లుసానే: జూనియర్ పురుషుల హాకీ ప్రపంచ కప్‌ను మరోసారి నిర్వహించే అవకాశం భారత్‌కు లభించింది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) 2021 జూనియర్ ప్రపంచ కప్ ఆతిథ్య హక్కులను భారత్‌కు కట్టబెడుతూ సోమవారం నిర్ణయం తీసుకుంది. దాంతో భారత్ రెండోసారి ప్రపంచ కప్‌ను నిర్వహిస్తోన్న దేశంగా ఘనతకెక్కింది. 2016లో తొలిసారి లక్నో వేదికగా ఈ మెగా ఈవెంట్‌ను నిర్వహించిన భారత్ విజేతగా నిలిచింది.
మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొంటుండగా... ఇప్పటికే జర్మనీ, ఇంగ్లండ్, నెదర్లాండ్స్, స్పెయిన్, బెల్జియం, ఫ్రాన్స్‌లు అర్హత సాధించాయి. హోస్ట్ హోదాలో భారత్ కూడా ఈ టోర్నీలో ఆడటం ఖాయమైంది. అయితే ఈ మెగా ఈవెంట్ భారత్‌లో ఎక్కడ, ఎప్పుడు ఆరంభమవుతుందనే వివరాలను ఎఫ్‌ఐహెచ్ ప్రకటించాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment