అధికారులను వదిలి కార్మికులపై చర్యలా?
ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ–2 డివిజన్ పరిధిలోని జీడీకే–7ఎల్‌ఈపీ గనిలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన అధికారులను వదిలి యాజమాన్యం కార్మికులపై చర్యలు తీసుకుంటు వేధింపులకు గురిచేస్తోందని హెచ్‌ఎంఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో బుధవారం మాట్లాడారు.
-
హెచ్‌ఎంఎస్ ఉపాధ్యక్షుడు దశరథంగౌడ్
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి సంస్థ ఆర్జీ–2 డివిజన్ పరిధిలోని జీడీకే–7ఎల్‌ఈపీ గనిలో జరిగిన ప్రమాదానికి బాధ్యులైన అధికారులను వదిలి యాజమాన్యం కార్మికులపై చర్యలు తీసుకుంటు వేధింపులకు గురిచేస్తోందని హెచ్‌ఎంఎస్ ఆర్జీ–2 ఉపాధ్యక్షుడు నాచగోని దశరథంగౌడ్ విమర్శించారు. స్థానిక ప్రెస్‌భవన్‌లో బుధవారం మాట్లాడారు. గతనెలలో విషవాయువుల ప్రభావానికి గురై బదిలీ కార్మికుడి మృతిచెందిన సంఘటనతో సంబందంలేని వారికి చార్జిషీట్లు, సస్పెండ్లు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తోందని విమర్శించారు. గతంలో పనిఏరియాకు సంబంధంలేని మైనింగ్ సర్దార్ కరుణాకర్‌రెడ్డిని సస్పెండ్ చేశారని, షిప్టుల్లో పనిచేసే హెడ్‌ఓవర్‌మెన్ నాగప్రసాద్‌కు చార్జిషీట్ ఇచ్చారని పేర్కొన్నారు. తాజాగా ఆక్టింగ్ మేషన్ ఎం.తిరుపతికి చార్జిషీట్ జారీ చేసి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారని పేర్కొన్నారు. అదే అధికారుల విషయంలో ఇప్పటి వరకు సరైన చర్యలు లేవన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. అధికారుల తీరును నిరసిస్తూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. దీనికి గని మేనేజర్, సేఫ్టీ ఆఫీసర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. కార్మికులు తిరగబడితే రోజులు దగ్గరపడుతున్నాయన్నారు. సమావేశంలో హబీబ్‌బేగ్, గోపాల్‌రెడ్డి, అఫ్జల్, ఖలీల్, వెంకటేశ్వర్లు, ఓదెలు, శ్రీనివాస్, మధునయ్య, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.