Singa Reni
-
బొగ్గు గనుల కేటాయింపు..అవసరమైతే ప్రధానితో భేటీ అవుతాం : భట్టి
సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలకు కేంద్రం కొత్తగా తెచ్చిన చట్టంలోని 17 (A) ప్రకారం రిజర్వేషన్ ప్రక్రియ ద్వారా బొగ్గు బ్లాకులు కేటాయించే అవకాశం ఉంది. అయినప్పటికీ వేలం పాటలో పెట్టి ప్రైవేట్ వారికి అవకాశం కలిగించడం అంటే ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణిని కుదేలు చేయడమేనని వ్యాఖ్యానించారు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కబొగ్గు బ్లాకుల వేలం ప్రక్రియ పాల్గొన్న భట్టి కీలక వ్యాఖ్యలు చేశారు. సుదీర్ఘ చరిత్ర ఉన్న సింగరేణి సంస్థ ఇప్పుడు 39 బొగ్గు గనులతో నడుస్తున్నప్పటికీ కొత్త గనుల కేటాయింపు లేకపోతే ప్రస్తుతం ఉన్న గనులు క్రమంగా తగ్గిపోతాయి.రానున్న ఐదు సంవత్సరాలలో 8 భూగర్భ గనులు, మూడు ఓపెన్ కాస్ట్ గనులు మూతపడనున్నాయి.ఇలా 2032 నాటికి ఐదు భూ గర్భగనులు ఆరు ఓపెన్ కాస్ట్ గనులు,2037-38 నాటికి మరో 5 గనులు మూతపడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా 39 గనులు 40 వేల మంది కార్మికులు ఉన్న సింగరేణి మరో 15 ఏళ్లలో 8 గనులు ఎనిమిది వందల మంది కార్మికుల స్థాయికి పడిపోయి సింగరేణి మూతపడే ప్రమాదం ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులుగా ఈ పరిణామాన్ని ఊహించలేము అని అన్నారు.సింగరేణి సంస్థకు గోదావరి పరివాహక ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న 1400 మిలియన్ టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగానే రిజర్వేషన్ కోటాలో బ్లాకులు కేటాయించాలని కోరుతున్నట్లు డిప్యూటీ సీఎం విజ్ఞప్తి చేశారు. ఇదే విషయంపై ప్రధాని మోదీని కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ బిడ్డగా కిషన్ రెడ్డి సింగరేణికి న్యాయం చేస్తారని భావిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం త్వరలో ప్రారంభించనున్న 4000 మెగావాట్ల యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు,మరో నాలుగు వేల మెగావాట్ల ప్లాంట్ ఎన్టీపీసీ కేంద్రానికి, సింగరేణి సంస్థ నిర్మిస్తున్న మరో ఎనిమిది వందల మెగావాట్ల ప్లాంట్ కు కూడా బొగ్గు ఎంతో అవసరం ఉంది. ఇది సుమారు 24 మిలియన్ టన్నులు. ఈ డిమాండ్‌కు తగ్గట్టు బొగ్గు ఉత్పత్తి జరగాలంటే సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నేను స్వయంగా గత బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి ఈ విషయాలు వివరించా. కొత్త బ్లాకులు కేటాయించాలని తాటిచెర్ల బ్లాక్-2కు అవునుమతి ఇవ్వాలని కోరాను.ఇప్పుడు కిషన్ రెడ్డిని కోరుతున్నాం. సింగరేణి సంస్థ బతకాలన్న, అందులో పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్ బాగుండాలంటే కొత్త గనులు కేటాయించడం అవసరం ఉందన్నారు.గతంలో నిర్వహించిన వేలంపాట ద్వారా సత్తుపల్లి బ్లాక్-3 కోయగూడెం బ్లాకు-3లను పొందిన ప్రైవేటు కంపెనీలు ఇప్పటివరకు అక్కడ బొగ్గు తవ్వకాలు ప్రారంభించలేదు. కనుక చట్ట ప్రకారం ఆ కేటాయింపులు రద్దుచేసి ఆ బ్లాకులు సింగరేణికి కేటాయించాలని కోరుతున్నామన్న భట్టి విక్రమార్క.. ఆ రెండు బ్లాకులు కేటాయిస్తే సింగరేణి వెంటనే అక్కడ తవ్వకాలు ప్రారంభిస్తుందని తెలిపారు. -
భూగర్భ గనులను కాపాడాలి
మంచిర్యాల: భూగర్భ గనులను కాపాడాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ డివిజన్లోని ఆర్కే న్యూటెక్ గనికి పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాంపూర్‌లోని సీఈఆర్ క్లబ్లో పునః ధ్రువీకరణ కింద ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్, నిజామాబాద్ కాలుష్య నియంత్రణ మండలి ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ జి.లక్ష్మణ్ హాజరయ్యారు. సభకు హాజరైన వారి అభిప్రాయాలను నమోదు చేసుకున్నారు. చాలామంది వక్తలో సభలో తమ అభిప్రాయాలను వెల్లడించారు. సింగరేణిలో భూగర్భ గనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, జీవితకాలం దగ్గరపడ్డ గనుల్లోని నిక్షేపాలను అన్వేషించి వెలికితీత ద్వారా జీవిత కాలం పెరిగేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. భూగర్భ గనులతోనే ఎక్కువగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని, సింగరేణి గనుల వల్ల జరిగే కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత కంపెనీపై ఉందని, ఇందుకోసం మరిన్ని చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. సింగరేణి సీఎస్ఆర్ నిధులు, శ్రీరాంపూర్ డీఎంఎఫ్టీ నిధులను సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లోనే ఖర్చు చేయాలని, కానీ సింగరేణికి సంబంధం లేని ప్రాంతాలకు తరలించారని తెలిపారు. శ్రీరాంపూర్ ప్రాంతంలో ఆర్కే 6 గని పరిసరాల్లో సింగరేణి ప్రత్యేక శ్మశానవాటిక ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ నుంచి కే.సురేందర్‌రెడ్డి, ఏఐటీయూసీ నుంచి ఎస్కే బాజీసైదా, ముస్కె సమ్మయ్య, ఐఎన్టీయూసీ నుంచి జే శంకర్రావు, బీఎంఎస్ నాయకులు పేరం రమేశ్, హెచ్ఎమ్మెస్ నేత తిప్పారపు సారయ్య, సీఐటీయూ నాయకులు భాగ్యరాజ్ తమ అభిప్రాయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సింగరేణి ఎన్విరాన్మెంట్ జీఎం జేవీఎల్ గణపతి, ఏరియా ఎస్ఓటు జీఎం రఘుకుమార్, ఓసీపీ పీఓలు పురుషోత్తంరెడ్డి, శ్రీనివాస్, ఏజెంట్లు రాముడు, డీజీఎం(పర్సనల్) అరవిందరావు, ఏరియా ఎన్విరాన్మెంట్ హనుమాన్‌గౌడ్ పాల్గొన్నారు. అభ్యంతరాలు పరిష్కరిస్తాం.. సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలను పరిశీలించి కంపెనీ పరిధిలో ఉన్న వాటిని తప్పనిసరిగా ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తాం. ఏరియా పరిధిలోని అంశాలను వెంటనే పరిష్కరిస్తాం. సింగరేణి అభివృద్ధి చెందితే మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు పరిసర గ్రామాల్లో చేసుకొనే వీలుంది. –బీ.సంజీవరెడ్డి, జీఎం, శ్రీరాంపూర్ ప్రభుత్వానికి నివేదిస్తాం ఈ సభలో వక్తలు పేర్కొన్న అభ్యంతరాలు, సమస్యలను కాలుష్య నియంత్రణ మండలి అధికారులతో రికార్డు చేయించడం జరిగింది. వీటిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సింగరేణితోనే ఈ ప్రాంతంలో అనేక ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి సంస్థను కాపాడుకోవాలి. – సబావత్ మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్ -
లక్ష్యం సాధిస్తే రూ.40 వేల కోట్ల టర్నోవర్
గోదావరిఖని: దేశవ్యాప్తంగా బొగ్గుకు తీవ్రమైన డిమాండ్ ఏర్పడుతోందని, మిగిలిన ఆర్నెల్లలో రోజూ కనీసం 2.10 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్.శ్రీధర్ ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అన్నిఏరియాలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. వచ్చేఏడాది మార్చి చివరికల్లా 72 మిలియన్ టన్నుల లక్ష్యాన్ని అధిగమించాలని ఆదేశించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి ఆర్నెల్లలో వర్షాలతో కొంతఇబ్బంది కలిగినా అన్నిఅవరోధాలు అధిగమిస్తూ గతేడాది బొగ్గు రవాణాలో 12 శాతం వృద్ధి, ఉత్పత్తిలో 7శాతం, ఓవర్‌బర్డెన్ తొలగింపులో 15 శాతం వృద్ధి సాధించడంపై హర్షం వ్యక్తంచేశారు. ఈఆర్థిక సంవత్సరంలో మిగిలిన ఆర్నెల్లు కీలకమని పేర్కొన్నారు. ఈ క్రమంలో అన్నిఏరియాలకు అవసరమైన యంత్రాలు, అనుమతులు, ఓబీ కాంట్రాక్టులు ఇప్పటికే సమకూర్చామన్నారు. ఇకపై వర్షప్రభావం ఉండే అవకాశం లేదన్నారు. ఓపెన్‌కాస్ట్‌ల్లో నిలిచిన నీటిని బయటకు తోడేయాలని, బొగ్గు ఉత్పత్తి, ఓవర్ బర్డెన్ తొలగింపును మరింత వేగవంతం చేయాలని సూచించారు. లక్ష్యాలు సాధిస్తే రూ.3,500కోట్ల లాభాలు ఈఏడాది నిర్దేశిత 72మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తే.. లక్ష్యానికి అనుగుణంగా రవాణా చేసే అవకాశం ఉందని సీఎండీ తెలిపారు. తద్వారా రూ.40 వేల కోట్ల టర్నోవర్, సుమారు రూ.3,500 కోట్ల లాభాలు సాధించే అవకాశం ఉందని తెలిపారు. అంకిత భావంతో పనిచేయాలి సింగరేణి ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేదఫా రూ.1,750 కోట్ల వేజ్‌బోర్డు ఎరియర్స్ చెల్లించామని, సీఎం ప్రకటించినట్లు 32శాతం లాభాల బోనస్ రూ.711 కోట్లు కూడా దసరా పండుగకు ముందే విడుదల చేయనున్నామని పేర్కొన్నారు. దీపావళి బోనస్‌ను పండుగకు ముందే కార్మికుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు. కంపెనీపై విశ్వాసం, విధుల్లో అంకితభావంతో కార్మిక, అధికారులు, సమష్టిగా కృషి చేయాలని కోరారు. లక్ష్యాల అధిగమించిన సింగరేణి ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సింగరేణి నిర్దేశిత లక్ష్యాలు సాధించిందని శ్రీధర్ అన్నారు. ఈ ఏడాది బొగ్గు రవాణా లక్ష్యం 307 లక్షల టన్నులు కాగా 330 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి, 7 శాతం వృద్ధిని నమోదు చేసిందని వివరించారు. గతేడాది ఇదే సమయం కన్నా 12శాతం అధికమని పేర్కొన్నారు. సమావేశంలో డైరెక్టర్లు ఎన్.బలరాం, సత్యనారాయణరావు, వెంకటేశ్వర్‌రెడ్డి, అధికారులు సరేంద్రపాండే, అల్విన్, ఎం.సురేశ్, రమేశ్ పాల్గొన్నారు. -
సింగరేణికి దొంగల బెడద..
కరీంనగర్: సింగరేణి రామగుండం రీజియన్ ఆర్జీ–1, 2, 3 ఏరియాల్లోని ఓసీపీల్లో ఉన్న కాపర్ కేబుళ్లే లక్ష్యంగా దొంగల ముఠాలు రెచ్చిపోతున్నాయి. గతంలో స్క్రాప్ యార్డులపై కన్నేసిన దొంగలు అందినకాడికి ఎత్తుకెళ్లి, అక్రమ మార్గాన విక్రయించి, సొమ్ము చేసుకునేవారు. చోరీలను నివారించేందుకు యాజమాన్యం స్క్రాప్ యార్డులు, గనుల వద్ద సెక్క్యూరిటీ పెంచడంతోపాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసింది. స్క్రాప్ నిల్వలు పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు విక్రయాలు చేపట్టేలా చర్యలు తీసుకుంటోంది. దీంతో ఈ చోరీలు తగ్గిపోయాయి. అంతేకాకుండా స్క్రాప్ చోరీలవల్ల ప్రయాస ఎక్కువగా ఉండటం, లాభాలు కూడా తక్కువగా ఉండటంతో దొంగలు తమ రూట్ మార్చారు. తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు వచ్చే కాపర్ కేబుళ్లపై కన్నేశారు. భారీ యంత్రాల పవర్ కేబుళ్లు చోరీ వర్షాకాలం కావడంతో ఓసీపీ క్వారీలోని పనిస్థలాల వద్దకు సెక్యూరిటీ సిబ్బంది, సింగరేణి అధికారులు వెళ్లే అవకాశాలు తక్కువ. ఇదు అదనుగా దొంగలు రెచ్చి పోతున్నారు. విద్యుత్‌తో నడిచే భారీ యంత్రాలకు ఉన్న పెద్ద కాపర్ కేబుళ్లను కట్ చేసుకొని, ఎత్తుకెళ్తున్నారు. కొన్ని సందర్భాల్లో హెచ్‌టీ లైన్ విద్యుత్ సరఫరా ఉండగానే పెద్ద గొడ్డళ్లతో కేబుళ్లను నరికి, క్షణాల్లో వాహనంలో వేసుకొని, పరారవుతున్నారు. దీనివల్ల సంస్థకు ఆర్థికంగా నష్టంతోపాటు యంత్రానికి విద్యుత్ లేక పని నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది. దొరికినా చర్యలు లేవు దొంగతనాలు జరిగిన కొన్ని సందర్భాల్లో దొంగలు రెడ్‌హ్యాండెడ్‌గా సెక్యూరిటీ సిబ్బందికి దొరికినా సరైన చర్యలు లేకపోవడంతో ముఠాలు రెచ్చిపోతున్నాయనే ప్రచారం జరుగుతోంది. సింగరేణి సంస్థకు, పోలీసు శాఖకు మధ్య సరైన సమన్వయం లేక దొంగలు తిరిగి అదే పనికి అలవాటు పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. స్క్రాప్, కాపర్ కేబుళ్ల ముఠాల వివరాలు, విషయాలు తెలిసినప్పటికీ కఠిన చర్యలు తీసుకోవడంలో వెనుకంజ వేయడంతో సింగరేణిలో చోరీలకు అడ్డుకట్ట పడటం లేదన్న ఆరోపణలున్నాయి. ఇంటి దొంగల అండతోనే! ఇంటి దొంగల అండతో కాపర్ కేబుళ్ల చోరీ ముఠాలు రెచ్చిపోతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో కొంత ముట్టజెప్పి, చోరీ సమయంలో సహకరించాలని కోరడంతో కొందరు చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే స్టోర్స్‌లోని 600 మీటర్ల కాపర్ కేబుల్ దొంగతనం జరిగిందని పలువురు అంటున్నారు. దీనిపై కొందరికి సస్పెండ్ కమ్ పెండింగ్ ఎంకై ్వరీ పెట్టి, విచారణ జరుపుతున్నట్లు సమాచారం. -
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు
భూపాలపల్లి/భూపాలపల్లి రూరల్: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు ప్రస్తుతం జీతాలు ఇవ్వలేని పరిస్థితి నెలకొందని.. సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ చేపట్టిన మహా జన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా గురువారం భూపాలపల్లి నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్రంలో తాము అధికారంలోకి వచ్చాక పాత బకాయిలు మొత్తం చెల్లించి సంస్థను పరిరక్షిస్తామని చెప్పారు. సింగరేణి సంస్థలో గతంలో 72వేల మంది కార్మికులు ఉండగా.. ఇప్పుడు 42వేలకు తగ్గారని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ తన కూతురు కవితను యూనియన్ నాయకురాలిని చేసి సంస్థను ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. సింగరేణికి వేల కోట్ల ఆదాయం వస్తుందని చెబుతున్న సీఎం.. కార్మికులకు ఐటీ రీయింబర్స్మెంట్ ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. ఓపెన్‌కాస్ట్‌లను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన కేసీఆర్.. ఇయాల 17 ఓపెన్‌కాస్ట్‌లకు అనుమతి తీసుకున్నాడన్నారు. సింగరేణి నుంచి రూ.25వేల కోట్ల అప్పు ప్రభుత్వం తీసుకుందని తెలిపారు. సంస్థను దివాలా తీయించేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్మికుల జీతాల కోసం బ్యాంకుల్లో బాండ్లు కుదువపెట్టుకునే దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగ భృతి, రుణమాఫీ, ఉచిత యూరియా, విత్తనాలు, ఇంటికో ఉద్యోగం, పోడు భూములకు పట్టాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నందుకు.. ప్రజలను దారి మళ్లించేందుకు పీఎం మోదీ తనకు దోస్త్ అని సీఎం ప్రచారం చేసుకుంటున్నాడని అన్నారు. చేయి గు ర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలందరూ ఏ పార్టీలోకి పో యారో ప్రజలకు తెల్వదా అన్నారు. ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రజల కోసం పోరాడుతున్న ఏకై క పార్టీ బీజేపీయేనన్నారు. గడిచిన తొమ్మిదేళ్లలో ఏనాడైనా తెలంగాణ అమరవీరులకు సీఎం కేసీఆర్ నివాళులర్పించారా.. అని ప్రశ్నించారు. ఎన్నికల వేళ కొత్త డ్రామాలకు తెర లేపుతున్నాడన్నారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను కోరారు. తాము అధికారంలోకి వచ్చాక ఉచిత వైద్యం, విద్య, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ బహిరంగ సభలో రిటైర్డ్ డీజీపీ క్రిష్ణప్రసాద్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు చందుపట్ల కీర్తి రెడ్డి, రాకేష్‌రెడ్డి, రాష్ట్ర, జిల్లా నాయకులు కన్నం యుగేందర్, ఉదయ్‌ప్రతాప్, సునీల్‌రెడ్డి, పాపయ్య , రాజుగౌడ్, ఎరుకల గణపతి, మునీందర్, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
Singareni Day 2022: అక్షరదీపాలు.. నల్లసూరీళ్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ పారిశ్రామిక అవసరాలు తీరుస్తోన్న సింగరేణి సంస్థ కాలానుగుణంగా మారుతూ వస్తోంది. మానవ వనరులను క్రమంగా తగ్గించుకుంటూ యాంత్రీకరణ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో కంపెనీలో విద్యార్హతలు కలిగిన కార్మికుల సంఖ్య పెరుగుతూ, నిరక్షరాస్యుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. ఆధునిక హంగులతో సంస్థ పురోగమిస్తోంది. శుక్రవారం సింగరేణి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం. ఫిట్నెస్ ఉంటే చాలు ఒకప్పుడు బొగ్గు వెలికి తీసేందుకు కార్మికులు భూగర్భంలోకి వెళ్లేవారు. విపరీతమైన వేడి, చాలినంతగా ఉండని గాలి, అడుగు తీసి అడుగు వేస్తే గుచ్చుకునే బొగ్గు పెళ్లలు, విష వాయువుల మధ్య కార్మికులు బొగ్గు ఉత్పత్తి చేసేవారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో గనుల్లో పని చేయాల్సి ఉండటంతో విద్యార్హతలకు కాకుండా 35 ఏళ్లలోపు వయసు ఉండి, శారీరక దారుఢ్యమే ప్రధాన అర్హతగా గనుల్లో పనులు లభించేవి. తట్టా, చెమ్మాస్ పట్టుకుని బొగ్గు వెలికితీతలో మునిగిపోయేవారు. ఆ తర్వాత కార్మిక సంఘాల ఏర్పాటుతో శ్రమకు తగ్గ వేతనం, వసతి, బోనస్, అలవెన్సుల వంటివి కార్మికులకు లభించాయి. దేశంలో ఆర్థిక సంస్కరణలు ప్రారంభమైన 90వ దశకంలో లక్షా ఇరవై వేల మంది కార్మికులు సింగరేణిలో ఉండేవారు. ఇందులో నూటికి తొంభై శాతం మంది కార్మికులకు కనీస విద్యార్హతలు ఉండేవి కావు. రాయడం, చదవడం కూడా తెలిసేది కాదు. అయినప్పటికీ ఇక్కడ పని చేసే కార్మికులు పెద్ద హోదాగల ఉద్యోగుల తరహాలో వేతనాలు పొందుతుండటాన్ని అంతా ఆశ్చర్యంగా చూసేవారు. కాలానుగుణంగా విద్యార్హతలకు పెద్దపీట మారుతున్న పరిస్థితులకు తగ్గట్టుగా బొగ్గు గనుల్లో బాస్కెట్ లోడింగ్ (తట్టల్లో బొగ్గును టబ్బుల్లోకి ఎత్తిపోయడం) విధానాన్ని ఎత్తి వేయాలని 2003లో సింగరేణి సంస్థ నిర్ణయించింది. అప్పటి నుంచి మానవ వనరుల వినియోగం తగ్గిపోయి ఆ స్థానంలో యంత్రాల ఉపయోగం పెరిగిపోయింది. గనుల్లో పని చేయాలంటే యంత్రాలను ఆపరేట్ చేయడం, ఉత్పత్తికి అనుగుణంగా మెషినరీని సిద్ధం చేయడం తప్పనిసరిగా మారాయి. ఫలితంగా సాంకేతికంగా ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లొమా, బీటెక్.., పరిపాలన విభాగాల్లో ఎంబీఏ, రెగ్యులర్ డిగ్రీలు తప్పనిసరి అర్హతలుగా మారాయి. ఫలితంగా గడిచిన రెండు దశాబ్దాల కాలంలో సింగరేణి కార్మికుల్లో విద్యావంతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. నూటికి తొంభైశాతం.. ప్రస్తుతం సింగరేణిలో సుమారు 43 వేలమంది కార్మికులు/ఉద్యోగులు పని చేస్తుండగా ఇందులో నూటికి తొంభైశాతం మంది విద్యావంతులే కావడం విశేషం. వీరిలో యాభైశాతం మంది డిప్లొమా, ఇంజనీరింగ్, ఎంబీఏ వంటి కోర్సులు చేసిన వారే ఉన్నారు. ఇదిలా ఉండగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఒకప్పుడు బొగ్గు బావుల్లో పనులంటే యువత ఎంతో ఆసక్తి చూపించేంది. కానీ ఇప్పటి కార్మికులు భూగర్భ గనుల్లోకి వెళ్లేందుకు నిరాసక్తత చూపిస్తున్నారు. ఓపెన్‌కాస్ట్, ఇతర ఉపరితల పనుల్లోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతున్నారు. భూగర్భ గనుల్లోకి వెళ్లాల్సి వస్తుందనే కారణంతో కొందరు ప్రమోషన్లు సైతం నిరాకరిస్తున్నారు. సింగరేణి డే స్వాతంత్రానికి పూర్వమే నిజాం జమానాలో బ్రిటీషర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందులో బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. హైదరాబాద్ (దక్కన్) కంపెనీ లిమిటెడ్ పేరుతో 1889లో బొగ్గు తవ్వకాలు మొదలయ్యాయి. ఆ తర్వాత 1920 డిసెంబర్ 23న కంపెనీ పేరును సింగరేణి కాలరీస్ లిమిటెడ్‌గా మార్చారు. అప్పటి నుంచి ఇదే పేరు మీద బొగ్గు ఉత్పత్తి జరుగుతోంది. కాగా 2002లో అప్పటి సింగరేణి సీఎండీ ఖాజా డిసెంబర్ 23న సింగరేణి డేగా వేడుకలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఏటా డిసెంబర్ 23న సింగరేణి డేను నిర్వహిస్తున్నారు. ఒక్కో ఏడాది ఒక్కో ఏరియాలో ఈ వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ ఏడాది సింగరేణి ప్రధాన కార్యాలయం ఉన్న కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో వేడుకలు జరగనున్నాయి. ––––––––––––––––––––––––––––––––––––––––––– సింగరేణి కార్మికుల్లో అక్షరాస్యత ఇలా (2022 డిసెంబర్ 19 నాటికి) –––––––––––––––––––––––––––––––––– నిరక్షరాస్యులు 2,080 పదో తరగతిలోపు 3,950 ఎస్ఎస్సీ 8,587 ఇంటర్మీడియట్ 2,424 ఐటీఐ/డిప్లొమా 5,020 గ్రాడ్యుయేషన్ 5,208 మాస్టర్స్ డిగ్రీ 2,986 విద్యార్హత సరిగా నమోదు చేయని వారు 12,707 ................................................ మొత్తం 42,962 ............................................................ -
సింగరేణిలో కార్మికుల సమ్మె..
-
తండ్రి హత్య కేసులో కుమారుడు, కుమార్తె అరెస్ట్
సాక్షి, భూపాలపల్లి(వరంగల్): ఇటీవల సింగరేణి కార్మికుడిని హత్య చేసిన కేసులో అతని కుమారుడు, కుమార్తెను అరెస్ట్ చేయగా, మరొకరు పరారీలో ఉన్నట్లు భూపాలపల్లి సీఐ ఎస్ వాసుదేవరావు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లి పట్టణంలోని టీ2 క్వార్టర్స్‌లోని టీ2– 658 క్వార్టర్లో నివాసం ఉండే గొడ్డె నాగభూషణం(44) తన ఇంట్లో ఈ నెల 22న రాత్రి హత్యకు గురయ్యాడు. మృతుడి రెండో భార్య శారద ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ ఎస్ వాసుదేవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య జరిగిన రోజు నుంచి నాగభూషణం కుమారుడు జగదీష్, కుమార్తె ఉమామహేశ్వరిలు పరారీలో ఉన్నారు. శుక్రవారం ఉదయం వారి దుస్తులు, డబ్బులు తీసుకెళ్తేందుకని భూపాలపల్లికి వచ్చారు. విషయం తెలుసుకున్న సీఐ తన సిబ్బందితో కలిసి వెళ్లి వారిని పట్టుకుని విచారించారు. పోలీసుల విచారణలో తామే హత్య చేసినట్లుగా నిందితులు అంగీకరించారు. తమ తండ్రి ఆగడాలు తట్టుకోలేకనే హత్యకు పాల్పడినట్లు వారు పేర్కొన్నారు. నాగభూషణం కుటుంబాన్ని పట్టించుకోకపోవడమే కాక భార్యను వేధించేవాడు. అతడి వేధింపులు కారణంగానే అనారోగ్యానికి గురైన భార్య సుజాత మృతి చెందింది. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరి 14న మరొకరిని వివాహం చేసుకున్నాడు. పెళ్లి అనంతరం పిల్లలిద్దరూ తమకు ఆస్తులు, డబ్బులు పంచి ఇవ్వాలని కోరారు. దీంతో గొడవలు ప్రారంభమయ్యాయి. చేసేది లేక తండ్రిని హత్య చేయాలని వారు భావించారు. ఈ మేరకు జగదీష్, ఉమామహేశ్వరి, ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న మంథని ముత్తారం మండలం దర్యాపూర్‌కు చెందిన యువకుడు గాదం రామకృష్ణలు కలిసి పట్టణంలోని చైనా బజార్లో రెండు కత్తులు కొనుగోలు చేశారు. పినతల్లి శారద లేని సమయం చూసి ఈ నెల 22 రాత్రి జగదీష్, ఉమామహేశ్వరి, రామకృష్ణలు కలిసి నాగభూషణంను హత్య చేశారు.నిందితులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ వాసుదేవరావు తెలిపారు. చదవండి: పెళ్లి అయిన మూడు రోజులకే.. ‘నవ వరుడి’ ఆత్మహత్యాయత్నం.. -
ప్రభుత్వం అనుమతిస్తే కరోనా బాధితున్ని రెండు గంటల్లో బాగు చేస్తా..
సాక్షి, మందమర్రి రూరల్: ‘ప్రభుత్వం అనుమతిస్తే కరోనా బాధితున్ని రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు మూడొందల మందిని నయం చేశా’అంటున్నాడు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బచ్చలి భీమయ్య. మందమర్రిలో మరో ఆనందయ్య.. కరోనా బాధితులకు ఆయుర్వేదం మందు అందిస్తూ బాగు చేస్తున్నాడంటూ బుధవారం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది. పట్టణంలోని మారుతినగర్లో నివాసం ఉంటున్న భీమయ్య.. తన తాత దగ్గర వనమూలికల వైద్యం గురించి తెలుసుకున్నానని చెప్పాడు. దగ్గు, దమ్ము ఊపిరితిత్తుల సమస్యలకు 13 రకాల వన మూలికలతో తయారుచేసిన మందు కరోనా బాధితులకు బాగా పనిచేస్తుందని, రెండు గంటల్లో నయం అవుతుందని పేర్కొన్నాడు. ఉచితంగానే ఈ మందు అందిస్తున్నానని తెలిపాడు. కాగా, భీమయ్య అందించే మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని మందమర్రి సీఐ ప్రమోద్‌రావు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోవద్దని సీఐ కోరారు. -
సింగరేణి భూగర్భ గనులు మూసివేత
సాక్షి, హైదరాబాద్/ పెద్దపల్లి: కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో భూగర్భ గనులకు లే ఆఫ్ ప్రకటిస్తూ సింగరేణి యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రెండో షిఫ్టు నుంచి మూసేయాలని బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సంస్థ వ్యాప్తంగా 27 భూగర్భ గనులు, 18 ఓసీపీలు కొనసాగుతు న్నాయి. ఇందులో పూర్తిస్థాయి యాంత్రీకరణతో సాగుతున్న ఐదు భూగర్భ గనులు, 18 ఓసీపీల్లో యథావిధిగా ఉత్పత్తి చేయనున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి నిరోధించడానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కఠిన చర్యలకు పూనుకున్నాయి. మార్చి 22న కేంద్ర ప్రభుత్వం జనతా కర్ఫ్యూ విధించింది. అనంతరం ఏప్రిల్ 14వ తేదీ వరకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతోంది. భౌతిక దూరం పాటించడంతోనే వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం కావడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు లాక్ డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నాయి. ఇదే సమయంలో సింగరేణి భూగర్భ బొగ్గు గనుల్లో కార్మికులు యథావిధిగా విధులు నిర్వహించడం పట్ల పలు కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒకేచోట పెద్ద మొత్తంలో పని స్థలాల్లో గుమిగూడాల్సి వస్తుండటంతో కార్మికుల్లో ఆందోళన నెలకొంది. ఇటీవల ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇద్దరు సింగరేణి కార్మికులు ఉన్నట్లు ప్రచారం జరగడం.. వారు విధులకు హాజరైనట్లు తెలియడంతో మరింత గంద రగోళం నెలకొంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి యాంత్రీకరణ గనులు, ఓసీపీలను మినహాయించి భూగర్భ గనుల్లో పనులు నిలిపివేయాలని కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ మైన్స్ సేఫ్టీ ఆదేశాల మేరకు సింగరేణి యాజమాన్యం లే ఆఫ్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. 22 భూగర్భ గనుల్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి.. సింగరేణి యాజమాన్యం నిర్ణయంతో సంస్థ వ్యాప్తంగా ఉన్న 22 భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఈ గనుల్లో 26,692 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అత్యవసర సిబ్బంది మినహా మిగతా కార్మికులందరికీ 1947 లేబర్ యాక్ట్ ప్రకారం సగం వేతనం చెల్లించనున్నారు. కాగా, సింగరేణి లే ఆఫ్ ప్రకటించినప్పటికీ పూర్తి స్థాయి యాంత్రీకరణ ఉన్న ఐదు గనులతో పాటు 18 ఓసీపీల్లో బొగ్గు ఉత్పత్తి యథావిధిగా కొనసాగనుంది. యాంత్రీకరణ ఉన్న ఐదు భూగర్భ గనులు అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు, వీకే–7, శాంతిఖని, జీడీకే–11, కొండాపూర్ ద్వారా బొగ్గు ఉత్పత్తి చేయనున్నారు. కాగా, సింగరేణి వ్యాప్తంగా ప్రతి రోజు 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి జరుగుతుండగా, 22 గనుల్లో లే ఆఫ్ మూలంగా ప్రతిరోజు 15 నుంచి 18 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోనుంది. అందుబాటులో మాస్కులు.. శానిటైజర్లు: పర్సనల్ మేనేజర్ పనిచేసే గనులు, కార్యాలయాల వద్ద శాని టై జర్లు, మాస్కులను అందుబాటులో ఉంచిన ట్టు సంస్థ పర్సనల్ మేనేజర్ ఎ.ఆనందరావు ఓ ప్రకటనలో తెలిపారు. గనులు, కార్యాల యాల ఆవరణలో శానిటైజర్లను స్ప్రే చేస్తున్నా మని, అత్యవసర ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కోరారు. సింగరేణి కాలనీల్లో రసాయనాల పిచికారి చేస్తున్నామన్నారు. లే ఆఫ్‌లో ఉన్న ఉద్యోగులు ఆరోగ్య నియమాలను పాటిస్తూ, ఇంటివద్దనే ఉండాలని ఆయన కోరారు. మంచి నిర్ణయం కరోనా వైరస్ మూలంగా గనులకు లే ఆఫ్ ప్రకటించడం మంచి నిర్ణయం. వందల మంది ఒకే గనిలో పని చేయాల్సి వచ్చింది. లే ఆఫ్ మూలంగా కార్మికులంతా ఇళ్లలో ఉండే అవకాశం ఉంటుంది. వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఇదే మంచి సమయం. – పసుపులేటి హరిప్రసాద్, జనరల్ మజ్దూర్ పూర్తి వేతనం ఇవ్వాలి లే ఆఫ్ నిర్ణయం మూలంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుంది. అండర్ గ్రౌండ్ మైన్‌లో ఒకే చోట ఎక్కువ మంది పనిచేయాల్సిన పరిస్థితి ఉంటుంది. లే ఆఫ్ కాకుండా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పూర్తి వేతనం ఇవ్వాలి. – శ్రీనివాస్‌రెడ్డి, సపోర్ట్‌మెన్ -
వివిధ వర్గాల పై గురి..
సాక్షి, భూపాలపల్లి: ఉదయం ఎనిమిది గంటలు దాటితే సూర్యుడు సుర్రుమంటున్నాడు. పది దాటితే రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు మాత్రం ఎండలను లెక్కచేయకుండా కులసంఘాలు, కీలక వర్గాలు, యూనియన్ల వారీగా ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమవుతున్నారు. ఒంటి నుంచి చెమటలు కక్కుతున్నా వెనుకడుగు వేయడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు బిజీబిజీగా గడుపుతున్నారు. ప్రచారానికి నాలుగు రోజులే మిగిలి ఉండడంతో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గాల వారీగా కీలకంగా ఉన్న వర్గాల ఓట్లను ఆకర్షించేందుకు ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు. అన్ని పార్టీల లోక్‌సభ అభ్యర్థులు కీలకమైన వర్గాలతో ములాఖత్ అవుతూ ఓట్లు అడుగుతున్నారు. స్వయంగా పోటీలో ఉన్న అభ్యర్థులే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా సుడిగాలి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. భూపాలపల్లిలో సింగరేణి కార్మికులు, రైతుల ఓట్లు కీలకం కాగా ములుగు అసెంబ్లీ పరిధిలో గిరిజనేతరులు, సెటిలర్ల ఓట్ల కోసం పడరాని పాట్లు.. ఫీట్లు చేస్తున్నారు. కార్మికుల చుట్టే రాజకీయం.. భూపాలపల్లి జిల్లాలో కార్మికుల చుట్టూ ఓట్ల కోసం అభ్యర్థులు తిరుగుతున్నారు. వరంగల్ లోక్‌సభ పరిధిలో అధిక ఓట్లు ఉండడం, సింగరేణి, జెన్కో కార్మికులు కీలకం కావడంతో ఈ వర్గాలను ఆకర్షించే పనిలో నేతలు ఉన్నారు. కార్మికుల ఓట్లు 30 వేల వరకు ఉంటే పరోక్షంగా మరో 20 వేల ఓట్ల వరకు ప్రభావితం చేసే అవకాశం ఉండడంతో ప్రతీ పార్టీకి వీరు కీలకమవుతున్నారు. అన్ని పార్టీల నాయకులు కార్మికుల ఓట్ల కోసం గనుల్లో పర్యటిస్తున్నారు. కార్మికులు షిఫ్ట్‌లు మారే సమయంలో ఓట్లు అభ్యర్థిస్తున్నారు. టీఆర్ఎస్ తరఫున పసునూరి దయాకర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. కాంగ్రెస్ తరఫున అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి గనుల్లో ఇప్పటికే పర్యటించారు. వీటితో పాటు కేటీపీపీ కార్మికులు కూడా ఎన్నికల్లో కీలకం కానున్నారు. సింగరేణితో పోలిస్తే తక్కువ ఓట్లు ఉన్నప్పటికీ వీరిని కూడా తమవైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి పరిధిలోకి వచ్చే జిల్లాలోని ఐదు మండలాల్లో రైతుల ఓట్లు కీలకంగా మారాయి. ఈ ఐదు మండలాల్లో పెద్ద సంఖ్యలో రైతులు ఉన్నారు. వీరి ఓట్లను ప్రసన్నం చేసుకున్న వారికి మెజారిటీ వచ్చే అవకాశం ఉంది. గిరిజనేతరులు, సెటిలర్లే టార్గెట్ మహబూబాబాద్ ఎంపీ పరిధి కిందకు వచ్చే ములుగు అసెంబ్లీ సెగ్మెంట్లో గిరిజనేతరులు, సెటిలర్ల ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు బరిలో ఉన్న పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎస్టీ రిజర్వ్డ్ పార్లమెంటరీ స్థానంలో కావడంతో ఇప్పుడు అందరి దృష్టి నాన్ ఎస్టీ ఓటర్లపై పడింది. గెలుపోటములు, మెజారిటీ రావాలన్నా ఈ వర్గంపై ఎక్కువ దృష్టి పెట్టాలని ప్రతీ రాజకీయ పార్టీకి తెలుసు. ప్రస్తుతం పోటీలో ఉన్న అందరు అభ్యర్థులు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో ఎస్టీల ఓట్లు ఎలాగోలా అందరికీ పడతాయి. ఎస్టీ ఓట్లు పోటీల ఉన్న అందరూ అభ్యర్థులు చీల్చుకుంటే గిరిజనేతర, సెటిలర్ ఓట్లే కీలకం అవుతాయి. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఈ వర్గాలు కీలకంగా మారాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. భూపాలపల్లితో పోలిస్తే ములుగు నియోజకవర్గంలో కమిటీల పేరుతో అన్ని పార్టీలు పోల్ మేనేజ్ మెంట్ చేసేందుకు పథకాలు రచిస్తున్నాయి. ఇదే విధంగా ములుగు నియోజకవర్గంలో గోవిందరావుపేట, మంగపేట, ఏటూరునాగారం, వాజేడు, వెంకటాపురంలో సెటిలర్ల ఓట్లు ఉన్నాయి. ఈ ఓట్లు ఎటు పడుతాయనేది ప్రాధాన అంశంగా మారింది. ప్రచారంలో దూకుడు.. ఎక్కువ ఓట్లు ఉన్న వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు స్వయంగా పర్యటిస్తున్నారు. వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్, కాంగ్రెస్ అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య భూపాలపల్లిలో కార్మికులను ఓట్లు కోరారు. అదే విధంగా పెద్దపల్లి ఎంపీ పరిధిలోకి వచ్చే ఐదు మండలాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్ నేత ప్రచారం చేస్తున్నారు. ములుగులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్, టీఆర్ఎస్ తరఫున మాలోత్ కవిత తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. వీరికి మద్దతుగా ఎమ్మెల్యే సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య సెటిలర్లు, గిరిజనేతరుల మద్దతు కోసం శ్రమిస్తున్నారు. టీఆర్ఎస్కు అన్నీ తానై మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అండగా నిలుస్తున్నారు. -
కార్మికులే ‘కీ’లకం
సాక్షి, మంచిర్యాల: పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సింగరేణి కార్మికులు అధిక సంఖ్యలో ఉన్నారు. కార్మికులు, వారి కుటుంబాలు, కాంట్రా క్టు కార్మికులు, వారి కుటుంబాలు, సింగరేణిపై ఆధారపడిన ఇతరత్రా కుటుంబాల ఓట్లు ఈ ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపోటములకు కీలకం కానున్నాయి. పెద్దపల్లి లోక్‌సభ పరిధిలో జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, పెద్దపల్లి, ధర్మపురి, మంథని, రామగుండం అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇందులో బెల్లంపల్లి సింగరేణి రీజియన్ పరిధిలో మంచిర్యాల, చెన్నూ రు, బెల్లంపల్లి, రామగుండం రీజియన్‌లో రామగుండం, మంథని అసెంబ్లీలున్నాయి. జిల్లాకు సంబంధించి బెల్లంపల్లి సింగరేణి రీజియన్‌లో మూడు డివిజన్లు ఉన్నాయి. ఇందులో బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి డివిజన్, చెన్నూరు నియోజకవర్గంలో మందమర్రి డివిజన్, మంచిర్యాల నియోజకర్గం పరిధిలో శ్రీరాంపూర్ డివిజన్లు ఉన్నాయి. ఇవి పెద్దపల్లి లోక్‌సభ పరిధిలోకి రాగా.. బెల్లంపల్లి డివిజన్లోని డోర్లీ, కైరీగూడ ఓసీపీలు మాత్రం అదిలాబాద్ లోక్‌సభ పరిధిలోకి వస్తాయి. గనులు ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నా.. కార్మికులు మాత్రం బెల్లంపల్లి నియోజకవర్గంలోనే ఉన్నారు. బెల్లంపల్లి జీఎం కార్యాలయం, గోలేటీ ప్రాంతాల్లోని కొంతమంది సింగరేణి ఓటర్లు మాత్రం ఆదిలాబాద్ పరిధిలోకి వస్తారు. జిల్లాలో సింగరేణి కార్మికులకు సంబంధించిన ఓటర్లు లక్షల్లో ఉన్నారు. కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య దాదాపు 30వేలు ఉండగా.. వారి కుటుంబాలను కలుపుకుంటే లక్షా 20 వేల మంది ఓటర్లు కార్మికుల ఇళ్లలోనే ఉన్నారు. సింగరేణిపై ఆధారపడిన ఇతరత్రా కుటుంబాలూ ఉన్నాయి. ఈ లెక్కన ఎన్నికల్లో సింగరేణి కార్మికుల పాత్రే కీలకం కానుంది. కార్మికులపైనే నజర్ లోక్‌సభ సభ్యుడు ఎవరనేది నిర్ణయించడంలో సింగరేణి కార్మికుల పాత్ర కీలకం కావడంతో అన్ని పార్టీలూ ప్రస్తుతం కార్మికులను ఆకర్షించే పనిలో పడ్డాయి. తమను గెలిపిస్తే కార్మికుల డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాయి. గతంలో పరిష్కరించిన హామీలనూ గుర్తు చేస్తున్నాయి. ప్రస్తుతం కార్మికుల ఆదాయ పన్ను రద్దు డిమాండ్ ప్రధాన ఎన్నికల నినాదంగా మారింది. అన్ని పార్టీల అభ్యర్థులు ఇదే హామీ ఇస్తుండగా.. స్వ యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇటీవల గోదావరిఖనిలో సభలో ఆదాయపన్ను రద్దు అంశాన్ని ప్రస్తావించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించామంటూ కార్మికుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేశారు. 20 ఏళ్లుగా ఆదాయపన్ను రద్దు చేయాలనే డిమాండ్ కార్మికుల్లో ఉంది. ఇది రద్దు కావాలంటే పార్లమెంట్లో చట్టం తీసుకురావాల్సి ఉంటుంది. ఇందుకోసం ఎంపీలు పోరా టం చేయాలి. అందుకే లోక్‌సభ ఎన్నికల్లో ఇది ప్రధాన నినాదామైంది. అలాగే సింగరేణి ప్రాంతలో మైనింగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఉంది. గోలేటి నుంచి ఇల్లందు వరకు ప్రత్యేక రైల్వే లైన్ వేయడం వల్ల కోల్‌కారిడార్ ఏర్పడి బొగ్గు రవాణా, ప్రజారవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. ఈ అంశం కూడా ఎన్నికల్లో నినాదంగానే మారింది. 1998లో చేసిన పెన్షన్ చట్టం అమలవుతోంది. ప్రతి మూడేళ్లకోసారి పెన్షన్‌ను పెంచాలని చట్టంలో ఉంది. కాని ఇప్పటివరకూ ఒక్కశాతం కూడా పెరగలేదు. అప్పటినుంచి అదే 25శాతం పెన్షన్ అమలవుతోంది. దీన్ని 40 శాతానికి పెంచాలనే డిమాండ్ ఉంది. అంతేకాకుండా కారుణ్యనియామకాలు, రూ.10 లక్షల ఇంటి రుణంవంటి రాష్ట్ర పరిధిలోకి వచ్చే డిమాండ్లు కూడా ఎన్నికల అస్త్రాలుగా మారాయి. మరోవైపు ఓసీపీలను మూసివేయాలనే డిమాండ్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. సింగరేణి కార్మికుల సంక్షేమాన్ని తమ ప్రభుత్వమే పట్టించుకుటుందని, తమకే మద్దతు ఉంటుందని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కోల్‌బెల్ట్ ప్రాంతంలో తమకు సానుకూల ఫలితాలు వచ్చాయిని కాంగ్రెస్ పేర్కొంటుంది. ఏదేమైనా పెద్దపల్లి లోక్‌సభ ఎన్నికల్లో సింగరేణి కార్మికుల ఓట్లు కీలకం కానున్నాయి. బెల్లంపల్లి రీజియన్‌లో కార్మికుల వివరాలు.. డివిజన్ కార్మికుల సంఖ్య శ్రీరాంపూర్ 10,343 మందమర్రి 5,955 బెల్లంపల్లి 1,606 ఎస్టీపీపీ(జైపూర్) 150 కాంట్రాక్ట్ కార్మికులు 12,000 -
రక్షణ సూత్రాలు విధిగా పాటించాలి
సింగరేణి(కొత్తగూడెం): ప్రతి కార్మికుడు, ఉద్యోగి రక్షణ సూత్రాలు తప్పనిసరిగా పాటించాలని సేఫ్టీ జీఎం రాజీవ్‌కుమార్ కార్మికులను ఆదేశించారు. మంగళవారం ఏరియాలోని వర్క్ షాప్‌లో 51వ రక్షణ వారోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ గతంలో కంటే సింగరేణిలో ప్రమాదాల సంఖ్య బాగా తగ్గిందని, అందుకు కారణం ఉద్యోగులు రక్షణ సూత్రాలను పాటించటమేనని అన్నారు. ఈ సందర్భంగా సేఫ్టీ కమిటీకి డీవైజీఎం ప్రసాద్, ఏజీ ఎం కిషోర్‌గంగా స్వాగతం పలికారు. అనంతరం తనిఖీ కమిటీ వర్క్‌షాప్‌లోని వివిధ యంత్రాలు, పని స్థలాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో డీజీ ఎం రాఘవేంద్రరావు, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ కేజీ తివారీ, ఏరియా టీబీజీకేఎస్ ఉపాధ్యక్షుడు ఎండీరజాక్, ఏజీఎంలు మోహన్‌రావు, పి.శ్రీనివాస్, వర్క్‌మెన్ ఇన్స్పెక్టర్లు రవి, కె.బ్రహ్మాచారి, వర్క్‌షాప్ ఇంజనీర్లు అనిల్, ఉపేందర్, వీరస్వామి, సంపత్, సేఫ్టీ కమిటీ సభ్యులు, పిట్ సెక్రటరీ, సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. -
సమస్యలపై ఆందోళనలు ఉధృతం
సింగరేణి(కొత్తగూడెం): గత అసెంబ్లీ ఎన్నికల ముందు, ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకై యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ఏఐటీయూసీ అడ్వైజర్ దమ్మాలపాటి శేషయ్య ఆన్నారు. మంగళవారం ఏరియాలోని జీకేఓసీ గని వద్ద ఏర్పాటు చేసిన గేట్‌మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ హామీల అమలు కోసం ఈనెల 3న, 16వ తేదీల్లో సింగరేణి వ్యాప్తంగా ఉన్న జీఎం, డిపార్ట్మెంట్ కార్యాలయాల వద్ద ధర్నాలు చేసి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. అయినప్పటికీ యాజమాన్యంలో చలనం లేదని, అందుకే యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఓసీలలో బొగ్గు నాణ్యతకు ఇన్సెంటివ్ జతచేయటం సరైందికాదని, నాణ్యత తో ప్రమాణం లేకుండా కార్మికులకు ఇన్సెంటివ్‌లు చెల్లించాలని డిమాండ్ చేశారు. పెరిగిన గ్రాట్యుటీ చెల్లింపు విషయంలో 10వ వేజ్‌బోర్డు అమలు నాటి నుంచి చెల్లించాలని ఏఐటీయూసీ స్టాండరైజేషన్ సమావేశంలో మాట్లాడామన్నారు. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ విషయంలో ఇప్పటి వరకు రెండు సమావేశాలు జరిగాయని, మళ్లీ ఈనెల 27న వారణాసిలో సమావేశం జరుగనుందని, ఈ సమావేశంలో పూర్తి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ సమావేశంలో సముద్రాల సుధాకర్, ఏ వీరమణ, ఎంవీరావు, ఎస్.వెంకటేశ్వర్లు, వట్టికొండ ప్రసాద్, ఎస్.శ్రీనివాస్, గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
పరిహారమివ్వండి ఊరొదిలిపోతాం
మణుగూరుటౌన్(భద్రాద్రికొత్తగూడెం) : మణుగూరు ఓసీ నుంచి వచ్చే దుమ్ము, ధూళి తో ఇళ్లల్లో ఉండలేకపోతున్నాం.. అని రాజుపేట గ్రామస్తులు మంగళవారం గ్రామంలోని రహదారిపై ఆందోళనకు దిగారు. రోడ్డుపై వంటావార్పు నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ... లారీల మితిమీరిన వేగంతో ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయన్నారు. లారీలకు కనీసం పట్టాలు కట్టకుండా బొగ్గును రవాణా చేయడం ద్వారా బొగ్గు చూర ఇళ్లల్లోకి చేరుతోందన్నారు. బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు ధ్వంసం అవుతున్నాయని వాపోయారు. తమకు పరిహారం చెల్లిస్తే ఊరు ఖాళీ చేస్తామన్నారు. మణుగూరు ఓసీ రహదారికి బైపాస్ ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. తమ సమస్యలను పరిష్కరించాలని సింగరేణి యాజమాన్యానికి ఎన్ని సార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని, సమస్య పరిష్కారించే వరకు వెళ్లేది లేదని భీష్మించారు. సుమారు నాలుగు గంటల పాటు రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. విషయం తెలుసుకున్న మణుగూరు సీఐ మొగిలి, ఎస్సై జితేందర్ సింగరేణి ఎస్వోటు జీఎం ఎం.సురేష్, గని ఏజెంట్ లలిత్‌కుమార్, సెక్యూరిటీ అ«ధికారి నాగేశ్వర్రావు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. ఇళ్ల తొలగింపు విషయం హెడ్ ఆఫీస్ పరిధిలోనిదని, సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. 11 మందిపై కేసు నమోదు అనుమతులు లేకుండా రోడ్డుపై ఆందోళన చేపట్టారంటూ రాజుపేటకు చెందిన 11 మంది వ్యక్తులపై మణుగూరు పోలీసులు కేసు నమోదు చేశారు. మణుగూరు ప్రాజెక్టు అధికారి లలిత కుమార్ ఫిర్యాదు మేరకు రాజుపేటకు చెందిన సాంబశివరావు, తార, అక్బర్, పన్నాలాల్, చంద్రశేఖర్, యాణోత్ సతీష్ నాగరాజు, తులసీరాం, భూక్యా వినోద్, బాణోత్ సతీష్, లక్పతి, మంగమ్మలపై కేసు నమోదు చేసినట్లు మణుగూరు సీఐ మొగిలి తెలిపారు. -
బోనస్ రూ.57 వేలు
♦ కోల్కత్తా సమావేశంలో నిర్ణయం ♦ గని కార్మికులకు దీపావళి ముందు చెల్లింపు గోదావరిఖని(రామగుండం) : దేశవ్యాప్తంగా కోల్ఇండియా, సింగరేణి సంస్థలలో పనిచేస్తున్న 3.50 లక్షలమంది బొగ్గుగని కార్మికులకు పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డు (పీఎల్ఆర్) బోనస్ (లాభాల బోనస్)ను రూ.57 వేలు చెల్లించేందుకు నిర్ణయం జరిగింది. కోల్‌కత్తాలో మంగళవారం జేబీసీసీఐ అఫెక్స్ కమిటీసమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించింది. గత ఏడాది పీఆర్ఎల్ బోనస్ రూ.54 వేలుగా ఉండగా, ఈసారి రూ.57 వేలకు పెంచారు. కోల్‌ఇండియాలోని ఎనిమిది సబ్సిడరీ సంస్థలలో పనిచేసే కార్మికులకు దసరా పండుగకు ముందు అంటే ఈ నెల 26వ తేదీలోపు చెల్లిస్తుండగా...సింగరేణి కార్మికులకు మాత్రం దీపావళి పండుగకు ముందు యాజమాన్యం చెల్లించనున్నది. డిపెండెంట్ ఎంప్లాయిమెంట్‌పై కమిటీ ఏర్పాటు... జేబీసీసీఐ ఒప్పందం ప్రకారం డిపెండెంట్ ఉద్యోగాలపై యాజమాన్య ప్రతినిధులు, జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులతో కమిటీని నియమించారు. గనిలో ప్రమాదంలో మరణించిన, సహజ మరణం పొందినా గతంలో కార్మికుడి వారసుడికి ఉద్యోగ అవకాశం కల్పించేవారు. ఈవిషయమై సుధీర్ఘంగా చర్చించేందుకు యాజమాన్యం తరపున ఎస్ఈసీఎల్ సీఎండీ బీఆర్ రెడ్డి, ఈసీఎల్ డైరెక్టర్ (పర్సనల్) కేఎస్ పాత్రో, ఎంసీఎల్ డైరెక్టర్ (పర్సనల్) ఎల్ఎన్ మిశ్రా, సీసీఎల్ డైరెక్టర్ (ఫైనాన్స్) డీకే ఘోష్, యాజమాన్యాల తరపున హెచ్ఎంఎస్ నుంచి నాతూలాల్‌పాండే, సీఐటీయూ నుంచి డీడీ రామానందన్, బీఎంఎస్ నుంచి వైఎన్ సింగ్, ఏఐటీయూసీ నుంచి లకన్‌లాల్ మహాతో, సీఎంవోఏఐ నుంచి వీపీ సింగ్ సభ్యులుగా నియమించారు. వీరిని సమన్వయ పరిచేందుకు ఏకే సక్సేనాను కో–ఆర్డినేటర్‌గా నియమించారు. బొగ్గు పరిశ్రమలో ఏడు రోజుల పని విధానం, ఇతర అంశాలపై వచ్చేనెల 9న డ్రాఫ్ట్ కమిటీ సమావేశం, 10న పూర్తిస్థాయి జేబీసీసీఐ సమావేశం నిర్వహించేందుకు ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, హెచ్ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్‌అహ్మద్, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి బి.జనక్‌ప్రసాద్, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి మంద నర్సింహారావు తెలిపారు.