ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మందమర్రి రూరల్: ‘ప్రభుత్వం అనుమతిస్తే కరోనా బాధితున్ని రెండు గంటల్లో బాగు చేస్తా.. ఇదివరకు మూడొందల మందిని నయం చేశా’అంటున్నాడు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన సింగరేణి రిటైర్డ్ కార్మికుడు బచ్చలి భీమయ్య. మందమర్రిలో మరో ఆనందయ్య.. కరోనా బాధితులకు ఆయుర్వేదం మందు అందిస్తూ బాగు చేస్తున్నాడంటూ బుధవారం సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అయింది.
పట్టణంలోని మారుతినగర్‌లో నివాసం ఉంటున్న భీమయ్య.. తన తాత దగ్గర వనమూలికల వైద్యం గురించి తెలుసుకున్నానని చెప్పాడు. దగ్గు, దమ్ము ఊపిరితిత్తుల సమస్యలకు 13 రకాల వన మూలికలతో తయారుచేసిన మందు కరోనా బాధితులకు బాగా పనిచేస్తుందని, రెండు గంటల్లో నయం అవుతుందని పేర్కొన్నాడు. ఉచితంగానే ఈ మందు అందిస్తున్నానని తెలిపాడు. కాగా, భీమయ్య అందించే మందుకు ఎలాంటి శాస్త్రీయత లేదని మందమర్రి సీఐ ప్రమోద్‌రావు చెప్పారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రచారాన్ని ప్రజలు నమ్మి మోసపోవద్దని సీఐ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment