న్యూఢిల్లీ: భవన కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించనున్నట్లు కేంద్ర మంత్ర బండారు దత్తాత్రేయ తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. 40 కోట్ల మంది అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భారత్లో వెట్టిచాకిరి ప్రధాన సమస్య అని పలు దేశాలు అంటున్నాయి.. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు సర్వే చేపట్టనున్నట్లు దత్తాత్రేయ పేర్కొన్నారు.
కార్మికులకు ఈపీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు: దత్తాత్రేయ
Published Sat, Jun 18 2016 5:03 PM | Last Updated on Mon, Sep 4 2017 2:49 AM
Advertisement