సింగరేణి(కొత్తగూడెం): ప్రతి కార్మికుడు, ఉద్యోగి రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని సేఫ్టీ జీఎం రాజీవ్‌కుమార్ కార్మికులను ఆదేశించారు. మంగళవారం ఏరియాలోని వర్క్ షాప్‌లో 51వ రక్షణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణిలో ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిందని, అందుకు కారణం ఉద్యోగులు రక్షణ సూత్రాలను పాటించటమేనని అన్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ కమిటీకి డీవైజీఎం ప్రసాద్, ఏజీ ఎం కిషోర్‌గంగా స్వాగతం పలికారు. అనంతరం తనిఖీ కమిటీ వర్క్‌షాప్‌లోని వివిధ యంత్రాలు, పని స్థలాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీ ఎం రాఘవేంద్రరావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేజీ తివారీ, ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీరజాక్, ఏజీఎంలు మోహన్‌రావు, పి.శ్రీనివాస్, వర్క్‌మెన్ ఇన్‌స్పెక్టర్‌లు రవి, కె.బ్రహ్మాచారి, వర్క్‌షాప్ ఇంజనీర్లు అనిల్, ఉపేందర్, వీరస్వామి, సంపత్, సేఫ్టీ కమిటీ సభ్యులు, పిట్ సెక్రటరీ, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment