Thotakura
-
గణితంలో ఘనాపాటి తోటకూర
150 గణితావధానాలు సంపూర్ణం భానుగుడి (కాకినాడ): లెక్కల్లో లెక్కలేనన్ని చిక్కుప్రశ్నలు.. చదువులోనే కాదు.. నిజజీవితంలోనూ గణితానికి పెద్ద పాత్రే. అలాంటి గణితాన్ని సులభంగా నేర్చుకోవడం కోసం పదుల పుస్తకాలను రాసి సమాజానికి అందించిన జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత తోటకూర సాయిరామకృష్ణ గణితావధానిగా విఖ్యాతులు. సామర్లకోట బచ్చుఫౌండేష¯ŒS ఉన్నతపాఠశాలలో ప్ర«ధానోపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్న ఆయన 2010 నుంచి ఇంతవరకూ రాష్ట్ర వ్యాప్తంగా 150 గణితావధానాలను చేశారు. ఆయన శనివారం ఉదయం కాజులూరు మండలం మంజేరు జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్ధులకు గణితంలో మెళకువలపై అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం మండలంలో గణితంపై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులతో అవధాన కార్యక్రమం నిర్వహించారు. ఇది ఆయన 150వ అవధాన కార్యక్రమం. తొలుత అవగాహన సదస్సులో ఇప్పటినుంచే పదిలో పదిలంగా మార్కులు సాధించేందుకు చేయవలసిన కృషిని వివరించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో గణితంపై ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి గణిత మేధావులను తయారుచేయాలని నిర్ణయించుకున్నట్లు శనివారం కాకినాడలో విలేకరుల సమావేశంలో ఆయన పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థుల కోసం గణితంలో పది సూత్రాల ప్రణాళికను తయారుచేసినట్టు సాయిరామకృష్ణ తెలిపారు. -
విద్యతోనే మనిషికి గుర్తింపు
పెద్దాపురంలో రూ.21 కోట్లతో పాఠశాల డిప్యూటీ సీఎం చినరాజప్ప సామర్లకోట : విద్యతోనే మనిషికి గుర్తింపు ఉంటుందని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. జాతీయ ఉత్తమ ఉపాధ్యాయునిగా రాష్ట్రపతి నుంచి అవార్డు అందుకున్న తోటకూర సాయి రామకృష్ణను గురువారం సాయంత్రం సన్మానించారు. బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ సాయిరామకృష్ణ సామాన్య కుటుంబంలో పుట్టి 2004లో రాష్ట్ర స్థాయి, 2106లో జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోవడం అభినందనీయమన్నారు. పెద్దాపురం పట్టణ పరిధిలో 10 ఎకరాల విస్తీర్ణంలో కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా రూ.21 కోట్లతో ప్రభుత్వ పాఠశాల ఏర్పాటు చేస్తున్నామన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ మన్యం పద్మావతి అధ్యక్షత వహించారు. మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్ చందలాడ అనంత పద్మనాభం మాట్లాడుతూ 1984లో తన చేతులతో ఉపాధ్యాయుడిగా నియామక ఉత్తర్వులు సాయిరామకృష్ణకు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్ర కార్మిక సంఘ నాయకుడు దవులూరి సుబ్బారావు, ఆస్పత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ అడబాల కుమారస్వామి, వైస్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్రప్రసాద్ కౌన్సిలర్లు మన్యం చంద్రరావు, రెడ్నం సునీత, కంచర్ల సుష్మమోమనీ, బడుగు శ్రీకాంత్, పాఠశాల కమిటీ చైర్మన్ సప్పా గంగాభవానీ పాల్గొన్నారు. అనంతరం సాయి రామకృష్ణ దంపతులను సన్మానించారు. -
చలివంటలు!
వెచ్చటి జ్ఞాపకం చలికాలం వస్తోందంటే కొందరికి చలిమంటలు గుర్తొస్తే, ఇంకొందరికి రకరకాల చలివంటలు నోట్లో నీళ్లూరిస్తాయి. మా తాతయ్యది రెండో కోవ. ఆయనకు చలికాలం రాగానే వేడివేడి పకోడీలు, గుంటపునుగులు, మిరపకాయ బజ్జీలు, అరటికాయ ఆవపెట్టిన కూర, పనసపొట్టు కూర, పులుసూబెల్లం పెట్టి వండిన కాకరకాయ కూర గుర్తొచ్చి మొన్ననే నీళ్లోసుకున్న గర్భిణిలా మారిపోయేవాడు. మామూలు రోజుల్లో వెల్లుల్లి పాయను గుమ్మం తొక్కనివ్వని వాడు... చలికాలం రాగానే వెల్లుల్లి కారప్పొడితో మొదలెట్టి, తోటకూర పాటోళీలోనూ, గోంగూర పులుసుకూరలోనూ వెల్లుల్లి గర్భాలు విరివిగా వేయించేవాడు. వేడివేడి అన్నంలో వెల్లుల్లి కారప్పొడి వేసుకుని, దానిమీద ఆరారగా నెయ్యి వే(పో)సుకుని రెండు ముద్దలు తిని,స్వర్గం బెత్తెడు దూరంలోకొచ్చేసిందనేవాడు. గోంగూర పులుసుకూరలో వేసిన వెల్లుల్లిగర్భాలనువదలకుండా తినమనేవాడు. అదేమంటే చలికాలం వెల్లుల్లి ఒంటికి మంచిదంటూ క్లాసు పీకేవాడు. ఈ మూడునెలలూ పదిహేన్రోజుల కోసారైనా నువ్వు చిమ్మిరి చెయ్యాల్సిందే... నెలకో పనసకాయ తెగాల్సిందే! అరటికాయ కూరలో ఆవపెట్టాల్సిందే! ఈ సీజన్లో ఇంటికి చుట్టాలొస్తే పండగే. ఉల్లిపాయ పకోడీలో, మిర్చిబజ్జీలో, అరటికాయ పుగ్గీలో, పెసర పుణుకులో చేయించి వేడివేడిగా వడ్డింపించేవాడు. పాపం! మహాతల్లి... మా మామ్మ ఆయన అడిగిన వంటకాలన్నింటినీ విసుక్కోకుండా వండి వార్చేది. వంటకాలే కాదు, ఏ రుతువులో దొరికే పండ్లు, కూరగాయలను ఆ రుతువులో తప్పనిసరిగా తినేవాడు, తినిపించేవాడు. ఒక్క చలికాలమనే కాదు... ఎండాకాలంలోనూ, వర్షాకాలంలోనూ కూడా అంతే! సీజన్‌కి తగ్గ ట్టు తినడం, తినిపించడం.. నాకు తెలిసి ఇలా ఒక్క మా ఇంట్లోనే కాదు, ఆ కాలంలో ఇంచుమించు అందరి ఇళ్లలోనూ ఉండేదనుకుంటా. అందుకే అప్పటి వాళ్లు అన్నేసి ఏళ్లు వచ్చినా, ఆరోగ్యంగా ఉండేవారు. ఆ రోజుల్లో వాళ్లు సైన్సు పాఠాలు కానీ, న్యూట్రిషన్ కోర్సుగానీ చదివి ఉండకపోవచ్చు కానీ, ఏ కాలంలో ఏమి తింటే ఆరోగ్యమో, ఏది తినకపోతే అనారోగ్యమో బాగా తెలిసిన వాళ్లు. బహుశా మా తాతయ్య వంటపాఠాల వల్ల... ఆయనతో చేసిన జీవన ప్రయాణం వల్లే కాబోలు, మా మామ్మ ఎనభయ్యో ఏట కూడా జాంకాయలను తరుక్కుని తిన్లేదు... హాయిగా కటుక్కున కొరుక్కుని తినేది. మేము వాళ్ల దగ్గర పెరిగినంతకాలమూ లేతవంకాయల్లా నవనవలాడే వాళ్లం. ఇప్పుడేమో మేమే కాదు... మా పిల్లలు కూడా తోటకూర కాడల్లా వడలిన ముఖాలతో, సడలిన శరీరాలతో ఉన్నాం. - బాచి