దేశంలో 1.84 కోట్ల మందిది ఆధునిక బానిస బతుకు: నివేదిక
మెల్‌బోర్న్: ప్రపంచవ్యాప్తంగా ఉన్న బానిసల్లో ఎక్కువమంది భారత్‌కు చెందినవారేనని 2016 ప్రపంచ బానిసత్వ సూచిక నివేదికలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా 4.6 కోట్ల మంది ప్రజలు బానిసత్వంలో మగ్గుతున్నారని అందులో 1.84 కోట్ల మంది భారత్‌కు చెందిన వారేనని తాజా నివేదక వె ల్లడించింది. వ్యభిచారం, భిక్షాటన, నిర్బంధంగా పనిచేసే కార్మికులు ఆధునిక బానిసలుగా మారుతున్నారని వివరించింది. హింస, బెదిరింపులు, అధికార దుర్వినియోగం, మోసగించడం వంటి చర్యల ద్వారా చాలామంది బాధితులు ఈ ఆధునిక బానిసత్వాన్ని విడిచిపెట్టలేకపోతున్నారని కూడా నివేదిక పేర్కొంది.
ఆస్ట్రేలియాలోని వాక్ ఫ్రీ ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం.. భారత్ తరువాత ఐదు ఆసియా దేశాలు వరుసగా చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్‌లు నిలిచాయి. ఉత్తర కొరియా, ఇరాన్, ఎరిత్రియా, హాంకాంగ్, సెంట్రల్ ఆఫ్రికా రిపబ్లిక్, గ్వినియా, డెమోక్రాట్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, దక్షిణ సూడాన్ దేశాల్లో ఈ అధునిక బానిసత్వంపై కనీస చర్యల్ని ప్రభుత్వాలు తీసుకోవడం లేదని నివేదిక చెప్తోంది. నెదర్లాండ్స్, అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఆస్ట్రేలియా, పోర్చుగల్, క్రొయేషియా, స్పెయిన్, బెల్జియం, నార్వేలు దీనిపై పటిష్టంగా పోరాడుతున్నాయంది.
‘బానిసత్వం’లో భారత్‌దే తొలిస్థానం
Published Wed, Jun 1 2016 1:39 AM | Last Updated on Mon, Sep 4 2017 1:21 AM
Advertisement