అంబులెన్సులు అధిక చార్జీలు అడగొద్దు | Ambulance Rent Charges fixed In Mancherial District | Sakshi
Sakshi News home page

అంబులెన్సులు అధిక చార్జీలు అడగొద్దు

Published Tue, May 18 2021 11:09 AM | Last Updated on Tue, May 18 2021 11:09 AM

Ambulance Rent Charges  fixed In Mancherial District - Sakshi

జిల్లా కేంద్రంలో అంబులెన్స్‌ల అద్దె ధరల వివరాలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ

మంచిర్యాల: మంచిర్యాల జిల్లాలో అంబులెన్స్‌ యజమానులు కరోనా రోగుల నుంచి ఇష్టారీతిన డబ్బులు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి. దీంతో రామగుండం పోలీస్‌ కమిషనర్‌ వి.సత్యనారాయణ ఆదేశాలతో అంబులెన్స్‌ల యజమానులతో సోమవారం మంచిర్యాల ఏసీపీ అఖిల్‌ మహాజన్‌ సమావేశమయ్యారు.

దూరం, పేషెంట్‌ పరిస్థితుల ఆధారంగా వాహన ధరలు నిర్ణయించారు. అనంతరం చార్జీల వివరాలతో జిల్లా కేంద్రంలో ఇలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఇందులో పేర్కొన్న ధరలకు మించి అదనంగా వసూలు చేస్తే ఫిర్యాదు చేయాలని ఫ్లెక్సీపై ఫోన్‌ నంబర్‌ 7386595450 ముద్రించారు.
చదవండి: Coronavirus: శ్మశానవాటికలోనే ఐసోలేషన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement