slavery
-
ఇటలీలో 33 మందితో వెట్టి చాకిరీ.. సూత్రధారులైన ఇద్దరు
రోమ్: ఇటలీలోని వెరోనా ప్రావిన్స్‌లో వ్యవసాయ క్షేత్రాల్లో 33 మంది భారతీయులతో వెట్టి చాకిరీ చేయిస్తున్న ఆరోపణలపై సూత్రధారులైన ఇద్దరు భారతీయుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 4.33 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. తప్పుడు లెక్కలు చూపుతూ పన్ను ఎగవేతకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే ప్రావిన్స్‌లో తోటల్లో పనిచేసే సత్నాం సింగ్ అనే భారతీయుడు ఇటీవల ప్రమాదవశాత్తూ చేతి కోల్పోగా యజమాని అతన్ని రోడ్డు పక్కన వదిలేయడం, వైద్య సాయం ఆలస్యమై మరణించడం తెలిసిందే. దీనిపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రధాని మెలోనీ కూడా దీన్ని ఖండించారు. ఈ ఘటనతో ఇటలీ వ్యవసాయ క్షేత్రాల్లో అనధికారికంగా పనిచేసే భారతీయ కారి్మకుల దుస్థితి వెలుగులోకి వచి్చంది. సుమారు 2 లక్షల మంది భారతీయులు ఇటలీలోని వ్యవసాయ క్షేత్రాల్లో మగ్గిపోతున్నారని విదేశాంగ శాఖ అంచనా. -
ఇటలీలో బానిసత్వం!.. 33 మంది భారతీయ కార్మికుల విముక్తి
రోమ్: భారతీయ వ్యవసాయ కార్మికులను బానిస వ్యవస్థ నుంచి కాపాడినట్లు ఇటలీ పోలీసులు తెలిపారు. శనివారం ఉత్తర వెరోనా ప్రావిన్స్‌లో 33 మంది భారత కార్మికులను ఇద్దరు వ్యక్తుల నుంచి విడిపించినట్లు చెప్పారు. నిందితుల నుంచి అర మిలియన్ యూరోలు (సుమారు రూ. 45 లక్షలు) స్వాధీనం చేకున్నామని పేర్కొన్నారు.ఇటలీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘‘ఈ ముఠా ఇండియా నుంచి సీజనల్ వర్క్ పెర్మిట్‌తో ఇక్కడి వ్యవసాయ కార్మికులను తీసుకువస్తారు. వారికి మంచి ఉపాధి చూపిస్తాని చెప్పి.. 17000 యూరోలు (సమారు రూ.15లక్షలు) కట్టమని చెబుతారు. వారానికి 7 రోజులు, రోజు 10-12 గంటలు పని. ఒక్క గంటకు నాలుగు యూరోలు ఇస్తామని ఒప్పందం చేయించుకుంటారు. కానీ, అలా చేరిన కార్మికులను బానిసలు పని చేయించుకుంటారు. .. మరికొంత డబ్బు ఇస్తే.. శాశ్వత వర్క్ పర్మిట్ ఇస్తామని నమ్మిస్తారు. కానీ, అది కూడా ఎప్పటికీ జరగదు. బాధిత కార్మికులు ఈ ముఠా సభ్యులు ఇటలీలో భద్రత, ఉపాధి అవకాశాలు, చట్టబద్ధమైన నివాస పత్రాలు అందిస్తామని మోసం చేస్తూ పని బానిసత్వంలోకి దించుతారు’అని పోలీసులు తెలిపారు. ఇతర యూరోపియన్ దేశాలతో పోల్చితే.. ఇటలీలో తీవ్రమైన కార్మికుల కొరత నెలకొంది. దీంతో ఇక్కడికి పని చేయడానికి వచ్చే వారికి కొన్ని ముఠాలు తక్కువ వేతనంతో ఇతర దేశాల వ్యవసాయ కార్మికులను మోసం చేస్తారు. లేబర్ చట్టాల ఉల్లంఘనలను ఇటలీ తీవ్రంగా ఎదుర్కొంటోంది. -
రాజ్యాంగం నుంచి ‘ఇండియా’ పేరు తొలగించాలి.. బీజేపీ ఎంపీ సంచలన డిమాండ్
న్యూఢిల్లీ: 26 పార్టీలతో కూడిన ప్రతిపక్ష 'ఇండియా' కూటమి పేరు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. విపక్షాల INDIA కూటమిపై అధికార బీజేపీ విమర్శలు, వ్యంగ్యస్త్రాలు సంధిస్తోంది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ, ఉగ్రవాద సంస్థలు ఇండియన్ ముజాహిద్దీన్, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా..పేర్లలో కూడా ఇండియా పేరు ఉందని ఇటీవల ప్రధాని మోదీ విరుచుకుపడిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష కూటమికి దిశానిర్దేశం లేదని.. ఇండియా అనే పేరు పెట్టుకున్నంత మాత్రాన ప్రజలు మోసపోరని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఇండియా పేరుపై వివాదం రాజ్యసభలోనూ చెలరేగింది. ఇండియా అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలని ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ ఎంపీ నరేష్ బన్సాల్ రాజ్యసభలో సంచలన డిమాండ్ చేశారు. ‘ఇండియా’ (INDIA) అనేది నిజమైన పేరైన ‘భారత్’ స్థానంలో వలసరాజ్యం విధించిన పదమని ఆయన పేర్కొన్నారు.. ఇండియా పేరు మన దేశంలో నేటికీ బానిసత్వానికి చిహ్నమని, దానిని వెంటనే తొలగించాలని బీజేపీ ఎంపీ అన్నారు. చదవండి: గవర్నర్‌ను వదిలేసి వెళ్లిపోయిన విమానం.. అధికారులు సీరియస్ ఆయన మాట్లాడుతూ.. విప్లవకారులు, స్వాతంత్య్ర సమరయోధుల పోరాడి బలిదానాల దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందన్నారు. తర్వాత 1950లో రూపొందించిన రాజ్యాంగంలో ఇండియా దట్ ఈజ్ భారత్’ అని రాశారన్నారు.. ప్రాచీన కాలం నుంచి దేశానికి భారత్ అనే పేరు ఉందని, ఆ పేరుతోనే పిలవాలని తెలిపారు. స్వాతంత్య్ర స్వర్ణయుగంలో వలస వారసత్వాన్ని దూరం చేయాలని పిలుపునిచ్చారు. గత ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ బానిసత్వ చిహ్నాలను వదిలించుకోవాలని విజ్ఞప్తి చేశారని నరేష్ బన్సాల్ గుర్తు చేశారు. అదే సమయంలో వాటి స్థానంలో భారతీయ చిహ్నాలు, విలువలు, ఆలోచనలను అమలు చేయాలని ఆయన సూచించారు. అయితే బన్సాల్ మాత్రమే కాదు ఇప్పటికే చాలా మంది బీజేపీ నేతలు 024 లోక్‌సభ ఎన్నికలు ‘ఇండియా-భారత్ మధ్య జరిగే పోరాటంగా పేర్కొంటున్నారు. राज्यसभा में बोले बीजेपी सांसद नरेश बंसल "इंडिया नाम गुलामी का प्रतीक है, संविधान से हटा देना चाहिए" #Nareshbansal #RajyaSabha #INDIA pic.twitter.com/LvlivkiYMV — Alka Awasthi (@alkaawasthi01) July 28, 2023 ఇదిలా ఉండగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని ఎన్డీయే సర్కార్‌ను ఓడించడమే లక్ష్యంగా 26 విపక్ష పార్టీలు కలిసి ‘ఇండియా పేరిట కూటమిగా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఇటీవల బెంగళూరులో జరిగిన సమావేశంలో ఈ పేరును ఫిక్స్ చేశాయి. తదుపరి సమావేశం ముంబయిలో నిర్వహించనున్నారు. శివసేన (యూబీటీ), ఎన్సీపీ శరద్ పవార్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరగనుంది. అయితే ఆగస్టు 25, 26 తేదీల్లో ఈ సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సమావేశంలోనే 11 మంది సభ్యులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. చదవండి: పిచ్చిపిచ్చిగా కొట్టుకున్న అత్తా కోడళ్లు .. వీడియో తీసిన కొడుకు -
ఆంగ్ల బానిసత్వం మనకొద్దు
అదాలజ్/గాంధీనగర్: ఆంగ్ల భాష పట్ల బానిస మనస్తత్వం నుంచి నూతన విద్యా విధానంతో దేశం బయట పడుతుందని ప్రధాని నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. 5జీ టెలికాం సేవలు విద్యా వ్యవస్థను మరో స్థాయికి తీసుకెళ్తాయన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంతో స్మార్ట్ సదుపాయాలు, స్మార్ట్ తరగతి గదులు, స్మార్ట్ బోధనా రీతులు అందుబాటులోకి వస్తాయన్నారు. గుజరాత్లో గాంధీనగర్ జిల్లాలోని అదాలజ్‌లో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘మిషన్ స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్’ను మోదీ బుధవారం ప్రారంభించారు. ‘‘ఇంగ్లిష్ కేవలం ఒక భావప్రసార మాధ్యమమే. అయినా ఆ భాషలో పరిజ్ఞానముంటేనే మేధావులుగా పరిగణించే పరిస్థితి ఉంది. ప్రతిభావంతులైన గ్రామీణ యువత ఇంగ్లిష్‌లో నైపుణ్యం లేదన్న కారణంతో డాక్లర్లు, ఇంజనీర్లు కాలేకపోతున్నారు’’అని వాపోయారు. ఇతర భాషల్లోనూ ఉన్నత చదువులు చదువుకొనే అవకాశం ఇప్పుడుందన్నారు. గ్రామీణ విద్యార్థులకు లబ్ధి తన స్వరాష్ట్రం గుజరాత్లో విద్యారంగంలో గత రెండు దశాబ్దాల్లో ఎనలేని మార్పులు వచ్చాయని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. 1.25 లక్షల కొత్త తరగతి గదులు నిర్మించారని, 2 లక్షల మంది టీచర్లను నియమించారని ప్రశంసించారు. స్కూల్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద మరో 50,000 క్లాస్‌రూమ్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. లక్ష క్లాస్‌రూమ్‌లను 5జీ టెక్నాలజీతో స్మార్ట్ తరగతి గదులుగా మార్చబోతున్నట్లు చెప్పారు. ఆన్లైన్లో పాఠాలు వినొచ్చని, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఎంతగానో లబ్ధి పొందుతారని వివరించారు. విద్యార్థులు చిన్న వయసు నుంచే పోటీ పరీక్షల కోసం సన్నద్ధం కావొచ్చని, రోబోటిక్స్ వంటి కొత్త సబ్జెక్టులు నేర్చుకోవచ్చని సూచించారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్చడానికి తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ‘శాల ప్రవేశోత్సవ్, గుణోత్సవ్’ వంటి కార్యక్రమాలు ప్రారంభించానని గుర్తుచేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మోదీ సంభాషించారు. రక్షణ స్వావలంబన గర్వకారణం ఇకపై దేశీయంగా ఉత్పత్తి అయిన రక్షణ పరికరాలనే కొనుగోలు చేయాలని మన రక్షణ దళాలు నిర్ణయించుకోవడం సంతోషకరమని మోదీ చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్‌కు ఇది నిదర్శనమన్నారు. గుజరాత్లో ‘డిఫెన్స్ ఎక్స్పో–2022ను ప్రధాని మోదీ ప్రారంభించారు. 2021–22లో 13,000 కోట్ల రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేశామని, రూ.40,000 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వెల్లడించారు. భారత్–పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో బనస్కాంతా జిల్లా దీసాలో వైమానిక స్థావరం నిర్మాణానికి మోదీ పునాదిరాయి వేశారు. -
షరియా.. ఉల్లంఘిస్తే ఉరే
కాబూల్: అఫ్గానిస్తాన్‌ను తాలిబన్లు మళ్లీ హస్తగతం చేసుకోవడంతోపాటు తమ పాలనను ప్రజలపై రుద్దడానికి ప్రయత్నాలు ప్రారంభించిన నేపథ్యంలో షరియా చట్టంపై ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది. అఫ్గాన్‌లో తాలిబన్లు షరియా చట్టాన్ని కఠినంగా అమలు చేస్తారని, మహిళలకు ఇక కష్టాలు తప్పవని, వారు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోతారని, మగవాళ్ల కింద బానిసలుగా మారిపోతారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ చట్టానికి తాలిబన్లు తమదైన సొంత భాష్యం చెబుతున్నారు. నిజానికి షరియా అనేది ఇస్లాం లో ఒక చట్టబద్ధమైన వ్యవస్థ అంటున్నారు. షరియా చట్టం కింద అఫ్గానిస్తాన్‌లోని మహిళలు వారి హక్కులను సంపూర్ణంగా అనుభవించవచ్చని భరోసా ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో తాలిబన్ల పాలనలో ఈ చట్టం కింద మహిళల స్థితిగతులు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.. ► మహిళలు మార్కెట్‌కు వెళ్లొచ్చా? వెళ్లొచ్చు. అయితే, వారి కుటుంబానికే చెందిన ఒక పురుషుడు తప్పనిసరిగా తోడుగా ఉండాలి. ఒంటరిగా బయట అడుగు పెట్టడానికి వీల్లేదు. ► బయటకు వెళ్లి స్నేహితులతో సరదాగా గడపొచ్చా? ఎంతమాత్రం కుదరదు. మహిళల సరదాలు, సంతోషాలు ఇంటికే పరిమితం. బయటకు వెళ్లి దొరికిపోతే కఠిన శిక్షలుంటాయి. ► మగ స్నేహితులను కలవొచ్చా? 12 ఏళ్ల వయసు దాటిన పరాయి పురుషులతో, కుటుంబ సభ్యులు కాని మగవాళ్లతో మాట్లాడటానికి అనుమతి లేదు. ► చదువుకోవచ్చా? మహిళలు చదువుకోవచ్చు. కానీ, బయట స్కూల్, కాలేజీల్లో కాదు. ఇళ్లల్లోనే చదువు నేర్చుకోవాలి. స్కూళ్లు, కాలేజీలు, మదర్సాలు కేవలం మగవాళ్ల కోసమే. ► మేకప్ వేసుకోవచ్చా? మహిళలు కనీసం గోళ్ల రంగుతో సహా ఎలాంటి మేకప్ వేసుకోవడానికి తాలిబన్లు అనుమతించరు. ► సంగీతం, నృత్యం నేర్చుకోవచ్చా? షరియా కింద సంగీతం చట్టవిరుద్ధం. డ్యాన్స్ కూడా నేర్చుకోవద్దు. వేడుకల్లో పాటలు పాడిన వారిని, నృత్యాలు చేసిన వారిని తాలిబన్లు గతంలో శిక్షించారు. ► కార్యాలయాల్లో పని చేయవచ్చా? చేసుకోవచ్చు. బ్యాంకులు, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే మహిళలు ఇళ్లకు తిరిగి వెళ్లేటప్పుడు తాలిబన్లు ఎస్కార్టుగా వస్తుంటారట. మహిళల బదులు వారి కుటుంబాల్లోని మగవాళ్లను ఉద్యోగాలకు పంపించాలని సూచిస్తుంటారట. ► బుర్ఖా తప్పనిసరిగా ధరించాలా? అవును ధరించాల్సిందే. షరియా చట్టం ప్రకారం మహిళలు తమ అందాన్ని బహిర్గతం చేయకూడదు. 8 ఏళ్లు దాటిన ప్రతి బాలిక బయటకు వెళ్లి నప్పుడల్లా బుర్ఖా ధరించాలి. బయటకు వెళ్లి ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే కుటుంబ సభ్యుల్లోని మగవారిని తోడుగా తీసుకెళ్లాలి. ► బిగ్గరగా మాట్లాడొచ్చా? అలా మాట్లాడొద్దు. మహిళలు అందరికీ వినిపించేలా గట్టిగా మాట్లాడడం నేరం. ► హై హీల్స్ సంగతేంటి? ఎత్తు మడమల చెప్పులు, బూట్లను తాలిబన్లు నిషేధించారు. మహిళలు నడిచేటప్పుడు శబ్దం రాకూడదు. ► ఇంటి బాల్కనీలో కూర్చోవచ్చా? తాలిబన్ల పాలనలో బాల్కనీల్లో మహిళలు కనిపించకూడదు. ఇంటి లోపలే ఉండాలి. ► సినిమాల్లో నటించవచ్చా? మహిళలు సినిమాల్లో నటించడం, వారి ఫొటోలను వార్తా పత్రికల్లో, పుస్తకాల్లో, పోస్టర్లలో ప్రచురించడం నిషిద్ధం. మోడలింగ్ చేయరాదు. ► షరియా చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏమవుతుంది? ఈ చట్టాన్ని ఉల్లంఘించడాన్ని తాలిబన్లు సీరియస్‌గా తీసుకుంటారు. కొరడాలతో కొట్టడం, రాళ్లతో కొట్టి చంపడం, బహిరంగంగా ఉరి తీయడం వంటి కఠినమైన శిక్షలు విధిస్తారు. -
ఐదేళ్లుగా చాకిరీ, ప్రాణం పోతున్నా వినలేదు!
భోపాల్: వెట్టి చాకిరీకి కాలం చెల్లినా దేశంలోని చాలా చోట్ల ఇంకా ఈ దోపిడీ వ్యవస్థ కొనసాగుతోంది. పూటగడవక ఇబ్బందుల్లో ఉన్నవారికి కొంత మొత్తం ముట్టజెప్పి.. ఆ మొత్తం తిరిగి చెల్లించేవరకు ఎలాంటి వేతనం ఇవ్వకుండా చాకిరీ చేయించుకునే విధానం (బాండెడ్ లేబర్) మధ్యప్రదేశ్‌లో తాజాగా వెలుగు చూసింది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తమ బిడ్డను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆ తల్లిదండ్రులు ఎంత వేడుకున్నా యజమాని కనికరించలేదు. దీంతో వైద్యం అందక ఎనిమిదేళ్ల బాలుడు ప్రాణాలు విడిచాడు. గుణాలో గత ఆదివారం ఈ అమానుష ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. పహల్వాన్ సింగ్ అనే వ్యక్తి ఎగువ తరగతికి చెందిన ఓ వ్యక్తి వద్ద ఐదేళ్ల కిత్రం రూ.25 వేలు అప్పుగా తీసుకున్నాడు. వాటిని తిరిగి చెల్లించేవరకు తన పంట పొలంలో పనిచేయాలని అప్పు ఇచ్చిన వ్యక్తి కాగితాలపై సంతకాలు తీసుకున్నాడు. బాకీ చెల్లించేవరకు వారికి రూపాయి కూడా ఇవ్వనని ఒప్పందం చేసుకున్నాడు. ఇక అప్పటినుంచి పవహల్వాన్ సింగ్ కుటుంబం పనిచేస్తూనే ఉంది. ఈక్రమంలో వారం కిత్రం అతని కుమారుల్లో ఒకరు (8) అనారోగ్యం బారినడపడ్డాడు. చిన్నారిని ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు యజమానిని డబ్బులు అడగ్గా.. పవహల్వాన్ సింగ్‌పై దాడి చేశాడు. (చదవండి: ముగ్గుర్ని చంపి, శవాలతో శృంగారం) అదేసమయంలో పరిస్థితి విషమించడంతో చిన్నారి ప్రాణాలు విడిచాడు. కాగా, బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వెట్టిచాకిరీ చేయించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ వ్యవస్థను రూపుమాపేందుకు కేంద్ర ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. గుణ ప్రాంతంలో వెట్టి బతుకులపై ఆరా తీసుతీసున్నామని వెల్లడించారు. పహల్వాన్ సింగ్ మరో ఇద్దరు పిల్లలు కూడా మలేరియాతో బాధపడుతున్నారని, వారిని ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. (చదవండి: తప్పు ఒప్పుకుంటున్నా, మాస్క్ పెట్టుకుంటా) -
బానిసత్వం నేటికీ నేరం కాదా?
బానిసత్వం ప్రతిచోటా చట్టవిరుద్ధమే అంటూ న్యూయార్క్ టైమ్స్ పదేపదే ప్రపంచ ఆర్థిక వేదికపై ప్రవచిస్తూనే ఉంది. గత 40 సంవత్సరాలుగా దీన్ని ఒక మంత్రంలాగా ఆ పత్రిక జపిస్తూనే ఉంది. ఈ ప్రకటనలోని సత్యాన్ని దశాబ్దాలుగా ప్రపంచం అంగీకరిస్తూనే ఉంది. కానీ మేం చేసిన తాజా పరిశోధన బట్టి చూస్తే మన ప్రపంచంలోని దాదాపు సగం దేశాలకు పైగా.. మనిషిని బానిసగా చేసుకోవడం నేరం అని నేటికీ చట్టాలు చేయకుండా గడిపేస్తున్నాయి. ప్రజలపై చట్టబద్ధ యాజమాన్యం కలిగి ఉండటాన్ని గత రెండు శతాబ్దాల క్రమంలో అన్ని దేశాలు నిషేధించాయి. కానీ అనేక దేశాల్లో ప్రజలపై యాజమాన్య హక్కు కలిగి ఉండటం అనేది ఒక నేరంగా నేటికీ గుర్తించడం లేదు. ప్రపంచంలోని దాదాపు సగం దేశాలు బానిసత్వం లేక బానిస వ్యాపారాన్ని చేస్తే జరిమానా విధిస్తూ క్రిమినల్ లాను నేటికీ రూపొందించలేదు. 94 దేశాల్లో మరొక మనిషిని బానిసగా ఉంచుకున్నందుకు న్యాయవిచారణ జరిపి శిక్షలు విధించడం జరగటం లేదు. ప్రపంచమంతటా బానిసత్వం చట్టవిరుద్ధ మని ప్రకటించారని ఆధునిక బానిసత్వ వ్యతిరేక ఉద్యమం ప్రకటించిన అత్యంత ప్రాథమిక అంచనాలను మేం తాజాగా చేసిన పరిశోధన తోసిపుచ్చుతోంది. ఈ పరిశోధనలో బయటపడిన వాస్తవాల ఆధారంగా, 2030 నాటికి ఆధునిక బానిసత్వాన్ని నిర్మూలించాలనే లక్ష్యంతో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలపై మరోసారి దృష్టి పెట్టడానికి వీలవుతోంది. నిర్బంధ శ్రమ, మనుషుల అక్రమ తరలింపు, బానిసత్వాన్ని ఆచరిస్తున్న సంస్థల కార్యకలాపాలు, బానిస వ్యాపారం, బానిసత్వ భావన కూడా ఆధునిక బానిసత్వంలో భాగమే అవుతుంది. ప్రపంచంలోని 96 దేశాల్లో మనుషుల అక్రమ తరలింపు వ్యతిరేక చట్టాలు ఏదో రకంగా అమలులో ఉన్నాయి కానీ మనుషుల దోపిడీ రకాలను నిషేధించడంలో చాలా దేశాలు విఫలమవుతున్నాయి. మా పరిశోధనలో తేలిన వివరాల ప్రకారం.. 1. ప్రపంచంలోని 94 దేశాలు లేక మొత్తం దేశాల్లో 49 శాతం బానిసత్వాన్ని నిషేధిస్తున్న చట్టాలను ఇంకా రూపొందించలేదు. 2. 112 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 58 శాతం నిర్బంధ శ్రమకు శిక్ష విధించే శాసన నిబంధనలను అమలుపర్చలేదు. 3. 180 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 93 శాతం బానిసత్వాన్ని పాటించడం నేరంగా ప్రకటించే చట్టాలను రూపొందించలేదు. 4. 170 దేశాలు లేక ప్రపంచ దేశాల్లో 88 శాతం బానిసత్వానికి సమానమైన కార్యకలాపాలను సాగిస్తున్న సంస్థలను నేరస్త సంస్థలుగా ప్రకటించలేదు. ఈ అన్నిదేశాల్లో, మానవ దోపిడీకి సంబంధించి అత్యంత తీవ్ర విధానాలను పాటిస్తున్న ప్రజలను, సంస్థలను శిక్షించడానికి ఏవిధమైన నేర న్యాయ శాసనాలనూ ఇంకా రూపొందించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బానిసత్వం చట్టవిరుద్ధం అనే భావన ఈనాటికీ సమాజ అనుభవంలోకి రావడం లేదు. బానిసత్వ క్లుప్త చరిత్ర ఆధునిక చరిత్రలో బ్రిటిష్ బానిసత్వ నిషేధ ఉద్యమం బానిస వ్యాపారానికి అంతం పలికింది. బానిస వ్యాపారాన్ని చట్టబద్ధమైన వ్యాపారంగా అనుమతిస్తున్న చట్టాలను ఇది నిషేధించింది. 19వ శతాబ్దిలో బానిస వ్యాపారాన్ని నేరంగా భావించే చట్టాలను రూపొందించాలని ప్రభుత్వాలు అడిగేవి కాదు. దానికి బదులుగా బానిస వ్యాపారాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా రద్దు చేయాలని మాత్రమే అవి భావించేవి. తర్వాత 1926లో నానాజాతి సమితి స్లేవరీ కన్వెన్షన్‌ని రూపొందించింది. ఇది బానిసత్వాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా రద్దు చేయాల్సిందిగా ఆయా దేశాలను కోరింది. కానీ తర్వాత వచ్చిన అంతర్జాతీయ మానవహక్కుల వ్యవస్థ దీన్ని పూర్తిగా మార్చివేసింది. 1948 నుంచి దేశాలకు బానిసత్వ విధానాలను రద్దు చేయడం కాకుండా పూర్తిగా నిషేధించాలని కోరడం మొదలైంది. దీంతో బానిసత్వాన్ని అనుమతించే ఏ చట్టాన్నయినా ఉంచుకోకుండా జాగ్రత్తపడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై పడింది. ఒక వ్యక్తిని బానిసగా చేసుకునే విధానాన్ని నిలిపివేసే చట్టాలను ప్రభుత్వాలు రూపొందించాల్సి వచ్చింది. కానీ చాలా ప్రభుత్వాలు బానిసత్వాన్ని పాటించడం నేరం అనేలా చట్టాలు అమలుపర్చలేదని తెలుస్తోంది. దాదాపు 90 సంవత్సరాలుగా అంటే 1926 నుంచి 2016 వరకు.. ఒక వ్యక్తిపై మరో వ్యక్తి ఆజమాయిషీకి, నియంత్రణకు వీలిస్తున్న బానిసత్వం ఉనికిలో లేదని ఎందుకంటే వ్యక్తులపై యాజ మాన్య హక్కులను అనుమతిస్తున్న అన్ని చట్టాలను ప్రభుత్వాలు రద్దు చేసేశాయనే అభిప్రాయం బలపడిపోయింది. బానిసత్వం ఉనికిలో లేకుండా చట్టాలు వచ్చేశాయనే స్పృహ అందరిలో బలపడిపోయింది. బానిసత్వమే ఉనికిలో లేకుండా పోయాక, దాన్ని నిషేధించే చట్టాలను ఆమోదించడంలో హేతువు లేదనే ఆలోచన కూడా వచ్చేసింది. అయితే ఈ రకం ఆలోచనకు 1926లో బానిసత్వంపై మొదటగా ఇచ్చిన నిర్వచనం మలాం పూసింది. ఈ నిర్వచనం ప్రకారం ఒక వ్యక్తికి చెందిన కొన్ని లేక అన్ని అధికారాలనూ మరొకరి యాజమాన్యానికి కట్టబెట్టే స్థితిని బానిసత్వం అని చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ నిర్వచనం ఒక వ్యక్తి మరొక వ్యక్తిని చట్టబద్ధంగా సొంతం చేసుకునే పరిస్థితులకు మాత్రమే అన్వయమవుతోందని ప్రపంచవ్యాప్తంగా న్యాయస్థానాలు గుర్తించాయి. కాబట్టి బానిసత్వంపై ఈ నిర్వచనంలోని భాషను పరిశీలిద్దాం. సంప్రదాయికంగా ప్రజలపై చట్టపరమైన యాజమాన్యం అమలయ్యే వ్యవస్థల ద్వారా బానిసత్వాన్ని రూపొందిస్తూ వచ్చారు. దీని ప్రకారం కొందరి హక్కులు మరొకరి ఆస్తిగా చలామణి కావడానికి చట్టమే అవకాశమిచ్చింది. కానీ కొత్తగా గుర్తించిన బానిసత్వపు పరిస్థితి అనేది చట్టంతో పనిలేకుండా వాస్తవంగానే అమలవుతున్న బానిసత్వం గురించి చెబుతోంది. దీంట్లో చట్టబద్ధంగా వ్యక్తిపై యాజమాన్యం అనేది కనిపిం చదు కానీ ఒక వ్యక్తి మరొకరిపై యాజమాన్య అధికారాన్ని చలాయించగలడు. అది మరొక వ్యక్తికి చెందిన బానిస స్థితినే సూచిస్తుంది. ఈ నేపథ్యంలో బానిసత్వాన్ని చట్టబద్ధంగా నిర్మూలించినప్పటికీ బానిసత్వం మరొక రూపంలో ప్రపంచంలో అమలవడానికి వీలుందనే అభిప్రాయం బలపడుతోంది. వ్యక్తిని అధికారబలంతో చిత్రహింస పెట్టడం అనేది 18వ శతాబ్దంలోనే చట్టం ద్వారా నిషేధించినప్పటికీ, అణగదొక్కడం అనేది చట్టవిరుద్ధమే అయినప్పటికీ నేటికీ అమలవుతూనే ఉందని చెప్పాలి. వ్యాసకర్త రైట్స్ ల్యాబ్ అసోసియేట్ డైరెక్టర్, అసోసియేట్ ప్రొఫెసర్, నాటింగ్‌హామ్ వర్సిటీ -
కిడ్నాప్ చేసి వెబ్ సిరీస్ చూపించాడు
న్యూయార్క్ : అమెరికాలో తీవ్ర స్థాయిలో ఉన్న వర్ణ వివక్షపై అలెక్స్ హేలీ అనే రచయిత 'రూట్స్' అనే నవల రాశారు. ఆ నవలలో ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన నల్లజాతి వారిని బానిసలుగా విక్రయించడాన్ని రచయిత వివరించారు. ఆ క్రమంలో వారిని చిత్రహింసలకు గురిచేసే తీరు.. అమెరికాకు తీసుకొచ్చాక వారిపై సాగించే దురాగతాలను కళ్లకు కట్టినట్లు ఆ పుస్తకంలో వివరించారు. ఇప్పటికీ అమెరికాలో ఎక్కడో ఒక చోట వర్ణ వివక్ష ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా అమెరికాలో మాత్రం ఒక విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఆఫ్రో అమెరికన్ రాబర్ట్ నోయెస్ (52) తనకు పరిచయం ఉన్న ఒక తెల్లజాతి మహిళను కిడ్నాప్ చేశాడు. ఆమెను కిడ్నాప్ చేసి తన ఇంటికి తీసుకెళ్లిన రాబర్ట్.. విచిత్రమైన శిక్షను అమలు చేశాడు. అదేంటంటే.. ఏకధాటిగా 9 గంటలు 'రూట్స్' మినీ వెబ్ సిరీస్‌ను చూడాలని బలవంతం చేశాడు. అయితే సదరు యువతి అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేయగా.. ఆమెను పట్టుకొని టీవీ ముందు నుంచి కదిలావంటే శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి చంపేస్తానని బెదిరించాడు. వర్ణ వివక్ష అనేది ఎంతలా ఉందనేది ఆమెకు అర్థమయ్యేందుకే రాబర్ట్ 'రూట్స్' సిరీస్ చూపించినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. కాగా రాబర్ట్ నోయెస్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. అలెక్స్ హేలీ రాసిన ప్రసిద్ద 'రూట్స్' నవల 1977లో టీవీ సిరీస్‌గానూ రూపుదిద్దుకొంది. తన మూలాలను వెతుక్కుంటూ ఏడు తరాల బానిస గోసను హేలీ కళ్లకు కట్టినట్టుగా వివరించారు. స్వేచ్ఛ నుంచి సంకెళ్లకు, సంకెళ్ల నుంచి విముక్తికి సాగిన రూట్స్ నవలను ఏడు తరాల ప్రస్థానంగా అభివర్ణించవచ్చు. -
బలహీనులకు అండ మహా ప్రవక్త
పూర్వం అరబ్బు సమాజంలో కట్టు బానిసత్వం ఉండేది. బానిసను పశువుకంటే హీనంగా చూసేవారు యజమానులు. ఏదైనా తేడా వస్తే గొడ్డును బాదినట్లు బాదేవారు. రెండు పూటలా తిండి దొరికితే చాలన్నట్లు బానిసలు గొడ్డు చాకిరీ చేసేవాళ్లు. ఆ కాలంలో నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి) అనే కట్టు బానిస ఉండేవారు. ఆయన ఒకరోజు తాను ఇస్లామ్ ధర్మం పట్ల ఎలా ఆకర్షితులయ్యారో వివరించారు. ‘‘నాకు ఒకరోజు తీవ్ర చలి జ్వరం సోకింది. బండెడు చాకిరీ చేయించే నా యజమాని అంత జ్వరంలోనూ ఎన్నో కిలోల బార్లీ విసరాలని పురమాయించాడు. చలికి తోడు జ్వరం ఇబ్బందిపెట్టడంతో కంబళి కప్పుకొని పాలు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుందామని మేను వాల్చేసరికి నిద్రపట్టింది. అంతలోనే అటుగా వచ్చిన నా యజమాని నేను నిద్రించడం చూసి నన్ను గొడ్డును బాదినట్లు నిర్దయగా కొట్టాడు. చలిజ్వరంతో బాధపడుతున్నానన్న కనికరం కూడా చూపకుండా నా ఒంటిపై కంబళిని లాక్కొని పిండి విసరాలని నిర్బంధించాడు. చేసేదేం లేక రోదిస్తూ బార్లీ గింజలను విసుర్రాయిలో వేసి బలాన్ని కూడగట్టుకుని విసరసాగాను. అంతలో ముహమ్మద్ ప్రవక్త (సఅసం) అటు పక్కనుంచే వెళుతున్నట్లున్నారు. నేను మూలుగుతున్న శబ్దానికి లోనికి వచ్చి ‘‘ఎందుకేడుస్తున్నావు. ఏం కష్టమొచ్చింది’’ అని అడిగారు. దానికి నేను ‘పోపో నీ పని నువ్వు చూసుకో. అందరూ అడిగేవారే కానీ ఆదుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు. పోపో’ అని విసుక్కున్నాను. నా మాటలకు ప్రవక్త మహనీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు కానీ కాసేపటికే వారు ఒక చేతిలో వేడి వేడి పాలచెంబు, మరో చేతిలో ఖర్జూరాలను తీసుకొచ్చారు. పాలను తాగించారు. ఖర్జూరాలను తినిపించారు. ఆ తరువాత నన్ను ‘‘వెళ్లి కంబళి కప్పుకొని హాయిగా విశ్రాంతి తీసుకో, నీ బదులు నేను విసురుతాను.’’ అని విసుర్రాయి తిప్పడం మొదలెట్టారు. ఉదయాన్నే లేవగానే రాత్రంతా పట్టిన పిండిని నాకు అప్పజెప్పి వెళ్లిపోయారు. రెండోరోజు రాత్రి కూడా ప్రవక్త మహనీయులు పాలచెంబు, ఖర్జూరాలతో ప్రత్యక్షమయ్యారు. నన్ను వెచ్చటి దుప్పటిలో నిద్రపుచ్చి విసుర్రాయి విసరసాగారు. ఇలా మూడు రోజులు ప్రవక్త మహనీయులు నా పని తన భుజాలపై వేసుకుని నాకు విశ్రాంతి కల్పించారు. మూడోరోజు ఉదయాన్నే ప్రవక్త వెళుతుండగా నేను ఆయనను ఆలింగనం చేసుకుని ‘మీగురించి సమాజం తప్పుగా మాట్లాడుతోంది. మీపై బురదజల్లేందుకు మీగురించి దుష్పచ్రారం చేస్తున్నారు. బానిసలపట్ల జాలి, దయ, కరుణ చూపే మీరు నిజంగా దేవుని ప్రవక్త అని నేను విశ్వసిస్తున్నానని విశ్వాసం ప్రకటించాను.’’ అని చెప్పుకొచ్చారు. బలహీను లకు అండగా నిలిచేవారే నిజమైన నేతలు, ప్రవక్తలు. – ముహమ్మద్ ముజాహిద్ -
ఆధునిక బానిసత్వంలో నాలుగు కోట్ల మంది!
న్యూయార్క్ : ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలు ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారని ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పనిచేస్తున్న అంతర్జాతీయ కార్మిక సంస్థ, అంతర్జాతీయ ఎన్జీవో సంస్థ ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ సంయుక్తంగా నిర్వహించిన ఓ సర్వేలో తేలింది. ప్రతి నలుగురు బానిసల్లో ఒకరు పిల్లలు కావడం మరింత బాధాకరం. బెదిరింపులు లేదా నిర్బంధం వల్ల రెండున్నర కోట్ల మంది వెట్టి చాకిరి చేస్తుండగా, లక్షన్నర మంది పెళ్లి ముసుగులో వెట్టి చాకిరి చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది బానిసత్వం అనుభవిస్తుంటే తాము చట్టాల ద్వారాగానీ, సహాయ సహకారాలు అందించడం ద్వారాగానీ కొన్ని లక్షల మంది బానిసలను మాత్రమే విడిపించగలుగుతున్నామని ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ గ్లోబల్ రీసెర్చ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫియోనా డేవిడ్ తెలిపారు. ఈ సర్వేలో అంతర్జాతీయ కార్మిక సంస్థతో కలసి వాక్ ఫ్రీ ఫౌండేషన్ పాల్గొనడం ఇదే మొదటిసారి. 2016 సంవత్సరంలో ఈ సర్వేను నిర్వహించగా, వాటి వివరాలను ‘ఆధునిక బానిసత్వంపై ప్రపంచవ్యాప్తంగా అంచనాలు–2017’ పేరిట వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా నానాటికి పెరిగిపోతున్న ఆధునిక బానిసత్వంపై ప్రతి ఏటా పలు సంస్థలు సర్వేలో జరుపుతున్నా వాటి లెక్కల మధ్య మాత్రం ఎంతో తేడాలు ఉంటున్నాయి. దీనికి కారణం బాహ్య ప్రపంచానికి తెలియకుండా బానిసత్వం కొనసాగడం ఒక్కటైతే, కొన్ని సంస్థలు బానిసత్వానికి నిర్వచనం ఇవ్వడంలో కూడా భిన్న ప్రమాణాల పాటించడం మరోటి. ఆధునిక బానిసత్వంలో 71 శాతం మంది మహిళలు, బాలికలే ఉన్నారు. వారిలో 99 శాతం మంది వేశ్యవత్తిలో కొనసాగుతున్నారు. వారిలో 84 శాతం పెళ్లి పేరిట బానిసత్వంలో మగ్గుతున్నారు. బలవంతంగా పెళ్ళిళ్లు చేసుకున్నవారిలో 37 శాతం పిల్లలు ఉండగా, వారిలో 21 శాతం మంది వేశ్యవత్తిలో కొనసాగుతున్నారు. మానవులు అక్రమ రవాణా, బలవంతపు పెళ్లిళ్లు, నిర్బంధం వెట్టి, అప్పులిచ్చి వెట్టి చేయించుకోవడం ద్వారా ఆధునిక బానిసత్వం కొనసాగుతోందని ఫ్రీ వాక్ ఫౌండేషన్ నిర్వచనం చెబుతోంది. భయపెట్టడం, బెదిరించడం, నిర్బంధించడం ద్వారా ఆధునిక బానిసలను అదుపుచేస్తున్నారని ఫౌండేషన్ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. 15.20 కోట్ల మంది బాల కార్మికులు ప్రపంచవ్యాప్తంగా బాల కార్మికులపై ‘ఫ్రీ వాక్ ఫౌండేషన్’తో సంబంధం లేకుండా సర్వే జరిపిన అంతర్జాతీయ కార్మిక సంస్థ మరో నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 15.20 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు. వారిలో దాదాపు ఏడున్నర కోట్ల మంది ప్రజలు ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ప్రాణాలకు భద్రతలేని చోట, ఆరోగ్యానికి హాని కలిగే ప్రాంతాల్లో వారు పనిచేస్తున్నారు. ఆఫ్రికా, పసిఫిక్, ఆసియా ప్రాంతాల్లోనే 90 శాతం బాల కార్మికులు పనిచేస్తుండగా, ఒక్క ఆఫ్రికా ప్రాంతంలోనే 20 శాతం మంది పనిచేస్తున్నారు. -
ఆధునిక బానిసత్వం అంటే ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: స్లేవరీ అంటే బానిసత్వం. ఈ పదం వినగానే ఉత్తర అమెరికాలో నల్లజాతీయులు అనుభవించిన బానిసత్వం బతుకు గుర్తొచ్చి ఒళ్లు గగుర్పొడుస్తుంది. ఆ స్థాయిలో కాకపోయినా భారత్‌లో ఇప్పటికీ 1.80 కోట్ల మంది బానిసలుగా బతుకుతున్నారని ఆస్ట్రేలియాకు చెందిన ‘వాక్ ఫ్రీ ఫౌండేషన్’ సంస్థ వెల్లడించింది. ప్రపంచంలోని 167 దేశాల్లో దాదాపు నాలుగున్నర కోట్ల మంది ప్రజలు బానిసలుగా జీవిస్తుంటే ఒక్క భారత్‌లోనే అత్యధికంగా 1.80 లక్షల మంది బానిసలుగా బతుకుతున్నారని ఫౌండేషన్ తెలిపింది. అంతేకాకుండా భారత దేశంలో సగానికి సగం జనాభా ‘మోడ్రన్ స్లేవరి లేదా ఆధునిక బానిసత్వం’ (వెట్టి చాకిరి)లో నివసిస్తున్నారట. ఇక్కడ వెట్టిచాకిరంటే శారీరకంగా, మానసికంగా ఎలాంటి స్వేచ్ఛ లేకుండా యజమానుల బెదిరింపులకు భయపడి గొడ్డు చాకిరి చేస్తూ బతకడమని గ్లోబల్ స్లేవరి ఇండెక్స్ నిర్వచిస్తోంది. ఇటుక బట్టీల్లో, గనుల్లో వెట్టి చాకిరి చేయడం, బలవంతంగా వ్యభిచార వృత్తిలో కొనసాగడం, ఈ రెండు వృత్తుల్లో పనిచేసే వారు ఎక్కువగా చిన్నప్పుడే కిడ్నాపై రావడం ద్వారా జరుగుతుంది. బలవంతంగా బిచ్చమెత్తించడం కూడా బానిసత్వమే. ప్రభుత్వేతర సాయుధ దళాల్లో బలవంతంగా చేర్చుకోవడం, భవన నిర్మాణం, పరిశ్రమలు, వ్యవసాయం, మత్స్యపరిశ్రమలోకి బాండెడ్ లేబర్‌గా పిల్లలతో పనిచేయడం కూడా ఆధునిక బనిసత్వమే. ఈ అన్ని రకాల ఆధునిక బానిసత్వం భారత్‌లో కొనసాగుతోంది. ఇంట్లో బట్టలుతికి, గిన్నెలు కడిగే పని మనుషులు కూడా ఈ ఆధునిక బానిసత్వాన్ని అనుభవిస్తున్నారు. అయితే ఇంకా దాన్ని ఈ కేటగిరీలో చేర్చలేదు. వారు కూడా లైంగిక దోపిడీకి, బెదిరింపులకు గురవుతున్న సందర్భాలు కూడా ఉండడం వల్ల వారిని కూడా ఈ కేటగిరీలో చేర్చాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉంది. -
వెట్టి నిర్మూలనకు కఠిన చట్టాలు
కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో వెట్టిచాకిరీ నిర్మూలనకు కేంద్రం కృషి చేస్తోందని, ప్రస్తుతం అమలులో ఉన్న చట్టాలను మరింత కఠినతరం చేసి వాటి అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. వెట్టిచాకిరీ నిర్మూలన అంశంపై జాతీయ మానవ హక్కుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఢిల్లీలో జరిగిన రెండు రోజుల సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వెట్టిచాకిరి బారినపడ్డ వారిని గుర్తించడానికి దేశవ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి కార్పస్ ఫండ్ కేటాయించనున్నట్టు తెలిపారు. వెట్టిచాకిరీ నుంచి బాలలను విముక్తి చేసి 12వ తరగతి వరకు విద్యనందించి ఉపాధి కల్పనకు శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించారు. వెట్టిచాకిరీ కింద విముక్తి పొందిన అనాథ పిల్లలు, మహిళలు, వికలాంగులకు తక్షణ ఆర్థిక సాయం చేయడానికి జిల్లా మేజిస్ట్రేట్లకు పూర్తి బాధ్యతలు అప్పగించినట్టు తెలిపారు. విముక్తి పొందిన ఒంటరి మహిళల వివాహ బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందన్నారు. వంశీ కుటుంబాన్ని ఆదుకోండి.. కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నల్లజాతీయుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన వంశీరెడ్డి కుటుంబసభ్యులను ఆదుకోవాలని, వంశీరెడ్డి మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించడానికి చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్‌ను కలసి దత్తాత్రేయ విజ్ఞప్తి చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది.. అక్రమాస్తుల కేసులో అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ దోషిగా తేలడం వెనుక బీజేపీ పాత్ర ఏమీ లేదని, ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని దత్తాత్రేయ అన్నారు. శశికళను దోషిగా తేల్చడం వెనుక బీజేపీ హస్తం ఉందన్న ఆరోపణలను కొట్టిపారేశారు. ఉపాధి కూలీలకు వేసవి అలవెన్స్ : అదనంగా 30 శాతం భత్యం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధిహామీ పథకం కింద పనులు చేస్తున్న కూలీలకు వేసవి అలవెన్స్‌ను ప్రకటిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎండ వేడిమికి కూలీలలో పనిచేసే సామర్థ్యం తగ్గనున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధిహామీ కూలీలకు రోజువారీ అందుతున్న వేతనానికి ఇకపై అదనంగా 20 నుంచి 30 శాతం వేసవి భత్యం అందనుంది. ఫిబ్రవరి 1 నుంచి జూన్ 30 వరకు వేసవి భత్యం ఉత్తర్వులు వర్తించనున్నాయి. ఫిబ్రవరిలో 20 శాతం, మార్చిలో 25 శాతం, ఏప్రిల్, మే నెలల్లో 30 శాతం, జూన్‌లో 20 శాతం చొప్పున వేసవి అలవెన్స్‌ను అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలివ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. -
కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు: దత్తాత్రేయ
న్యూఢిల్లీ: భవన కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించనున్నట్లు కేంద్ర మంత్ర బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారత్‌లో వెట్టిచాకిరి ప్రధాన సమస్య అని పలు దేశాలు అంటున్నాయి.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు సర్వే చేపట్టనున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు. -
‘బానిసత్వం’లో భారత్‌దే తొలిస్థానం
దేశంలో 1.84 కోట్ల మందిది ఆధునిక బానిస బతుకు: నివేదిక మెల్బోర్న్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బానిసల్లో ఎక్కువమంది భారత్‌కు చెందినవారేనని 2016 ప్రపంచ బానిసత్వ సూచిక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 4.6 కోట్ల మంది ప్రజలు బానిసత్వంలో మగ్గుతున్నారని అందులో 1.84 కోట్ల మంది భారత్‌కు చెందిన వారేనని తాజా నివేదక వె ల్లడించింది. వ్యభిచారం, భిక్షాటన, నిర్బంధంగా పనిచేసే కార్మికులు ఆధునిక బానిసలుగా మారుతున్నారని వివరించింది. హింస, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, మోసగించడం వంటి చర్యల ద్వారా చాలామంది బాధితులు ఈ ఆధునిక బానిసత్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నారని కూడా నివేదిక పేర్కొంది. ఆస్ట్రేలియాలోని వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారత్ తరువాత ఐదు ఆసియా దేశాలు వరుసగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్లు నిలిచాయి. ఉత్తర కొరియా, ఇరాన్, ఎరిత్రియా, హాంకాంగ్, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, గ్వినియా, డెమోక్రాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణ సూడాన్ దేశాల్లో ఈ అధునిక బానిసత్వంపై కనీస చర్యల్ని ప్రభుత్వాలు తీసుకోవడం లేదని నివేదిక చెప్తోంది. నెదర్లాండ్స్, అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, క్రొయేషియా, స్పెయిన్, బెల్జియం, నార్వేలు దీనిపై పటిష్టంగా పోరాడుతున్నాయంది. -
దేశంలో 1.80 కోట్ల మంది బానిసలు!
మోడరన్ బానిసలు ఎక్కువగా ఉన్నది మన దేశంలోనేనట. దాదాపు కోటి ఎనభై లక్షల మందికి పైగా భారతీయులు కట్టుబానిసలుగాను, బిచ్చగాళ్లుగా, వ్యభిచారులుగా, బాల కార్మికులుగా బతుకీడుస్తున్నారని ఓ అంతర్జాతీయ సర్వేసంస్థ తెలిపింది. హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ వాక్ ఫ్రీ పౌండేషన్ కు చెందిన ది గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ ఈ విషయాలను బయటపెట్టింది. దాదాపు భారత జనాభాలో 1.4 శాతం బానిసలుగా బతుకుతున్నారని వివరించింది. ఇలా దేశ జనాభాలో బానిసలు అధికంగా ఉన్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. మొత్తం 167 దేశాల్లో నిర్వహించిన ఈ సర్వేలో ఇండియాలో బానిసత్వం కొనసాగుతోందని తేలినట్లు చెప్పింది. వీటిలో ముఖ్యంగా కట్టుబానిసలు, బాల కార్మికులు, వ్యభిచారులు, భిక్షాటనలో ఉన్నవాళ్లు, బలవంతపు పెళ్లిళ్లు ముందు ముందు కూడా కొనసాగుతాయని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మొత్తం బానిసల్లో 58 శాతం మంది ఇండియా, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్థాన్ దేశాల లోనే ఉన్నట్లు సంస్థ వెల్లడించింది. మనుషుల అక్రమ రవాణా, కట్టుబానిసత్వం, వ్యభిచారం, బాలకార్మిక తదితర చట్టాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ భారత ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తెచ్చింది. కానీ వీటన్నింటినీ నిర్వహించే గ్యాంగుల జోరు మాత్రం తగ్గడం లేదు. పేద కుటుంబాలకు గాలం వేసి ఉద్యోగాలిప్పిస్తామని చెప్పి వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారు. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలంటే ప్రైవేటు ఉద్యోగుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించుకుని, దాన్ని తరచు పరిశీలించుకోవాలని సర్వే సంస్థ సూచించింది. ఉగ్రవాద సంస్థలకు ఆకర్షితులవుతున్న వారిలో జమ్మూ-కశ్మీర్, జార్ఖండ్, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన పిల్లలు ఎక్కువగా ఉంటున్నారని హెచ్చరించింది. -
‘ఇంగ్లండ్ డాటర్’
ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మగ్గుతోందని భావించే- మనల్ని బానిసత్వంలో మగ్గించిన దేశపు మహిళ కొన్ని తప్పుడు మాటల్ని చిత్రంగా రూపొందించగా ఈ దేశంలో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని ఉద్రేకపడుతున్నారు. డిసెంబర్ 16, 2012. నిర్భ య రేప్. ఆరుగురు రేప్ చేసి ఆమె మర్మావయవాలను గాయం చేసి దారుణంగా చంపారు. దేశ అత్యున్నత న్యాయ స్థానం వారికి ఉరిశిక్ష విధించిం ది. ఒక నేరస్తుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మూడేళ్ల తర్వాత ఒక ఇం గ్లండ్ డాటర్ లెస్లీ ఉడ్విన్ అనే చిత్ర నిర్మాత- ప్రపం చంలో మహిళలకు జరిగే అన్యాయా న్ని గురించి ‘ఇండియాస్ డాటర్’ అనే డాక్యు మెంటరీని తీయడానికి పూనుకుంది. ఆ మధ్య ఇంగ్లండ్‌లో చాలా రేప్‌లు జరిగాయి. కాని ఈ ఇంగ్లండ్ డాటర్‌కి నమూనాగా ఇండియా డాటర్ రేపే కావలసి వచ్చింది. ఇండియా వచ్చి-ఈ దేశపు చట్టాలు సవ్యంగా పని చేస్తే-ఈపాటికి ఉరికంబం ఎక్కవలసిన ముఖేష్‌సింగ్ అనే మానవ మృ గాన్ని కలిసింది. ఈయన ఇంటర్వ్యూకి రెండు లక్షలు అడిగాడు. 40 వేలకి ఒప్పందం కుదిరింది. ఈ పశువు చెప్పిన విషయాలు, అతని మాటల్లోనే: ‘‘కుర్రాడి కంటే రేప్‌కి అమ్మాయికే బాధ్యత ఎక్కువ. రాత్రి 9 గం టలకి మర్యాదైన ఆడపిల్ల రోడ్డు మీద తిరగదు. ఇంటి పని, వంటపని ఆడవాళ్ల పనులు. డిస్కో లకి తిరగడం, తప్పుడు బట్టలు వేసుకోవడం కాదు. నేను రేప్ చేస్తున్నపుడు ఆమె ఎదిరించకుండా ఉండాల్సింది. నిశ్శబ్దంగా రేప్ జరగనివ్వాలి. అప్పుడు వ్యవహారం ముగిశాక ఆమెని వదిలేసేవాళ్లం-కుర్రాడిని నాలుగు తన్ని.’’ ఈ కేసు వాదిస్తున్న ప్రబుద్ధుడు డిఫెన్స్ లాయర్ ఏపీ సింగ్ గారి అభిప్రాయాలు, వారి మాటల్లోనే, ‘‘ నా కూతురో, చెల్లెలో పెళ్లికాకుండా ప్రేమలో పడి అవమా నకరంగా ప్రవర్తిస్తే - ఆవిడని నా ఫార్మ్‌హౌస్‌కి తీసుకెళ్లి నా బంధువులందరి ముందూ పెట్రోలు పోసి తగ లెడతాను.’’ నాకు ఈ డాక్యుమెంటరీని చూసే అవకాశం, అదృ ష్టం కలగలేదు. కాని దీన్ని చూసి తీరాలని చాలామంది మేధావులు ఈ దేశంలో గొంతు చించుకుంటున్నారు. సమాజంలోని తప్పుడు ఆలోచనా ధోరణిని (mindset) ఎండగట్టడానికి ఇలాంటి డాక్యుమెంటరీ రావలసిందే నని ప్రముఖ కవి, రచయిత జావెద్ అఖ్తర్ పార్లమెం టులో గొంతు చించుకున్నారు. ఆయన రచనల మీదా, కవితల మీదా నాకు అపారమైన గౌరవం. ఇక్కడ ఆగు తాను. కాని ముఖేష్‌సింగ్ మాట ఈ దేశపు ఆలోచనా ధోరణికి ప్రాతినిధ్యం వహించదు. ఒక దౌర్భాగ్యుడి moral perversion, decadenceకీ మాత్రమే నిదర్శనం. ఈ ఇంగ్లండ్ డాటర్ చేసిన నేరాలు. 1. మరణశిక్ష పడిన ఖైదీని ఇంటర్వ్యూ చెయ్యడానికి ఎవరు అనుమతి ఇచ్చారో తెలియదు. 2. నిర్భయ పేరుని ప్రకటించింది. 3. ఆమె ఫొటోను ప్రకటించింది(ట). 4. పూర్తయిన డాక్యుమెంటరీని అధికారులకు చూపి వారి సమ్మతిని తీసుకోలేదు. 5. బీబీసీ దీనిని మహిళా దినోత్సవానికి ప్రసారం చేయాలని తలపెట్టి, దేశంలో అలజడి లేవగానే లోపాయికారీగా ముందుగానే ప్రసారం చేసేసింది. ఈ డాక్యుమెంటరీని ఫలానా ఉడ్విన్ డెన్మార్క్, స్వీడన్, స్విట్జర్లాండ్, నార్వే, కెనడాలలో ప్రసారం చేయ సంక ల్పించిందట. ఇండియాలో 24X7 చానల్ మార్చి 8న ప్రసారానికి అంగీకరించింది. ఆరు దేశాలలో ‘ఇండియాస్ డాటర్’ ప్రసారం భారతదేశానికి ఏ విధంగా ఉపయోగం? ఉడ్విన్‌కి డబ్బు కలసివస్తుంది. మనకి గబ్బు కలసివస్తుంది. బ్రిటిష్ వారికి మన పట్ల ప్రేమని అలనాడు చర్చిల్ నాటి నుంచీ వింటున్నాం. మన దేశంలో- నాకు తెలుగు బాగా రాదు క్షమిం చాలి-ఇంటెలెక్చువల్ హిపోక్రసీ ఎక్కువ. హృదయ వైశాల్యం గల భారతీయ మేధావులు-ఇండియా రేప్ కథని - ఇందుమూలంగా అంతర్జాతీయంగా లేచిన దుమారాన్నీ సొమ్ము చేసుకోవాలని తాపత్రయపడ్డ ఓ ఇం గ్లండ్ డాటర్ కళాఖండాన్ని-చట్టాలనీ మాన వీయ విలువలనీ ఆంక్షలనీ విస్మరించి- ఆరు దేశాలలో ప్రసా రం చేయడం ద్వారా ఈ దేశ ప్రజల ఆలోచనా ధోరణి మార్పుకు సహకరిస్తుందని భావిస్తున్నారు. ఓ నీచుడి తప్పుడు మాటల్ని ఇంకా ఈ దేశం బానిసత్వంలోనే మగ్గుతోందని భావిం చే- మనల్ని బానిసత్వంలో మగ్గించిన దేశపు మహిళ చిత్రంగా రూపొందించగా ఈ దేశం లో మేధావులు దాన్ని నెత్తిన వేసుకుని పత్రి కల్లో పార్లమెంటుల్లో ఉద్రేకపడుతున్నారు. ఆత్మాభిమానం ఉన్న ఏ భారతీయుడైనా-పశు ప్ర వృత్తికి ఓ ఆడపిల్ల జీవితాన్ని బలిచేసి, డబ్బు కోసం దిక్కుమాలిన, దుర్మార్గపు అభిప్రాయాలను చెప్పగా, దా న్ని సొమ్ము చేసుకుని-సమాజ హితమని దొంగ పేరు పెట్టిన ఘనమైన నిర్మాతకి సవినయంగా, స్పష్టంగా, నిర్ద్వంద్వంగా ఒకే ఒక్కమాట చెప్పాలని నరాలు పొంగు తున్నాయి: ‘‘షటప్!’’ (ఈ కాలమ్ రాశాక అమెరికా మిత్రుడు డాక్యు మెంటరీని పంపారు. దాన్ని చూశాక కూడా ఒక్క అక్షరం మార్చాలని అనిపించలేదు.) -
బహుముఖీన బానిసత్వం
వివరం కన్నీటికి ఇంకిపోయే లక్షణమే లేకుంటే ఈ ప్రకృతిలో మరో సాగరం పొంగుతూ ఉండేది. ఈ అనంత చరిత్రలో బానిసలు కార్చిన కన్నీటిరాశి సాగరమంత పరిమాణంలోనే ఉంటుంది. ఆ వ్యవస్థది అంత లోతైనవిషాద గాథ. కానీ, శబ్దం చేయకుండా ఆ కన్నీటి సంద్రం చరిత్రనంతటినీ తడుపుతూనే ఉంది. పిరమిడ్ల నిర్మాణానికి రాళ్లెత్తిన వాళ్లూ; అమెరికా, రష్యాల ఆర్థిక వ్యవస్థలకు పునాదులు తవ్విన వాళ్లూ బానిసలే. పురాతన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నిర్మాతలు వారే. అయినా ఈ భూప్రపంచం మీద ఏ జాతి, ఏ దేశం, ఏ కాలం, ఏ మతం బానిస వ్యవస్థ మౌన రోదనకు కరగలేదు? ఆధునిక నాగరికతకు ఆకృతినివ్వడానికి బానిసలు కురిపించిన ఘర్మజలానికి ఎవరూ ఖరీదు కట్టలేదు. ఒక మనిషిని బానిసగా పని చేయించుకోవడం కంటె, స్వేచ్ఛాజీవిగా విడిచి పని చేయించుకుంటే ఎక్కువ లాభమని మానవతావాదులు చెప్పినా ప్రపంచం వినలేదు. మెడనీ, మణికట్లనీ, పాదాలనీ కలిపి బంధించే మొరటు సంకె ళ్ల కఠోర శబ్దం ఇప్పుడు వినిపించకపోవడం ఆధునిక ప్రపంచం చేసుకున్న అదృష్టం. కానీ మనుషుల అక్రమ రవాణా, వ్యభిచారానికి అమ్ముడుపోతున్న అబల దేహం, సంఘ వ్యతిరేక శక్తుల హుంకారాలతో తుపాకీ పట్టిన బాల్యం బానిస వ్యవస్థ కొనసాగింపే. డిసెంబరు 2 అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం. ఆ సందర్భంగా క్రీ.పూ.1వ శతాబ్దం నుండి క్రీ.శ.21వ శతాబ్దం వరకు ఉనికిలో ఉన్న బహుముఖీన బానిసత్వంపై ఈవారం మన ‘వివరం’. బానిసత్వం, బానిసలు అనే పేర్లు వినగానే అదేదో వేల ఏళ్ల నాటిదని ప్రపంచం భావించవచ్చు. కానీ అది శుద్ధ అబద్ధం. వాస్తవానికి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ బానిసత్వాన్ని రద్దు చేశాయి. కానీ ఎక్కడ చూసినా ఆ వ్యవస్థ జాడ కనిపిస్తోంది. ఈ ఆధునిక ప్రపంచంలో కాళ్లకూ చేతులకూ గొలుసులతో, అర్ధనగ్నంగా బానిసలు కానరారు. కానీ బానిస వ్యవస్థ ఒక వాస్తవం. గ్లోబల్ సర్వే ఇండెక్స్ అంచనా ప్రకారం ప్రపంచంలో ఇవాళ మూడు కోట్ల అరవై లక్షల మంది బానిసలుగా బతుకుతున్నారు. బలవంతపు చాకిరి, రుణం చెల్లించలేక బానిసలుగా బతకడం, అక్రమ రవాణాతో స్త్రీ, పురుషులు బానిసలుగా మారిపోవడం, బలవంతపు పెళ్లిళ్లు ఇవన్నీ బానిసత్వం పరిధిలోనివేనని అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి. బానిసత్వం గురించి కొద్దికాలం క్రితం బీబీసీ చేసిన వ్యాఖ్య మరీ ఆందోళన కలిగిస్తుంది. 16వ శతాబ్దంలో ఆఫ్రికా నుంచి తెచ్చిన నల్ల బానిసలతో జరిగిన వ్యాపారం చరిత్రలోనే అతి పెద్దది. అప్పుడు విక్రయించిన బానిసలు కోటీ 20 లక్షలు. కానీ ఆ సంఖ్య ఇప్పుడు రెట్టింపు పైనే ఉందని (రెండు కోట్ల 70 లక్షలు) అని బీబీసీ వెల్లడించింది. ఈ వ్యవస్థను ధ్వంసం చేయడానికి ఇప్పుడు తీవ్ర కృషి ప్రారంభించినా మరో 30 ఏళ్లు పడుతుందని ఆ అంతర్జాతీయ సమాచార వ్యవస్థ అభిప్రాయపడింది. హమ్మురాబి స్మృతి (క్రీ.పూ.1754), రుగ్వేదం, మను స్మృతి, నారద స్మృతి, ఆర్థశాస్త్రం, బైబిల్లలో బానిస వ్యవస్థ స్వరూప స్వభావాలు కనిపిస్తాయి. అయితే భారతదేశంలో బానిస వ్యవస్థకీ, ప్రపంచంలో మిగిలిన చోట్ల కనిపించే బానిసత్వానికీ ఎంతో తేడా ఉంది. ఏమైనా క్రీస్తుపూర్వమే ఈ భూమ్మీద బానిస వ్యవస్థ ఆవిర్భవించింది. ఆ ఘోర వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు కూడా జరిగాయి. నిగళాలు తెంపి పారేయడానికి బానిసల తిరుగుబాట్లు జరిగాయి. సంస్కరణోద్యమాలు జరిగాయి. అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. కానీ 2014 సంవత్సరంలో కూడా ఆ వ్యవస్థ జాడలు సుస్పష్టంగా కనిపించడమే అతి పెద్ద విషాదం. ఆధునికత , శాస్త్ర సాంకేతిక ప్రగతి వంటి భావనలను హేళన చేసే విషయం కూడా. ఈ మధ్య కాలంలో ఇస్లామిక్ స్టేట్ పేరుతో ఉగ్రవాదం నెరపుతున్న ముఠాలు... యాజ్డి, క్రిస్టియన్ తెగలకు చెందిన స్త్రీలను అపహరించి, బానిసలుగా అంతర్జాతీయ విపణిలో విక్రయించారు. ఇది ఐక్యరాజ్య సమితి వెల్లడించిన వాస్తవం. ఐదు నుంచి ఏడువేల మంది స్త్రీలను ఇలా బానిసలుగా విక్రయించారని సమితి ప్రకటించింది. ఇందులో బాలలు కూడా ఉన్నారు. మెగస్తనీస్ లేదని చెప్పినా... భారతదేశంలో బానిసలు లేరు అని ప్రకటించాడు గ్రీక్ యాత్రికుడు మెగస్తనీస్. ‘ఇండికా’ ఇతడి గ్రంథమే. క్రీస్తుపూర్వం 350-290 ప్రాంతంలో పాటలీపుత్రం వచ్చిన మెగస్తనీస్కు ఇక్కడి ‘బానిస’లను, ఆ వ్యవస్థ రూపురేఖలను చూశాక అలాంటి అభిప్రాయం కలగడంలో ఆశ్చర్యం లేదు. అయితే పునాతన భారతంలో బానిసలు లేకపోలేదు. కానీ గ్రీస్, రోమ్ వంటి ప్రదే శాలతో పోల్చినపుడు ఇక్కడ బానిస వ్యవస్థ లేదనే అనిపిస్తుంది. అలాగే మెగస్తనీస్ అభిప్రాయానికి పరిమితులు ఉన్నాయి. ఆయన పాటలీపుత్రం, మిగిలిన ఉత్తర భారతాన్ని చూసి ఈ విషయం నమోదు చేసి ఉండవచ్చు. అయినా బానిస వ్యవస్థ విషయంలో పురాతన భారతం కనికరంతోనే ఉంది. హరిశ్చంద్రుడు, చంద్రమతి, లోహితాస్యుడు బానిసలుగా అమ్ముడు పోయిన ఘట్టం మన పురాణాలలో కనిపిస్తుంది. దస్యులు లేదా దాస తెగ వారిని బానిసలుగానే రుగ్వేదం పేర్కొంటున్నది. జాతక కథలలోను ఈ వ్యవస్థ గురించి రేఖామాత్రంగా ప్రస్తావన కనిపిస్తుంది. యుద్ధఖైదీలను ప్రపంచం మొత్తం బానిసలుగానే చూసింది. భారత్ కూడా అందుకు మినహాయింపు కాదు. కానీ ఇక్కడ బానిసలకు కొన్ని హక్కులు ఇచ్చారు. బానిస సాక్ష్యం చెల్లదు! బానిస యజమాని ఆజ్ఞలనే శిరసావహించాలని నారద స్మృతి చెబుతోంది. మనుస్మృతి ప్రకారం బానిసలకు సొంత ఆస్తి ఉండకూడదు. బానిసల సాక్ష్యం చెల్లదు. ఈ కట్టుబాట్లతో పాటు కొన్ని హక్కులు కూడా దక్కాయి. బానిసతో యజమాని ఘర్షణ పడకూడదు. బానిస దండించవలసిన స్థాయిలో తప్పు చేస్తే వీపు మీద తప్ప కొట్టరాదు. తల మీద అసలే కొట్టకూడదు. ప్రాణం తీసే హక్కు యజమానికి లేదు. అన్నిటికీ మించి వృద్ధాప్యంలో బానిసను యజమాని వదిలి పెట్టకూడదు. కౌటిల్యుడి అర్థశాస్త్రం బానిసల పట్ల మరింత ఉదార వైఖరిని అవలంబించింది. బానిసల పిల్లలు కూడా యజమాని సొంతమే. కానీ అనివార్య పరిస్థితులలో తప్ప వారిని విక్రయించరాదు. మహిళా బానిసను సగౌరవంగా చూడాలి. మహిళ పట్ల అనుచితంగా వ్యవహరిస్తే ఆమెకు విముక్తి కల్పించడంతో పాటు, నష్ట పరిహారం కూడా ఇవ్వాలి. ఆమెకు పిల్లలు ఉంటే వాళ్లకి కూడా స్వేచ్ఛ ఇవ్వాలి. బానిసలు అసలు యజమాని దగ్గర పని లేనపుడు వేరే చోట్ల పని చేసి డబ్బు సంపాదించుకోవచ్చునని అర్థశాస్త్రం చెబుతోంది. సాధారణ యువతి ఒక బానిసను వివాహం చేసుకుంటే ఆమె స్వేచ్ఛను కోల్పోక తప్పదని కాత్యాయన స్మృతి శాసిస్తున్నది. ఇందులో చాలా విషయాలు అశోకుడి శాసనాలలో కనిపిస్తాయి. మౌర్యుల కాలంలో వీరిపట్ల కనిపించే ఔదార్యం గుప్తుల కాలానికి సడలిపోయినట్టు చరిత్రకారులు చెబుతారు. అయినా ఏ కాలంలోనూ ఇక్కడ బానిస విక్రయ విపణులు నెలకొనలేదు. నిజానికి పురాతన భారతంలో బానిసలు ఆర్థిక వ్యవస్థను నిర్మించిన వారు కాదు. వీరు ప్రధానంగా ఇంటి సేవకులు. లేదా వ్యక్తిగత సేవకులు. దీనితో వీరికి దాదాపు కుటుంబ సభ్యుని హోదా లభించేది. భారతదేశంలో వ్యవసాయం ఎక్కువగా శూద్రుల వల్లే జరిగింది తప్ప బానిసల వల్ల కాదు. కోటీ 50 లక్షల మంది! ఆధునిక భార తదేశంలోనూ బానిస వ్యవస్థ జాడలు కనిపిస్తాయి. ఈ దేశాన్ని బానిస రాజులే (1206-1290) పాలించారు. దాని పేరే బానిస వంశం. అందులో ప్రముఖలైన అల్త్‌మష్, బాల్బన్ బానిసలే. 1841 నాటికి భారతదేశంలో 80 నుంచి 90 లక్షల మంది బానిసలు ఉన్నారని హెన్రీ బార్ట్లే ఫ్రెరే రాశాడు. ఇతడు వైశ్రాయ్ కౌన్సిల్ సభ్యుడు. దక్షిణ భారతంలోని మలబార్ ప్రాంత ప్రజలలో 15 శాతం బానిసలేనని చెబుతారు. దేశంలో బానిస వ్యవస్థ రద్దు కోసం ఈస్టిండియా కంపెనీ పాలనలోనే 1843లో ఇండియన్ స్లేవరీ యాక్ట్‌ను అమలులోకి తెచ్చారు. ఇక్కడ బానిసలను పశువుల్లా చూడలేదన్న గత చరిత్ర గర్వకారణమే. కానీ 2013 కంటె 2014లో భారత్‌లో బానిసత్వం పెరిగిందన్న లెక్క అత్యంత అవమానకరం. ప్రస్తుతం భారత్‌లో కోటి నలభై లక్షల మంది బానిసలు ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. చైనాలో 30 లక్షల మంది బానిసలు ఉన్నారని చెబుతున్నారు. ఈ లెక్కలు వాస్తవికమైతే ప్రపంచ బానిసలలో సగం మంది ఇక్కడే ఉన్నారు. ఆధునిక యుగం తన శైలికి తగ్గట్టు బానిస వ్యాపారానికి కూడా పరిశ్రమ హోదా వచ్చింది. కాబట్టి గణాంకాలలో దాని స్వరూపం చూడవచ్చు. ఐక్యరాజ్య సమితి లెక్క ప్రకారం బానిస వ్యాపారంలో మూడు కోట్ల మంది ఉండవచ్చు. దీని వ్యాపారం మొత్తం 35 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టారు. పది దేశాలకు సంబంధించిన వారే 76 శాతం వరకు ఈ వ్యాపారంలో వస్తువయ్యారు. మనుషులను అక్రమంగా తరలించి బలవంతంగా పనులు చేయించడం, బాల కార్మిక వ్యవస్థ, బలవంతంగా పెళ్లి చేసుకుని తీసుకువెళ్లడం, వ్యభిచార కూపాలలోకి పంపడం, వెట్టి... వీటన్నిటినీ ఇప్పుడు బానిస వ్యవస్థలో భాగంగానే పరిగణిస్తున్నారు. సూడానీస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ వంటి ఉగ్రవాద సంస్థలు పిల్లలను తమ కార్యకలాపాలలో భాగం చేస్తున్నాయి. ఆయుధాలు పట్టిస్తున్నాయి. ఇది కూడా ఒక రకం బానిసత్వమే. ఇదే పని శ్రీలంకలో ఎల్టీటీఈ కూడా చేసింది. ఈ దారుణమైన వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నాలు జరగకపోలేదు. ఈ దిశగా అంతర్జాతీయ స్థాయిలో జరిగిన తొలియత్నం 1926 నాటి జెనీవా స్లేవరీ కన్వెన్షన్. నానాజాతి సమితి దీనిని నిర్వహించింది. తరువాత 1930, 1948, 1956లలో అంతర్జాతీయ సదస్సులు జరిగాయి. వీటితో మార్పు రాలేదని చెప్పడం లేదు. కానీ కొత్త రూపంలో మళ్లీ బానిసత్వం దర్శనమిస్తూనే ఉంది. ఇది ప్రపంచ మానవాళి చిత్తశుద్ధిని శంకించేదే. బానిసత్వ నిర్మూలన దినమంటూ పాటించడం దాని ఫలితమే. సాటి మనిషిని బానిసగా, పశువులా చూడ్డమనే కళంకం నుంచి ప్రపంచం బయటపడలేదని గుర్తు చేయడమే. - డా॥గోపరాజు నారాయణరావు ఒక దుఃఖసాగరం బాటకు ఇరువైపులా సిలువలు, పాదాలకీ, మణికట్లకీ మేకులు వేసి వాటికి దిగ్గొట్టిన మానవ దేహాలు, వాటి ఎడమ రొమ్ము నుంచి కింద నుంచి రాలుతున్న నెత్తురు చుక్కలు.. వాటి మీద వాలి పొడుచుకు తింటున్న రాబందులు... ఇది ‘స్పార్టకస్’ నవల (హోవార్డ్ ఫాస్ట్) తొలి ఘట్టం. చరిత్ర ప్రసిద్ధి గాంచిన రోమ్ బానిసల తిరుగుబాటు అనంతర దృశ్యమది. తమను అత్యంత దారుణంగా హింసిస్తున్న యజమానుల మీద తిరుగుబాటు చేసిన బానిసలకు అప్పటి రాచరికం పట్టించిన దుర్గతి అది. అమెరికా రచయిత మార్క్ ట్వేన్ ‘హకల్‌బెరీఫిన్’ నవలలో బానిసలను ఎంత హీనంగా, కఠినంగా చూశారో వివరించే దృశ్యాలను నమోదు చేశారు. ఇక ఎలెక్స్ హేలీ నవల ‘రూట్స్’ (తెలుగు అనువాదం ‘ఏడుతరాలు’) నల్ల కలువల నెత్తుటి చరిత్రను అద్భుతంగా చిత్రించింది. చరిత్రకారుడు హోవార్డ్ జోన్స్ రచనల ఆధారంగా స్టీవెన్ స్పీల్బెర్గ్ తీసిన ‘అమిస్టాడ్’ చిత్రం మరొక అద్భుతం. ఇవన్నీ మనిషిని మనిషి ఎంత అమానుషంగా వేధించాడో చెప్పేవే. క్యూబా తీరం నుంచి 58 మంది బానిసలతో అమెరికాకు వస్తున్న నౌక లా అమిస్టాడ్. అందులో జరిగిన చరిత్రాత్మక తిరుగుబాటు ఉదంతాన్ని స్పీల్బెర్గ్ తెరకెక్కించారు. శ్వేత జాతీయుల దురహంకారం, కాఠిన్యం ఈ రచనలన్నిటిలో సమంగా ప్రతిబింబిస్తాయి. పారిపోయేందుకు ప్రయత్నించిన బానిసల మర్మావయవాలను కూడా తొలగించేటంత కర్కశత్వం కనిపిస్తుంది. బానిసల దుస్థితి గురించి ఏ కొద్దిమందో నిరసన తెలియచేశారు. అయినా అది కొనసాగింది! ఇరవై ఒకటో శతాబ్దంలో 2008 వరకు కూడా!! సుమేరు, ఈజిప్ట్, చైనా, అక్కాడియన్ సామ్రాజ్యం, అస్సీరియా, భారత్, రోమ్ వంటి పురాతన నాగరికతలలో బానిసలు ఉన్నారు. ఏథెన్స్ నగరంలో క్రీ.పూ. 6, 5 శతాబ్దాలలో 80,000 మంది బానిసలు ఉన్నారని చరిత్ర చెబుతోంది. 1723 నాటికి రష్యాలో బానిస వ్యవస్థ ప్రబలంగా ఉంది. ఆధునిక యుగంలో ‘కానిస్టాంట్ నోపుల్’ అతి పెద్ద బానిస విక్రయ కేంద్రంగా పేర్గాంచింది. క్రీ.శ. ఐదో శతాబ్దానికి ఇది ప్రపంచంలోనే ఐదో పెద్ద బానిసల మార్కెట్ కూడా. 1833లోనే ఇంగ్లండ్ బానిస వ్యవస్థను రద్దు చేసింది. కానీ అమలు చేయలేకపోయింది. ఒట్టోమన్ సామ్రాజ్యంలో 1908 సంవత్సరంలో కూడా ఆడ బానిసలను నడి వీధిలో విక్రయించారు. ప్రపంచంలోనే ఒక ఆర్థిక శక్తిగా ఆవిర్భవించిన చైనాలో 2007లో 550 మంది బానిసలను ఇటుక బట్టీల నుంచి విముక్తం చేశారు. షాంగ్జీ, హెనాన్ అనే ప్రాంతంలో ఇది జరిగింది. మన మహా రచయిత్రి మహాశ్వేతాదేవి ‘శనిచరి’ కథ కూడా బానిసత్వానికి సంబంధించినదే. బెంగాల్లో ఒకప్పుడు ఇటుక బట్టీలలో పని పేరుతో తీసుకువచ్చిన బాలికలను వ్యభిచార గృహాలకు ఎలా విక్రయించేవారో, వారి బతుకులు ఎంత దీనంగా తెల్లవారేవో ఈ కథలో మహాశ్వేత ఆవిష్కరించారు. ప్రాచీన కాలంలో క్రూరమైన బానిస వ్యవస్థకు పేర్గాంచిన బ్రెజిల్లో 5000 మంది బానిసలకు 2008లో విముక్తి లభించింది. 2003 నుంచి అక్కడ సాగిన పెద్ద ఉద్యమం ఫలితంగా ఇది సాధ్యమైంది. బానిసలతో పని చేయించుకుంటున్న సంస్థల పేర్లను ఉద్యమకారులు ‘డర్టీలిస్ట్’ పేరుతో బహిర్గతం చేశారు. 300 కంపెనీల పేర్లు ఆ జాబితాలో చేరాయి. ఎట్టకేలకు 2008లో ప్రభుత్వం కదిలింది. ఆ సంవత్సరమే నేపాల్‌లో ‘హలియా’ పేరుతో కొనసాగుతున్న బానిసత్వాన్ని రద్దు చేసి 20,000 మందికి స్వేచ్ఛ కల్పించారు. న్యోబోటో.... అలా ఎందరో! ‘రూట్స్’ నవలలో హేలీ చిత్రించిన ఒక పాత్ర న్యోబోటో. ఒక తండాలోని కుటుంబాల వారి పిల్లలను సాకుతూ అందరికీ తలలో నాలుకలా ఉండే అవ్వ ఆమె. ఆమె బానిస. ఆ తండా కలసి కొనుక్కున్న బానిస. కానీ ఆమెను ఎవరూ అలా చూడరు. న్యోబోటో ఆమె అసలు పేరు కూడా కాదు. మరి ఆమె ఎవరు? ఒకసారి తన కథ చెబుతుంది. ఆఫ్రికాలోనే ఒకసారి తెల్లవాళ్లు (అమెరికన్లు) న్యోబోటో ఉండే తండా మీద దాడి చేసి అందరినీ తీసుకు వెళ్లారు. పిల్లలను, వృద్ధులను చంపారు. వారితో ప్రయోజనం లేదు కాబట్టి. వయసులో ఉన్నవారిని మాత్రం ఓడలకు ఎక్కించారు. అప్పుడే ఎందుకో మరి, న్యోబోటోను దారిలో ఈ తండాకు అమ్మేశారు- బస్తాడు జొన్నలకు. న్యోబోటో అంటే బస్తాడు జొన్నలు. ఆ పేరే ఆమెకు ఖాయమైంది. బానిస వ్యాపారంలోని క్రూరత్వానికి ఈ పాత్ర గొప్ప నిదర్శనం. ఒక కుటుంబంలో తల్లిని ఒకచోట, బిడ్డలను వేరేచోట, తండ్రిని వేరే చోట విక్రయించేవారు. బతికి ఉండగా మళ్లీ ఆ కుటుంబం కలుసుకోవడం దాదాపు అసాధ్యం. ఇలా ఎన్ని కుటుంబాలో... ఎందరు న్యోబోటోలో! -
బానిసత్వం నుంచి బయటకొచ్చారు..!
పంచామృతం ‘డ్రగ్స్’ వ్యక్తిగతంగా ఉల్లాసాన్ని ఇస్తాయేమో కానీ.. వ్యక్తిగా పతనం చేస్తాయి. అయినా కొందరు ప్రముఖులు చాలా గుట్టుగా వీటి మత్తులో మునుగుతున్నారు. దొరికిన వారు దొంగలు. అలా దొరికిన వారిలో కొందరైతే మరో రకంగా స్ఫూర్తిమంతులు కూడా! ఎందుకంటే వీళ్లు ఆ వ్యసన బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. నిర్వీర్యం అయిపోతున్న దశనుంచి కోలుకుని... తలెత్తుకుని నిలబడ్డారు. తమను తాము సంస్కరించుకుని తమ శక్తిని చాటుకొన్నారు. వారే ఈ ఐదుగురు. ఏంజెలీనా జోలీ ‘ఇంకా నయం.. ఆ మత్తులో ఉన్నప్పుడే నాకు చావు రాలేదు...’ అని అంటుంది ఏంజెలీనా. నటిగా ఎంతో పేరును, వ్యక్తిగా ఎంతో ఖ్యాతిని సంపాదించుకున్న జోలీ తన ‘డ్రగ్స్’ గతం గురించి ఏమీ దాచుకోకుండా మాట్లాడుతుంది. తన టీనేజ్ అంతా కొకైన్, హెరాయిన్ల సేవనంలోనే గడిచిపోయిందని చెబుతుంది. డ్రగ్స్ అందని సమయంలో తనను తానే హింసించుకునే దశకు వెళ్లినట్టు, ఆత్మహత్యాయత్నాలు కూడా చేసినట్టుగా వివరిస్తుంది. అయితే అదృష్టవశాత్తూ తను డ్రగ్స్ మత్తు నుంచి, ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చానని జోలీ తన గతకాలపు అనుభవాలను చెబుతోంది. సంజయ్‌దత్ పొడవాటి జుట్టు... మత్తుతో మునిగినట్టుగా ఉండే కళ్లు... సునీల్‌దత్ తనయుడిగా బాలీవుడ్‌కు పరిచయం అయ్యేనాటికి సంజయ్‌దత్ రూపమది. నిర్లక్ష్యదేహభాషకు అతడు నిదర్శనంగా కనిపించడానికి కారణం డ్రగ్స్. అదే సమయంలో తల్లి మరణం, తండ్రి తీసుకున్న చొరవ దత్‌ను మార్చింది. డ్రగ్స్‌కు దూరంగా, సినిమాలకు దగ్గరగా తీసుకెళ్లింది. ఈ వ్యవహారంలో దత్ దాచుకొన్నది ఏమీ లేదు. హీరోగా ఉన్నత స్థాయికి చేరడం ఎంత నిజమో.. ఒకనాడు డ్రగ్స్ వాడకంతో అథమస్థితిలో ఉన్నది కూడా అంతే నిజమని ఒప్పుకుంటాడు దత్. డ్రూ బ్యారీమూర్ చార్లెస్ ఏంజెల్స్ సినిమాలో ఏంజిల్లా మెరిసిన, హాలీవుడ్ రొమాంటిక్ సినిమాల్లో క్యూట్‌గా కనిపించిన డ్రూ బ్యారీమూర్ వెనుక కూడా చీకటి గతం ఉంది. బాలనటిఅయిన నాటి నుంచే పేరుపొందిన డ్రూ అదే వయసులోనే డ్రగ్స్‌కు కూడా బానిస అయ్యింది. పదేళ్ల వయసులోనే తన తోటి పిల్లలతో కలిసి డ్రగ్స్మత్తులో మునిగేదాన్నని డ్రూ చెబుతుంది. అప్పటి వరకూ అలా అథమస్థితిలో ఉన్నా ఆ తర్వాత మాత్రం డ్రూ కోలుకుంది. కొత్త గమ్యాన్ని ఎంచుకొని ముందుకు సాగింది. నటిగా మాత్రమే కాకుండా సామాజిక బాధ్యతగల వ్యక్తిగా కూడా నిలుస్తోంది. బ్రాడ్‌పిట్ డ్రగ్స్‌నుంచి విముక్తి కావడంలో తనకు తానే స్ఫూర్తి అని అంటాడు బ్రాడ్‌పిట్. ఆ చెడు అలవాటుకు బానిసగా మారి... ఎన్నో రోజులను వృథా చేశాక కానీ, తను ప్రపంచాన్ని ఎంత మిస్ అవుతున్నానో, తనను తను ఎంతగా నాశనం చేసుకొంటున్నానో అర్థం కాలేదంటాడు ఈ హీరో. మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలి, మంచి జీవితాన్ని గడపాలని అంతర్గతంగా జనించిన తపన తనకు డ్రగ్స్‌నుంచి విముక్తి కల్పించిందని ఈ హాలీవుడ్ హీరో సింహావలోకనంగా చెబుతాడు. డిగో మారడోనా ఆట నుంచి రిటైరై సంవత్సరాలు గడిచిపోయినా ఈ తరం ఫుట్‌బాల్ అభిమానులకు కూడా డిగో అంటే ఎంతో క్రేజ్. ఒకవేళ తను గనుక డ్రగ్స్‌కు బానిసగా మారకపోయుంటే మరింత గొప్ప ఆటగాడిని అయ్యేవాడిని అంటాడు ఈ అర్జెంటీనా ఫుట్‌బాలర్. డ్రగ్స్ నుంచి విముక్తి పొంది ఆటపై దృష్టి నిలపడం వల్లనే ఇప్పటికీ అభిమానుల మనసుల్లో స్థానం నిలుపుకున్నానని డిగో అంటాడు. అయితే యువకుడిగా ఉన్నప్పుడు విశృంఖలంగా సాగిన డ్రగ్స్ సేవనం ఇప్పటికీ ప్రభావం చూపుతోందని బాధపడుతుంటాడు ఈ లెజండరీ ప్లేయర్. -
కార్టూన్
అయితే.. నాకెందుకు చూపిస్తున్నావో అర్థం కావడంలేదు..! -
భారత్‌లోనే బానిసలెక్కువ
మెల్బోర్న్: లక్షలాది మంది భారతీయులు ఇప్పటికీ బానిసత్వంలో మగ్గుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 3 కోట్ల మంది బానిసలు ఉంటే.. ఒక్క భారతదేశంలోనే వీరి సంఖ్య సుమారు కోటీ 40 లక్షలు ఉందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా బానిసత్వానికి సంబంధించి తొలిసారిగా గ్లోబల్ స్లేవరీ ఇండెక్స్ 2013ను గురువారం విడుదల చేశారు. ఆస్ట్రేలియాకు చెందిన వాక్ ఫ్రీ ఫౌండేషన్ ఆధునిక బానిసత్వంపై 162 దేశాల్లో సర్వే నిర్వహించి ఈ నివేదికను విడుదల చేసింది. రుణ బానిసత్వం, బలవంతంగా వ్యభిచారంలోకి దించడం, చిన్నారులను సైన్యంలో ఉపయోగించడం, బలవంతంగా పెళ్లిళ్లు చేయడం తదితర అంశాలను ఆధునిక బానిసత్వంగా ఈ సంస్థ లెక్కించింది. భారత్‌లో అత్యధికంగా కోటీ 39 లక్షల మంది, చైనాలో 29 లక్షల మంది, పాకిస్థాన్‌లో 21 లక్షల మంది, నైజీరియాలో 7 లక్షల మంది బానిసలు ఉన్నారని బానిసత్వ సూచిలో తేలింది. భారతదేశంలో ఆ దేశ పౌరులే వివక్ష ఎదుర్కొంటున్నారని, బానిసత్వం విషయంలో రాష్ట్రాలకు, రాష్ట్రాలకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉందని వెల్లడించింది. ఇక మౌరిటానియా, హైతీ, పాకిస్థాన్ తదితర దేశాలతో పాటు భారత్‌లోనూ వంశపారంపర్యంగా బానిసత్వం కొనసాగుతోందని తెలిపింది. 162 దేశాల్లో బానిసత్వంపై పదేళ్ల పాటు పరిశోధన జరిపి ఈ నివేదిక రూపొందించినట్టు వాక్ ఫ్రీ ఫౌండేషన్ తెలి పింది. కాగా, ఈ సంస్థ చెప్పిన లెక్కలో సుమారు 2 కోట్ల మందికిపైగా బలవంతంగా బానిసత్వంలోకి దించబడుతున్నారని ఐక్యరాజ్యసమితి స్పష్టం చేసింది.