గేట్ మీటింగ్‌లో మాట్లాడుతున్న రియాజ్‌అహ్మద్
-
హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్
ౖయెటింక్లయిన్‌కాలనీ : సింగరేణి కార్మికుల హక్కుల సాధన కోసం జైలుకెళ్లిన ఘనత హెచ్‌ఎంఎస్‌కే దక్కుతోందని ఆ యూనియన్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్ అన్నారు. ఆర్జీ–3 ఏరియా ఓసీపీ–1 సైటాఫీస్‌లో సోమవారం జరిగిన గేట్‌మీటింగ్‌లో మాట్లాడారు. కార్మికులకు అన్యాయం జరిగితే ప్రశ్నించినందుకు అధికారులు, కార్మిక సంఘాల నాయకులు కలిసి తనపై పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ లె రిపించారన్నారు. తనపై ఎన్ని కుట్రలు చేసినా వెనకాడేది లేదని కార్మికుల హక్కుల సాధన కోసం అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. మల్టీడిపార్ట్‌మెంట్‌ల పేరుతో కార్మికులపై పనిఒత్తిడి పెంచుతున్నా గుర్తింపు సంఘం నాయకులు యాజమాన్యంతో చేతులు కలిపారన్నారు.
సకలజనుల సమ్మె వేతనాలు యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులకు రాకుండా ఆపించిన ఘనత టీబీజీకేఎస్ నాయకులకు దక్కిందని పేర్కొన్నారు. వేజ్‌బోర్డులో సభ్యత్వం కోసం లేఖలు రాసి సకాలంలో వేతన కమిటీ ఏర్పాటు కాకుండా అడ్డుకుంది టీబీజీకేఎస్ కాదా అని ప్రశ్నించారు. కార్మికుల హక్కులు కాపాడడంతో విఫలమైన ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ తీరును కార్మికులు ప్రశ్నించాలన్నారు. తాము ప్రాతినిధ్య సంఘంగా గెలిచిన డివిజన్లలో అనేక సమస్యలు సాధించామని యాజమాన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేశామన్నారు. గేట్ మీటింగ్‌లో పినకాసి మొగిలి, అజీజుల్లా, కొమ్ము మధునయ్య, బస్విరెడ్డి, మహేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, అశోక్, స్వామి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.