గురువారం సాయంత్రం సన్మానించారు. బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సాయిరామకృష్ణ సామాన్య కుటుంబంలో పుట్టి 2004లో రాష్ట్ర స్థాయి, 2106లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోవడం అభినందనీయమన్నారు. పెద్దాపురం పట్టణ పరిధిలో 10 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా రూ.21 కోట్లతో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షత వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం మాట్లాడుతూ 1984లో తన చేతులతో ఉపాధ్యాయుడిగా నియామక ఉత్తర్వులు సాయిరామకృష్ణకు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకుడు దవులూరి సుబ్బారావు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, రెడ్నం సునీత, కంచర్ల సుష్మమోమనీ, బడుగు శ్రీకాంత్, పాఠశాల కమిటీ చైర్మన్ సప్పా గంగాభవానీ పాల్గొన్నారు. అనంతరం సాయి
రామకృష్ణ దంపతులను సన్మానించారు.